|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నయనతార ‌- యష్ టాక్సిక్ రిలీజ్ పై పుకార్లు నిజమేనా? క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్

Published: 31-10-2025, 10:35 AM
నయనతార ‌- యష్ టాక్సిక్ రిలీజ్ పై పుకార్లు నిజమేనా? క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్

KGF స్టార్ యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలపై వచ్చిన పుకార్లకు మూవీ టీమ్ తెరదించింది. ముందుగా ప్రకటించినట్టే, ఈ చిత్రం 2026 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. భారీ అంచనాల మధ్య రానున్న ఈ సినిమా అప్‌డేట్స్ ఆడియెన్స్‌ను మరింత ఉత్సాహపరుస్తున్నాయి.

Key Points

1

'టాక్సిక్' విడుదల పుకార్లు అవాస్తవమని మూవీ టీమ్ స్పష్టం చేసింది.

2

ఈ చిత్రం 2026 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

4

నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి వంటి తారలు నటిస్తున్నారు.

టాక్సిక్ విడుదల పుకార్లపై క్లారిటీ

KGFతో పాన్ ఇండియా హీరోగా మారిన యష్.. చాలా గ్యాప్ తరువాత చేసున్న సినిమా  ‘టాక్సిక్’. ఈసినిమా విడుదలపై వస్తున్న పుకార్లకు తెరపడింది. ముందుగా ప్రకటించినట్టే, ఈ సినిమా 2026 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా వాయిదా పడుతుందన్న పుకార్లను నిర్మాణ సంస్థ ఖండించింది.

ప్రముఖ సినిమా  విమర్శకుడు తరణ్ ఆదర్శ్ ఇచ్చిన సమాచారం ప్రకారం, సినిమా ప్లాన్ ప్రకారమే అంతా  కొనసాగుతోంది. యష్ ‘రామాయణ్’ షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుంచే ‘టాక్సిక్’ పోస్ట్-ప్రొడక్షన్, VFX పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం బెంగళూరులో చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.

‘టాక్సిక్’ షూటింగ్, నిర్మాణ పనులు

తరణ్ ఆదర్శ్ వివరణ తర్వాత, KVN ప్రొడక్షన్స్ కౌంట్‌డౌన్ పోస్ట్‌తో విడుదల తేదీని ధృవీకరించింది. “ఇంకా 140 రోజులు…” అని రిలీజ్ పై క్లారిటీ ఇచ్చింది.  ఉగాది, ఈద్ పండుగల సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది.

ఇంకా 140 రోజులు… అతని అపరిమితమైన ఉనికి, మీ అస్తిత్వ సంక్షోభం. #టాక్సిక్‌దిమూవీ ప్రపంచవ్యాప్తంగా 19-03-2026న విడుదల https://t.co/9RC1D6xLyn

భారీ అంచనాలతో ‘టాక్సిక్’ స్టార్ కాస్ట్

— KVN Productions (@KvnProductions) October 30, 2025

టాక్సిక్ సినిమా  బాక్సాఫీస్ దగ్గర బ్లాస్టింగ్ కలెక్షన్లు సాధిస్తుందన్న అంచనాలు ఉన్నాయి.  నాలుగు రోజుల పండగ వాతావరణాన్ని ఈ సినిమా క్యాష్ చేసుకుంటుందన్న నమ్మకంతో ఉన్నారు టీమ్. ఇక  ‘KGF’ సినిమా చేసి, యష్ చాలా గ్యాప్ తరువాత మళ్లీ వస్తుండటంతో ‘టాక్సిక్’పై అంచనాలు భారీగా పెరిగాయి. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈసినిమాలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ లాంటి తారలు నటిస్తున్నారు.

యష్ ‘టాక్సిక్’ విడుదల తేదీ ఖరారు కావడంతో అభిమానులు ఆనందంలో ఉన్నారు. మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై KGF తర్వాత భారీ అంచనాలున్నాయి. నయనతార వంటి తారలతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం ఖాయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.