
📌 Key Points
- ప్రధాని నెతన్యాహు మరణించారనే వార్తలను ఖండించిన ఇజ్రాయెల్ ప్రభుత్వం.
- తాను బ్రతికే ఉన్నానని కాఫీ తాగుతూ వీడియో విడుదల చేసిన నెతన్యాహు.
- నెతన్యాహు వీడియో AI సాయంతో రూపొందించారని ఇరాన్ వాదన.
- ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరణించారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలపై ఆయన స్వయంగా స్పందించారు. తాను బ్రతికే ఉన్నానని, ఒక వీడియో ద్వారా తెలియజేస్తూ ఈ పుకార్లకు చెక్ పెట్టారు. దీనిపై ఇరాన్ సైతం అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
నెతన్యాహు మరణవార్తలపై స్పందన
‘నేను చనిపోలేదు.. బ్రతికే ఉన్నా ‘ అంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ( Benjamin Netanyahu) అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు చనిపోయారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫేక్ ప్రచారం నేపథ్యంలో స్వయంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఈ ప్రచారాన్ని ఖండిస్తూ ఇజ్రాయెల్ లోని ఒక కేఫ్ లో కాఫీ తాగుతూ మాట్లాడిన వీడియోని రిలీజ్ చేశారు.
కాఫీ తాగుతూ నెతన్యాహు వీడియో విడుదల
తాను చావలేదని.. బ్రతికే ఉన్నానని ప్రపంచానికి చెప్పేందుకే ఈ వీడియో విడుదల చేశారు బెంజమిన్ నెతన్యాహు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. కాగా, నిన్నటి రాత్రి నుంచి బెంజమిన్ నెతన్యాహు మృతి చెందారని వార్తలు వైరల్ చేసింది ఇరాన్. కానీ ఇజ్రాయెల్ సర్కార్ ఖండించింది. ఇక ఇప్పుడు స్వయంగా బెంజమిన్ నెతన్యాహు వీడియో విడుదల చేసి, ఇరాన్ కు కౌంటర్ ఇచ్చాడు.
నెతన్యాహు వీడియోపై ఇరాన్ అనుమానాలు
అయితే, నెతన్యాహు చనిపోయాడని ఇప్పటికీ గట్టిగా చెబుతోన్న ఇరాన్… అతడు కాఫీ తాగిన వీడియో కూడా ఏఐ అని చెబుతోంది. యుద్ధం భయంకరంగా జరుగుతోన్న నేపథ్యంలో జాలిగా కాఫీ తాగే ఛాన్స్ ఉంటుందా ? అంటూ స్పష్టం చేస్తోంది ఇరాన్. మరి ఇందులో ఏది వాస్తవమో, భవిష్యత్తే తేల్చనుంది. కాగా ఇరాన్, ఇజ్రాయెల్ – అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. రెండు వారాలుగా ఈ మూడు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది.
మొత్తానికి నెతన్యాహు మరణించలేదని తేలింది. అయితే ఈ వ్యవహారం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల తీవ్రతను తెలియజేస్తుంది. రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.


