|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇట్స్ అఫీషియల్: ఎట్టకేలకు 16 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న లాల్ సలామ్

Published: 31-05-2025, 12:00 AM
ఇట్స్ అఫీషియల్: ఎట్టకేలకు 16 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న లాల్ సలామ్

రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రెడ్డి దర్శకత్వం వహించిన లాల్ సలామ్ సినిమా థియేటర్లలో విడుదలైన 16 నెలల తర్వాత ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా సన్ నెక్స్ట్ ఓటీటీ వేదికలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Key Points

1

16 నెలల తర్వాత లాల్ సలామ్ సినిమా ఓటీటీలోకి

2

సన్ నెక్స్ట్ ఓటీటీలో విడుదల

4

థియేటర్లలో డిజాస్టర్ అయిన తర్వాత ఓటీటీ రిలీజ్

లాల్ సలామ్ ఓటీటీ విడుదల తేదీ

సూపర్ స్టార్ రజనీకాంత్(Rajini Kanth) ప్రత్యేక పాత్రలో ఆయన కుమార్తె ఐశ్వర్య(Aishwarya) దర్శకత్వం వహించిన సినిమా ‘లాల్ సలామ్'(Lal Salam). విష్ణు విశాల్(Vishnu Vishal), విక్రాంత్ సంతోష్(Vikranth Santhosh) హీరోలగా నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 9, 2024లో థియేటర్లలో విడుదల అయ్యింది. సుమారు 90 కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో డిజాస్టర్ అయ్యింది. కేవలం 20 కోట్ల రూపాయల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. దీంతో త్వరలో ఓటీటీలో వస్తుందని ఆడియన్స్ అందరూ ఆశించారు. అయితే… థియేటర్లలో విడుదలైన 16 నెలలకు గాని ఓటీటీలోకి రావడం లేదు.

ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కానుందని అఫీషియల్‌గా ప్రకటించారు. ఇందులో భాగంగా ‘లాల్ సలామ్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను మొదటగా నెట్‌ఫ్లిక్స్(Net Flix) కొనుగోలు చేయగా.. పలు కారణాలతో సన్‌నెక్స్ట్(SUN Next) చేతికి వచ్చాయి. ఈ మేరకు ఆ ఓటీటీ వేదిక అధికారికంగా ఒక ట్వీట్ చేసింది.‌ బక్రీద్ సందర్భంగా సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నట్లు సన్ నెక్స్ట్ పేర్కొంది. జూన్ 6వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఓటీటీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

థియేటర్ విడుదల తర్వాత ఓటీటీ ప్రయాణం

సన్ నెక్స్ట్ ఓటీటీ హక్కుల కొనుగోలు

చివరగా, థియేటర్లలో నిరాశపరిచిన లాల్ సలామ్ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకులను చేరుకుంటోంది. బక్రీద్ సందర్భంగా విడుదల కానున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.