
📌 Key Points
- నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా ‘అనగనగా ఒక రాజు’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్!
- సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ విలేజ్ కామెడీ సినిమాకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన!
- రాజ్‌కుమార్ హిరానీ సినిమాల స్ఫూర్తితో తెలుగులో అలాంటి ప్రయత్నం చేశానన్న నవీన్ పోలిశెట్టి!
- త్రివిక్రమ్, చినబాబు ప్రోత్సాహంతోనే ఈ సినిమాలోని కొన్ని ఎపిసోడ్లు ప్రేక్షకులకు చేరువయ్యాయి.
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతోంది. ఈ సినిమాకు వస్తున్న స్పందనతో నవీన్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.
రాజ్‌కుమార్ హిరానీ సినిమాలే స్ఫూర్తి అంటున్న నవీన్!
నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ సినిమా అనగనగా ఒక రాజు. డైరెక్టర్ మారి దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 14న విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన అనగనగా ఒక రాజు థాంక్యూ మీట్‌లో నవీన్ పోలిశెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన లేటెస్ట్ విలేజ్ కామెడీ సినిమా అనగనగా ఒక రాజు. జనవరి 14న సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది.
‘అనగనగా ఒక రాజు’ మూవీకి ఆడియన్స్ బ్రహ్మరథం!
నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. “అందరీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మాకు ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, మాకు మద్దతుగా నిలిచిన మీడియా మిత్రులకు పేరుపేరునా కృతఙ్ఞతలు” అని అన్నారు.
“మా గురువు గారు త్రివిక్రమ్ గారు, చినబాబు గారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. త్రివిక్రమ్ గారు, చినబాబు గారు ఈ సినిమా విషయంలో మమ్మల్ని నమ్మి ఎంతగానో ప్రోత్సహించారు. మేము చెప్పింది నమ్మి ఏ ఎపిసోడ్లు అయితే సినిమాలో ఉంచడానికి వారు అంగీకరించారో.. ఇప్పుడు ఆ ఎపిసోడ్లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది” అని నవీన్ పోలిశెట్టి పేర్కొన్నాడు.
త్రివిక్రమ్, చినబాబు ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైంది!
“నాకు రాజ్‌కుమార్ హిరానీ ( బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు) గారి సినిమాలంటే ఇష్టం. తెలుగులో అలాంటి సినిమా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేశాము. శ్రీరాములు లాంటి ఒక మాస్ థియేటర్లో ఈ సినిమా చూశాం. ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్‌ని ఎంతలా ఎంజాయ్ చేశారో, ఎమోషనల్ సీన్లకు అదే స్థాయిలో చప్పట్లు వర్షం కురిపించారు. మా కథ అన్ని వర్గాలు ప్రేక్షకులకు చేరువ అయిందని మాకు అప్పుడే అనిపించింది” అని నవీన్ పోలిశెట్టి చెప్పుకొచ్చాడు.
నవీన్ పోలిశెట్టి తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’ విజయం సాధించడంతో చిత్ర యూనిట్ సంతోషంగా ఉంది. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


