
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ప్రస్తుతం టాప్ ట్రెండింగ్‌లో ఉన్న సినిమాల జాబితాను ఈ కథనం ప్రదర్శిస్తుంది. ఈ జాబితాలో ఒకే ఒక తెలుగు సినిమా ఉండగా, మరో నాలుగు సినిమాలు చూడటానికి సిఫార్సు చేయబడ్డాయి.
Key Points
నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 ట్రెండింగ్ సినిమాల జాబితాలో 'తమ్ముడు' ఒక్కటే తెలుగు సినిమా.
మై ఆక్స్‌ఫర్డ్ ఇయర్, కెపాప్ డీమాన్ హంటర్స్, అంటిల్ డాన్ సినిమాలు కూడా చూడదగినవి.
తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న నాలుగు సినిమాలను మాత్రమే చూడాలని సిఫార్సు చేయబడింది.
'తమ్ముడు' సినిమా ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది.
నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్
ఓటీటీ అగ్ర సంస్థల్లో ఒక్కటైన నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటికప్పుడు డిఫరెంట్ కంటెంట్ స్ట్రీమింగ్ అవుతూనే ఉంటుంది. వాటిలో టాప్ 10 ట్రెండింగ్ సినిమాలను కూడా ఓటీటీ తన ప్లాట్‌ఫామ్‌లో పెడుతుంది. అలా ఇవాళ్టీ టాప్ 10 ట్రెండింగ్ సినిమాలను నెట్‌ఫ్లిక్స్ పెట్టింది.
మై ఆక్స్‌ఫర్డ్ ఇయర్- టాప్ 1 ట్రెండింగ్
తమ్ముడు – టాప్ 2 ట్రెండింగ్
కుంగ్‌ఫు హసల్- టాప్ 3 ట్రెండింగ్
రైడ్ 2- టాప్ 4 ట్రెండింగ్
తెలుగు సినిమా ‘తమ్ముడు’ ట్రెండింగ్‌లో
ఆప్ జైసా కోయి- టాప్ 5 ట్రెండింగ్
కెపాప్ డీమాన్ హంటర్స్- టాప్ 6 ట్రెండింగ్
అంటిల్ డాన్- టాప్ 7 ట్రెండింగ్
థగ్ లైఫ్ – టాప్ 9 ట్రెండింగ్
హ్యపీ గిల్మోరె 2- టాప్ 10 ట్రెండింగ్
చూడదగిన మరో మూడు సినిమాలు
ఇలా ఇవాళ (ఆగస్ట్ 7) ఇండియా వైడ్‌గా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ టాప్ 10 ట్రెండింగ్ సినిమాల జాబితా ప్లాట్‌ఫామ్‌లో కనిపిస్తోంది. వీటిలో తెలుగు భాష నుంచి ఒరిజినల్ మూవీగా తమ్ముడు ఉండగా.. దీంతో కలిపి చూసేందుకు ఇంట్రెస్టింగ్‌గా నాలుగు సినిమాలు మాత్రమే ఉన్నాయి.
ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా మై ఆక్స్‌ఫర్డ్ ఇయర్. కాలేజీ లైఫ్, రొమాంటిక్ సీన్స్‌తో అలరించేలా ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్‌లో సాధారణంగా రొమాంటిక్ జోనర్ సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే ఈ వారం వచ్చిన ఈ సినిమాపై లుక్కేయొచ్చు. 6.1 ఐఎమ్‌డీబీ రేటింగ్ ఉన్న ఈ మూవీ తెలుగు భాషలో స్ట్రీమింగ్ అవుతోంది.
థియేటర్లలో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న తెలుగు స్ట్రయిట్ సినిమా తమ్ముడు. హీరో నితిన్, లయ అక్కా తమ్ముళ్లుగా నటించిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ టైమ్ నుంచి టాప్ 2 ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. కాబట్టి, తమ్ముడు మూవీని వీక్షించొచ్చు.
పేరుకు యానిమేషన్ సినిమా అయిన నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ లో దుమ్ముదులుపుతోంది ఈ కెపాప్ డీమాన్ హంటర్స్ మూవీ. ఐఎమ్‌డీబీ నుంచి 7.7 రేటింగ్‌తోపాటు రొట్టెన్ టొమాటోస్‌లో 97 శాతం ఫ్రెష్ కంటెంట్ అనిపించుకున్న ఈ సినిమా టాప్ 3లో తెలుగులో ట్రెండ్ అవుతోంది. ఇది కచ్చితంగా చూడాల్సిన సినిమాగా లెక్కేసుకోవచ్చు.
హారర్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారు అంటిల్ డాన్ సినిమాపై లుక్కేయొచ్చు. సర్వైవల్ హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో వచ్చిన అంటిల్ డాన్ ఆడియెన్స్‌కు మంచి థ్రిలే ఇస్తుంది. టాప్ 10 జాబితాలో ఏడో స్థానంలో అంటిల్ డాన్ ట్రెండింగ్ అవుతోంది. తెలుగులో కూడా అందుబాటులో ఉన్న ఈ సినిమాను చూసేయొచ్చు.
చివరగా, నెట్‌ఫ్లిక్స్‌లో అనేక సినిమాలు ట్రెండింగ్‌లో ఉన్నప్పటికీ, ‘తమ్ముడు’తో పాటు మరో మూడు సినిమాలను చూడటం విలువైనదని ఈ జాబితా సూచిస్తుంది. మీకు నచ్చిన జోనర్ ఆధారంగా సినిమాను ఎంచుకోండి.


