|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘నయనతార’కు చంద్రముఖి చిక్కులు

Published: 08-07-2025, 12:20 AM
'నయనతార'కు చంద్రముఖి చిక్కులు

నయనతార జీవితం ఆధారంగా తెరకెక్కిన డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్’పై వివాదాలు కొనసాగుతున్నాయి. ధనుష్ దాఖలు చేసిన కేసు తరువాత, ఇప్పుడు ‘చంద్రముఖి’ సినిమా సీన్స్ వివాదంలో చిక్కుకుంది.

Key Points

1

నయనతార డాక్యుమెంటరీపై ధనుష్‌ పరువునష్ట దావా.

2

'చంద్రముఖి' సీన్స్‌ తొలగించాలని కోర్టులో పిటిషన్‌.

4

డాక్యుమెంటరీ నిర్మాణ సంస్థ, నెట్‌ఫ్లిక్స్‌ రెండు వారాల్లో జవాబు ఇవ్వాలి.

ధనుష్‌ పరువునష్ట దావా

నటి నయనతార (Nayanthara) డాక్యుమెంటరీపై ధనుష్‌ వేసిన పరువునష్టం దావా కేసు మద్రాస్‌ కోర్టులో విచారణ కొనసాగుతుంది. ఈ సమయంలో అదే డాక్యుమెంటరీలో ‘చంద్రముఖి’ సీన్స్‌ తొలగించాలని న్యాయస్తానంలో పిటిషన్‌ దాఖలు చేశారు.  దీంతో డాక్యుమెంటరీ నిర్మాణ సంస్థ, నెట్‌ఫ్లిక్స్‌ జవాబు ఇవ్వాలని మద్రాసు హైకోర్టు తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. నయనతార జీవితకథతో పాటు డైరక్టర్‌ విఘ్నేశ్‌ శివన్‌తో వివాహ వేడుకలపై ‘నయతార: బియాండ్‌ ది ఫెయిరీటేల్‌'(Nayanthara: Beyond the Fairytale) అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌ తెరకెక్కించింది.

నయనతార డాక్యుమెంటరీలో నానుమ్‌ రౌడీదాన్‌ సినిమా క్లిప్స్‌ వాడుకోవడంపై నిర్మాత ధనుష్‌ (Dhanush) అభ్యంతరం వ్యక్తం చేశాడు. రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోర్టుకెక్కాడు. ధనుష్‌ పిటిషన్‌ను సవాలు చేస్తూ నెట్‌ఫ్లిక్స్‌ కూడా ఓ పిటిషన్‌ దాఖలు చేసింది. కోర్టు దాన్ని కొట్టిపారేసింది. ఈ కేసు విచారణలో ఉంది.  ఈ నేపథ్యంలో తాజాగా నయనతార డాక్యుమెంటరీపై మరో పిటిషన్‌ దాఖలు అయింది. చంద్రముఖి సినిమాలోని  కొన్ని సీన్స్‌ తమ అనుమతి లేకుండా ఉపయోగించారని ఏబీ ఇంటర్నేషనల్‌ సంస్థ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేసింది. అందుకు రూ.5 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని కోరింది. దీనిపై రెండు వారాల్లో జవాబివ్వాలని డాక్యుమెంటరీ నిర్మాణ సంస్థ డార్క్‌ స్టూడియో, నెట్‌ఫ్లిక్స్‌లకు మద్రాస్‌ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

‘చంద్రముఖి’ సీన్స్‌ వివాదం

కోర్టు ఉత్తర్వులు

నయనతార డాక్యుమెంటరీ చుట్టూ ఉన్న చిక్కులు ఇంకా అంతరించలేదు. కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.