|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నటిగా 22 ఏళ్ళు పూర్తి చేసుకున్న నయనతార, ఆమె కెరీర్ నిలబెట్టిన టాప్ 8 మూవీస్ ఇవే.. ఆ రెండూ లేకుంటే కష్టమే

Published: 09-10-2025, 3:45 AM
నటిగా 22 ఏళ్ళు పూర్తి చేసుకున్న నయనతార, ఆమె కెరీర్ నిలబెట్టిన టాప్ 8 మూవీస్ ఇవే.. ఆ రెండూ లేకుంటే కష్టమే

నయనతార నటిగా 22 ఏళ్ల అద్భుతమైన ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరైన ఆమె, కెరీర్‌ను నిలబెట్టిన కీలక చిత్రాల గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. చంద్రముఖి, గజినీ వంటి సినిమాలు ఆమెకు స్టార్‌డమ్ తెచ్చాయి.

Key Points

1

నయనతార నటిగా 22 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు.

2

2003లో 'మనస్సినక్కరే'తో పరిచయమైనా, 'చంద్రముఖి'తో స్టార్‌డమ్ లభించింది.

4

'లక్ష్మీ', 'అదుర్స్', 'సింహా', 'రాజా రాణి' ఆమె కెరీర్‌లోని మరికొన్ని కీలక విజయాలు.

నయనతార సినీ ప్రస్థానం ఆరంభం

నయనతార సౌత్ లో హైయెస్ట్ పైడ్ హీరోయిన్లలో ఒకరు. వయసు పెరిగే కొద్దీ నయన్ క్రేజ్ కూడా పెరుగుతోంది. 40 ప్లస్ లో నయనతార తిరుగులేని హీరోయిన్ గా కొనసాగుతున్నారు. నయనతార నటిగా 22 ఏళ్ళ కెరీర్ పూర్తి చేసుకున్నారు. సరిగ్గా 22 ఏళ్ళ క్రితం ఆమె కెమెరా ముందుకు వచ్చిన క్షణాలని గుర్తు చేసుకున్నారు. 2003లో నయనతార ‘మనస్సినక్కరే’ అనే మలయాళీ చిత్రంతో నటిగా పరిచయం అయ్యారు. ఈ సందర్భంగా నయనతార కెరీర్ టాప్ మూవీస్, ఆమె కెరీర్ ని నిలబెట్టిన కొన్ని చిత్రాల గురించి చర్చ జరుగుతోంది. ఆ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నయనతార నటిగా ఎంట్రీ ఇచ్చింది 2003లో అయినప్పటికీ ఆమెకి సరైన గుర్తింపు లభించింది మాత్రం 2005లోనే. రజినీకాంత్ చంద్రముఖి చిత్రంలో హీరోయిన్ గా నటించడంతో నయన్ జాతకం మారిపోయింది. ఈ మూవీలో నయనతార అందంగా, హోమ్లీగా కనిపించి మెప్పించింది.

చంద్రముఖి విడుదలైన కొన్ని నెలలకే నయనతార నటించిన మురుగదాస్ దర్శకత్వంలోని గజినీ కూడా రిలీజ్ అయింది. ఈ మూవీలో నయన్ సెకండ్ హీరోయిన్. ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. చంద్రముఖి, గజినీ ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ రావడంతో సౌత్ లో నయన్ పేరు మారుమోగింది. గజినీలో నయన్ తన గ్లామర్ యాంగిల్ కూడా బయట పెట్టింది. మొత్తంగా గజినీ, చంద్రముఖి చిత్రాలు నయనతార కెరీర్ కి బలమైన పునాది వేశాయి.

కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రాలు

తమిళంలో అజిత్ కి జోడిగా నటించిన బిల్లా చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ మూవీలో నయనతార అప్పట్లోనే బికినీలో కనిపించడం సౌత్ లో పెద్ద సంచలనం అయింది.

నయనతార తెలుగులో స్ట్రైట్ గా నటించిన తొలి చిత్రం లక్ష్మీ. వెంకటేష్, వివి వినాయక్ కాంబోలో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. గజినీ, చంద్రముఖి చిత్రాలతో అప్పటికే తెలుగులో నయన్ కి పాపులారిటీ ఉంది. లక్ష్మీ కూడా సూపర్ హిట్ కావడంతో నయన్ టాలీవుడ్ లో సైతం స్టార్ హీరోయిన్ అయిపోయింది.

వివి వినాయక్ దర్శకత్వంలో నయనతార నటించిన మరో మూవీ అదుర్స్. జూనియర్ ఎన్టీఆర్ తో ఈ మూవీలో నయనతార కెమిస్ట్రీ బాగా కుదిరింది. అప్పటికి ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్.

నయనతార బ్లాక్‌బస్టర్ హిట్స్

ఈ చిత్రం బాలకృష్ణకి కంబ్యాక్ మూవీ. ఈ చిత్రంలో నయనతార పవర్ ఫుల్ రోల్ లో కనిపించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ మూవీ సూపర్ హిట్ కావడం మాత్రమే కాదు 3 నంది అవార్డులు కూడా అందుకుంది.

స్టార్ డైరెక్టర్ అట్లీకి ఇది డెబ్యూ మూవీ. ప్రేమలో విఫలమైన ఓ అమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకుని ఎలా జీవించారు అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఎమోషనల్ సన్నివేశాల్లో నయనతార తన నటనతో కట్టిపడేసింది. ఈ చిత్రానికి గాను నయనతార ఉత్తమ నటిగా తమిళనాడు స్టేట్ అవార్డు, విజయ్ అవార్డు, ఫిలిం ఫేర్ అవార్డు సొంతం చేసుకుంది.

నయనతార అట్లీ దర్శకత్వంలో నటించిన మరో మూవీ జవాన్. ఈ మూవీలో ఆమె షారుఖ్ కి జోడిగా నటించింది. పాన్ ఇండియా స్థాయిలో జవాన్ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

నయనతార కెరీర్‌లో ఈ 8 సినిమాలు ఆమెను ఒక సూపర్‌స్టార్‌గా నిలబెట్టాయి. వయస్సుతో సంబంధం లేకుండా ఆమె క్రేజ్ పెరగడానికి ఈ బ్లాక్‌బస్టర్ హిట్స్ కారణమయ్యాయి. ఆమె సినీ ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.