|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

NBK 111: రాజ్యంలోకి రాణి ఆగమనం.. ‘మహారాణి’గా నయనతార.. NBK 111 నుంచి క్రేజీ వీడియో

Published: 18-11-2025, 2:43 AM
NBK 111: రాజ్యంలోకి రాణి ఆగమనం.. ‘మహారాణి’గా నయనతార.. NBK 111 నుంచి క్రేజీ వీడియో

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK 111 చిత్రం నుంచి నయనతార ఫస్ట్ లుక్ విడుదలైంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘మహారాణి’ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పీరియాడికల్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Key Points

1

నయనతార పుట్టినరోజున NBK 111 నుంచి ‘మహారాణి’ ఫస్ట్ లుక్ వీడియో విడుదల.

2

నందమూరి బాలకృష్ణ 111వ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు.

4

పీరియాడికల్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

NBK 111: నయనతార ‘మహారాణి’ లుక్ రిలీజ్

NBK 111: నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని ఒక సినిమా చేస్తున్న(NBK 111) విషయం తెలిసిందే. వ్రిద్ది సినిమాస్ తెరకెక్కస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. పీరియాడికల్ బ్యాక్డ్రాప్ లో గ్రాండ్ గా ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. నవంబర్ 18 నయనతార పుట్టిన రోజు సందర్బంగా ఈ సినిమా నుంచి ఆమె లుక్ ను విడుదల చేశారు. మహారాణిగా నయన్ లోక్ నెక్స్ట్ లెవల్లో ఉంది.

బాలకృష్ణ-నయనతార కాంబో బ్లాక్ బస్టర్ హిట్

Janhvi Kapoor: బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోతున్న జాన్వీ అందాలు.. ఫోటోలు

బాలకృష్ణ-గోపీచంద్ మలినేని హ్యాట్రిక్ పై అంచనాలు

దీనికి సంబంధించి విడుదలైన వీడియోకి ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. ఇక బాలకృష్ణ లుక్ ను నవంబర్ 21న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఇక బాలకృష్ణ-నయనతార కాంబోలో ఇప్పటికే సింహా, జై సింహ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ వీరసింహా రెడ్డి సినిమా చేసి సక్సెస్ సాధించాడు. కాబట్టి, ఈ బ్లాక్ బస్టర్ కాంబోలో వస్తున్న ఈ భారీ సినిమా కూడా బ్లాక్ బస్టర్ సాధిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న ఈ భారీ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. నయనతార లుక్ తో మరింత ఆసక్తి పెరిగింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.