|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు.. నటుడు రాజేంద్ర ప్రసాద్ కీలక నిర్ణయం

Published: 04-06-2025, 2:23 PM
దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు.. నటుడు రాజేంద్ర ప్రసాద్ కీలక నిర్ణయం

నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. అలీ, రోజాపై ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. దీనిపై స్పందిస్తూ రాజేంద్ర ప్రసాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Key Points

1

నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల సోషల్ మీడియాలో వివాదంలో చిక్కుకున్నారు.

2

అలీ, రోజాపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

4

రాజేంద్ర ప్రసాద్ తన తప్పును ఒప్పుకుని, భవిష్యత్తులో మర్యాదగా మాట్లాడతానని ప్రకటించారు.

రాజేంద్ర ప్రసాద్‌పై నెటిజన్ల ఆగ్రహం

నటుడు రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) వ్యవహారం ఇటీవల సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పదే పదే ఇతర నటులపై దురుసుగా మాట్లాడటంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో అలీపై రాజేంద్ర ప్రసాద్‌ చేసిన కామెంట్స్‌ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. నిండు సభలో అలీని, రోజాను అనరాని మాటలు అన్నారు. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడం నెటిజన్లు రాజేంద్ర ప్రసాద్‌పై తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంపై రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. ఆయన ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. దాంతో పాటు ఓ కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ‘ఈ క్షణం నుంచి నా చివరి శ్వాస వరకు అందరికీ మర్యాద ఇచ్చి మాట్లాడుతా. ఇప్పటివరకు నేను ఎవరెవరికి అయితే మర్యాద ఇవ్వకుండా మాట్లాడానో వాళ్లంతా నా వాళ్లు. నా అనుకున్నాను కాబట్టే చనువుతో అలా మాట్లాడాను. వాళ్లతో ఇప్పుడే కాదు.. ఎప్పుడూ అలాగే మాట్లాడుతా’ అని రాజేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు.

అలీ, రోజాపై వివాదాస్పద వ్యాఖ్యలు

రాజేంద్ర ప్రసాద్ కీలక ప్రకటన

తన తప్పును గుర్తిస్తూ, రాజేంద్ర ప్రసాద్ తన భవిష్యత్తు ప్రవర్తనను మార్చుకుంటానని హామీ ఇచ్చారు. ఈ వివాదం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.