|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నయనతారకు జాక్‌పాట్! సల్మాన్ ఖాన్‌తో స్క్రీన్ షేరింగ్..వైరల్ న్యూస్!

Published: 07-03-2026, 7:35 PM
నయనతారకు జాక్‌పాట్! సల్మాన్ ఖాన్‌తో స్క్రీన్ షేరింగ్..వైరల్ న్యూస్!
  • లేడీ సూపర్ స్టార్ నయనతారకు సల్మాన్ ఖాన్‌తో భారీ సినిమా ఆఫర్!
  • వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటిస్తున్న చిత్రంలో నయన్ ఛాన్స్!
  • చిరంజీవితో ‘శంకర్ వరప్రసాద్’ సినిమాలో రీసెంట్‌గా మెరిసిన నయనతార
  • త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం!

లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించే అవకాశం రావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

సల్మాన్‌తో నయన్ జోడి కట్టనుందా?

స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో లక్ష్మి సినిమాతో తెలుగు అభిమానులను ఆకట్టుకున్న హీరోయిన్ నయనతార, ఆ తర్వాత ఇండస్ట్రీని దున్నేశారు. తెలుగులోనే కాదు అన్ని భాషల్లో నయనతార తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు అయితే అలాంటి నయనతార ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో సందడి చేశారు. సినిమా మొన్న సంక్రాంతి కానుకగా వచ్చి సక్సెస్ అయింది.

అయితే వయసు పెరుగుతున్నప్పటికీ నయనతార క్రేజీ ఏమాత్రం తగ్గడం లేదు. లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ దక్కించుకున్న ఆమె.. వరుసగా సినిమాలతో దూసుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరో స్టార్ హీరోతో కొత్త ప్రాజెక్టు దక్కించుకున్నారట నయనతార. సల్మాన్ ఖాన్ హీరోగా చేస్తున్న ఓ సినిమాలో నయనతారకు అవకాశం వచ్చినట్లు చెబుతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంద‌ని టాక్. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మూవీ?

‘శంకర్ వరప్రసాద్’ తర్వాత మరో భారీ ఆఫర్!

నయనతార సల్మాన్ ఖాన్‌తో కలిసి నటిస్తే చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.