
అక్కినేని నాగచైతన్య తదుపరి చిత్రం ‘NC24’ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు రికార్డు స్థాయిలో అమ్ముడుపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది చై కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డీల్ కావడంతో అక్కినేని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Key Points
నాగచైతన్య 'NC24' ఓవర్సీస్ హక్కులు రికార్డు స్థాయిలో రూ.7 కోట్లకు అమ్ముడైనట్లు వార్తలు.
ఇది చై కెరీర్‌లోనే అత్యంత భారీ ఓవర్సీస్ డీల్‌గా సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో ఈ మైథలాజికల్ థ్రిల్లర్ రూపొందుతోంది.
ఈ చిత్రంలో నాగచైతన్య మునుపెన్నడూ చేయని డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు.
NC24 ఓవర్సీస్ డీల్ రికార్డు
‘తండేల్’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కథ సెలక్షన్స్‌లో రూటు మార్చిన అక్కినేని హీరో నాగచైతన్య(Akkineni Nagachaitanya).. ప్రజెంట్ తన తదుపరి ప్రాజెక్టులపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఇప్పుడు చైతు ‘విరూపాక్ష’ ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ దండు(Director Karthik Dandu) దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం చేయబోతున్నాడు. ‘NC24’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhury) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ బజ్ నెట్టింట సందడి చేస్తుంది. ప్రజెంట్ షూటింగ్ దశలో ఉన్న NC24 ఓవర్సీస్ హక్కులు రికార్డు స్థాయిలోఅమ్ముడుబోయినట్లు నెట్టింట వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఏకంగా రూ.7 కోట్లకు NC24 ఓవర్సీస్ హక్కులు అమ్ముడయినట్లు తెలుస్తుండగా.. ఇది చై కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డీల్‌గా తెలుస్తుంది. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియనప్పటికీ.. చై ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుష్ అవుతున్నారు. కాగా.. ఈ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీలో చైతన్య మునుపెన్నడూ చేయని డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌లో BVSN ప్రసాద్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.
కార్తీక్ దండు దర్శకత్వంలో చైతూ
నాగచైతన్య కెరీర్‌లో ప్రత్యేక చిత్రం
‘NC24’ ఓవర్సీస్ డీల్ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నా, ఈ వార్తతో చైతూ కెరీర్ కొత్త మలుపు తిరుగుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కార్తీక్ దండు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


