|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బతకడానికి చాలా కష్టంగా ఉండేది.. ఆ బాధ భరించలేక చనిపోదామనుకున్నా: నవాజుద్దీన్ సిద్ధిఖీ

Published: 08-11-2025, 2:29 AM
బతకడానికి చాలా కష్టంగా ఉండేది.. ఆ బాధ భరించలేక చనిపోదామనుకున్నా: నవాజుద్దీన్ సిద్ధిఖీ

బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తన సినీ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని సంఘటనలను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఒకప్పుడు తాను పడిన ఆర్థిక సమస్యలు, ఆత్మహత్య ఆలోచనలు, స్నేహితులను కోల్పోయిన బాధను ఆయన వివరించారు.

Key Points

1

నవాజుద్దీన్ సిద్ధిఖీ తన జీవితంలో ఎన్నో కష్టాలు, దారిద్ర్యాన్ని అనుభవించారు.

2

ఆర్థిక సమస్యలతో ఆత్మవిశ్వాసం కోల్పోయి 8 ఏళ్లు దుర్భల జీవితం గడిపారు.

4

ఆలోచన మార్చుకుని ధైర్యంగా ముందుకు సాగాలని నిర్ణయించుకొని సక్సెస్ అయ్యారు.

నవాజుద్దీన్ సిద్ధిఖీ జీవిత పోరాటం

బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ(Nawazuddin Siddiqui) ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడమే కాకుండా హీరోగానూ బిగ్ స్క్రీన్‌పై కనిపించారు. పలు హిట్స్ తన ఖాతాలో వేసుకున్న ఆయన అమ్మాయిల పాత్రలో లేడీ గెటప్‌లో కూడా నటించి ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. ఇటీవల ‘థామా’(Thamma)తో ప్రేక్షకుల ముందుకు రాగా పాజిటివ్ టాక్ దక్కింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన జీవితంలోని జరిగిన విషయాలు పంచుకున్నారు. ఒకప్పుడు ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ కొన్ని ప్రాజెక్ట్స్ మధ్యలో ఆగిపోయాయి. నా స్థానంలోకి వేరే వారిని తీసుకున్నారని అన్నారు. అప్పుడు నాకు ఆర్థిక పరిస్థితి కూడా దారుణంగా మారడంతో ఆత్మవిశ్వాసం కోల్పోయాడట. దరిద్రం వెంటాడుతోందనుకుని.. 8 సంవత్సరాలు దుర్భలమైన జీవితాన్ని గడిపినట్లు తెలుపుతూ ఎమోషనల్ అయ్యాడు.

ఈ సమయంలో తన ముగ్గురు స్నేహితులు కూడా తనను వదిలి ప్రాణాలు కోల్పోవడం.. ఆ బాధ మరింత ఎక్కవైంది. వాళ్లు లేని జీవితం చాలా కష్టతరంగా అనిపించింది. దీంతో నేను ఓ నిర్ణయానికి వచ్చాను. ఒకసారి రైలులో ప్రయాణించే సమయంలో అందులోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలని డోర్ దగ్గరకు వెళ్లాను.. కానీ దూకే ముందు.. జీవితాన్ని మధ్యలో ముగించకూడదన్న ఆలోచన రావడంతో ధైర్యంగా ముందుకు సాగాలని అనుకున్నాను. ఈ సమయంలోనూ తన కొచ్చిన మూడు ప్రాజెక్టులు హిట్ అందుకుని తన జీవితాన్ని మార్చేసినట్లు తెలిపారు. అలా ఇప్పటివరకు వరుస చిత్రాలు చేస్తున్నా.. వెనక్కి తిరిగి చూడాల్సిన పరిస్థి ఏర్పడలేదని అన్నారు.

ఆర్థిక కష్టాలు, ఆత్మహత్య ఆలోచనలు

స్నేహితుల మరణం, విజయం

నవాజుద్దీన్ సిద్ధిఖీ పడిన కష్టాలు, వాటిని అధిగమించి విజయం సాధించిన తీరు ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన కథ మనకు నేర్పుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.