
ఓటీటీ ప్రేక్షకులకు మరో సూపర్ హిట్ తమిళ సినిమా. తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మామన్’ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. సూరి, ఐశ్వర్య లక్ష్మీ నటించిన ఈ సినిమాలో కొత్త జంట జీవితంలోని తమాషా సంఘటనలు చూడవచ్చు.
Key Points
బ్లాక్ బస్టర్ తమిళ చిత్రం 'మామన్' ఓటీటీలోకి
కొత్త జంట జీవితంలో హాస్యభరితమైన తంటాలు
అల్లుడి డిస్టర్బెన్స్, విరిగిన మంచం.. ఎన్నో హాస్య సంఘటనలు
సూరి, ఐశ్వర్య లక్ష్మీ నటనతో ఆకట్టుకునే కథ
‘మామన్’ ఓటీటీలోకి ఎప్పుడు?
ఓటీటీలోకి డిఫరెంట్ జోనర్ల సినిమాలు వరుస కడతూనే ఉన్నాయి. కంటెంట్ బాగుండే సినిమాలపై డిజిటల్ ఆడియన్స్ మనసు పారేసుకుంటున్నారు. అలాంటి కంటెంట్ బాగున్న తమిళం సినిమా ఓటీటీలోకి రాబోతోంది. తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మామన్’ (Maaman) మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది.
తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఫ్యామిలీ కామెడీ డ్రామా ‘మారన్’ రెండు నెలల తర్వాత ఓటీటీ లోకి రాబోతోంది. మే 16, 2025న ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు ఆగస్టు 8 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 లో మామన్ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. తక్కువ బడ్జెట్ తో రూపొందించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది.
కొత్త జంట ఎదుర్కొన్న సవాళ్లు
తమిళంలో పాపులర్ కమెడియన్ సూరి ఈ మామన్ సినిమాలో హీరోగా నటించాడు. తెలుగులో డబ్ అయిన సూర్య.. యముడు సినిమాలు, కాంచన 3 తదితర మూవీల్లో సూరి నటించాడు. 2023లో హీరోగా విడుదలై పార్ట్ 1 చేశాడు. తెలుగులో అది విడుదల టైటిల్ తో రిలీజైంది. ఇప్పుడు మామన్ మూవీలో మరోసారి యాక్టింగ్ తో అదరగొట్టాడు. స్టోరీ కూడా అతనే అందించాడు. ఈ మూవీకి ప్రశాంత్ పాండ్యరాజ్ డైరెక్టర్. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటించింది. రాజ్ కిరణ్, శ్వాసిక, మాస్టర్ ప్రగీత్, బాబా భాస్కర్ తదితరులు కూడా యాక్ట్ చేశారు.
ఇన్బా (సూరి) సిస్టర్ గిరిజ. పెళ్లయిన పదేళ్ల తర్వాత ఆమెకు బాబు పుడతాడు. ఆ బిడ్డను లడ్డూ అని పిలుస్తూ అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. డాక్టరైన హీరోయిన్ రేఖ (ఐశ్వర్య లక్ష్మీ) గిరిజకు ఫ్రెండ్. గిరిజ ప్రెగ్నెన్సీ టైమ్ లో ఇన్బా తీసుకున్న కేరింగ్ చూసి ప్రేమలో పడుతుంది. పెద్దలను ఒప్పించి వీళ్లు పెళ్లి చేసుకుంటారు. కానీ అక్కడి నుంచి తలనొప్పి స్టార్ట్ అవుతుంది. ఇన్బాకు లడ్డూ అంటే చాలా ఇష్టం. జాయింట్ ఫ్యామిలీ, లడ్డూ కారణంగా ఇన్బా, రేఖకు ప్రైవేట్ టైమ్ దొరకదు. ఒకసారి తాతయ్య గదిలోకి వెళ్తే మంచంపై రొమాన్స్ చేద్దామంటే మంచం విరిగిపోతుంది. ఎప్పుడూ లడ్డూ వీళ్ల మధ్యలో వస్తాడు.
హాస్యంతో కూడిన కథాంశం
దీంతో గిరిజ, రేఖకు మధ్య గొడవ జరుగుతుంది. తనకు ట్రాన్స్ ఫర్ కావడంతో ఇన్బాను తీసుకుని రేఖ మధురై వెళ్లిపోతుంది. అక్కడ రేఖ ప్రెగ్నెంట్ అవుతుంది. మరోవైపు ఇన్బా లేకపోవడంతో లడ్డూ కుంగిపోతాడు. అప్పుడు ఇన్బా చనిపోయాడని లడ్డూకు చెప్తారు. లడ్డూతో పాటు గిరిజ, భర్తకు యాక్సిడెంట్ అవుతుంది. వీళ్లను చూసేందుకు భార్యకు ఇచ్చిన ప్రామిస్ పక్కనపెట్టి ఇన్బా వస్తాడు. అప్పుడు రేఖ తాళి తెంచుకుని వెళ్లిపోతుంది. మరి యాక్సిడెంట్ లో లడ్డూకు ఏమైంది? రేఖ, ఇన్బా మళ్లీ కలిశారా? అన్నదే కథ.
చివరగా, ‘మామన్’ సినిమా తన వినోదభరితమైన కథాంశం, నటీనటుల అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఓటీటీలో ఈ సినిమా చూడటాన్ని మిస్ అవ్వకండి.


