|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాలయ్య పుట్టినరోజుకు ఊహించని సర్‌ప్రైజ్! NBK111 నుండి ‘న్యూ ఏజ్’ ట్రీట్ రెడీ!

Published: 02-06-2026, 5:00 PM
బాలయ్య పుట్టినరోజుకు ఊహించని సర్‌ప్రైజ్! NBK111 నుండి 'న్యూ ఏజ్' ట్రీట్ రెడీ!
  • NBK111 చిత్రం ముంబైలో భారీ యాక్షన్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంటోంది.
  • జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్ లేదా గ్లింప్స్ విడుదల.
  • ‘నో మోర్ వింటేజ్, ఓన్లీ న్యూ ఏజ్’ క్యాప్షన్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.
  • గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య కొత్త అవతారంలో కనిపించనున్నారు.

బాలకృష్ణ NBK111 చిత్రం నుండి జూన్ 10న ఆయన పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే సర్ప్రైజ్ రెడీ అవుతోంది. ‘నో మోర్ వింటేజ్, ఓన్లీ న్యూ ఏజ్’ అనే క్యాప్షన్ అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో బాలయ్యను సరికొత్త అవతారంలో చూడబోతున్నాం.

ముంబైలో భారీ యాక్షన్ షెడ్యూల్

NBK111 Update : ‘వీరసింహారెడ్డి’… గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ మరియు టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా 2023 జనవరి 12న విడుదలై బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే.ఇక మళ్ళీ ఇదే కాంబోలో సినిమా అంటే తెలుగు సినిమా ప్రేక్షకుల్లో, ముఖ్యంగా నందమూరి అభిమానుల్లో ఒక రేంజ్ పూనకాలు వస్తాయని స్పెషల్ గా చెప్పక్కర్లేదు.

రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో హై-వోల్టేజ్ యాక్షన్, సిస్టర్ సెంటిమెంట్‌తో థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ఈ క్రేజీ కాంబో, ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమైంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సరికొత్త యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రస్తుతానికి ‘NBK111’ అనే వర్కింగ్ టైటిల్‌తో సెట్స్‌పైకి వెళ్లి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

బాలయ్య పుట్టినరోజుకు అదిరిపోయే ట్రీట్

ముంబైలో భారీ యాక్షన్ షెడ్యూల్ ప్రస్తుతం ముంబైలోని కీలక ప్రాంతాలలో ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ యాక్షన్ షెడ్యూల్ ప్లాన్ చేసిన మేకర్స్ షూటింగ్ ని యమా జోరుగా కంప్లీట్ చేస్తున్నట్టు తెలుస్తుంది, బాలయ్య మార్క్ ఊరమాస్ ఎలిమెంట్స్‌కు ముంబై అండర్ వరల్డ్ లేదా అక్కడి పవర్‌ఫుల్ బ్యాక్‌డ్రాప్ తోడైతే స్క్రీన్ ఏ రేంజ్‌లో బద్దలవుతుందో ఊహించుకుంటుంటేనే  ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ వస్తున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించే ఒక క్రేజీ అప్‌డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.యస్ …జూన్ 10న రాబోయే బాలయ్య పుట్టినరోజు కానుకగా ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ సర్ప్రైజ్ ట్రీట్ రెడీ అవుతోంది. జూన్ 10వ తేదీన బాలకృష్ణ బర్త్‌డే వేడుకలను మరింత గ్రాండ్‌గా మార్చేందుకు, ఈ చిత్రం నుండి ఒక పవర్‌ఫుల్ ఫస్ట్‌లుక్ పోస్టర్ లేదా గ్లింప్స్‌ను విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది మూవీ టీమ్.

‘నో మోర్ వింటేజ్, ఓన్లీ న్యూ ఏజ్’ వెనుక కథ

బాలకృష్ణ పుట్టినరోజున NBK111 నుండి రాబోయే సర్ప్రైజ్ అంచనాలను పెంచుతోంది. ‘న్యూ ఏజ్’ బాలయ్యను చూసేందుకు అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనాలు సృష్టించడం ఖాయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.