
📌 Key Points
- ఏప్రిల్ 1 నుంచి ఏటీఎం లావాదేవీల్లో మార్పులు
- యూపీఐ విత్‌డ్రాలను ఉచిత పరిమితిలో చేర్చనున్న బ్యాంకులు
- పరిమితి దాటితే అదనపు ఛార్జీలు
- డెబిట్ కార్డు లేకుండా యూపీఐ ద్వారా విత్‌డ్రా
ఏప్రిల్ 1 నుంచి బ్యాంకులు ఏటీఎం లావాదేవీలపై కొత్త నిబంధనలు అమలు చేయనున్నాయి. యూపీఐ ద్వారా నగదు ఉపసంహరణలపై ఛార్జీలు విధించనున్నారు. ఈ మార్పుల గురించి తెలుసుకోవడం చాలా అవసరం.
ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్
ఏప్రిల్ నెల సమీపిస్తోంది. ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా కొన్ని బ్యాంకులు ఏటీఎం లావాదేవీల నిబంధనలలో గణనీయమైన మార్పులను అమలు చేస్తున్నాయి. ఇది మీ ఉచిత లావాదేవీ పరిమితి, నగదు ఉపసంహరణ ఛార్జీలపై నేరుగా ప్రభావం చూపుతుంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పీఎన్‌బీ వంటి బ్యాంకులు కొత్త నిబంధనలను ప్రకటించాయి. ఈ నిబంధనల ప్రకారం, ఏప్రిల్ 1 నుంచి యూపీఐ ఉపయోగించి ఏటీఎంల నుండి చేసే నగదు ఉపసంహరణలు కూడా మీ ఉచిత లావాదేవీ పరిమితిలో భాగంగా పరిగణిస్తారు. అంటే మీ ఫ్రీ లిమిట్‌లో ఈ యూపీఐ ఉపయోగించి చేసే సర్వీస్ కూడా కౌంట్ అవుతుంది.
వాస్తవానికి ఏప్రిల్ 1వ తేదీ నుండి యూపీఐ ఉపయోగించి ఏటీఎంల నుండి చేసే నగదు ఉపసంహరణలు కూడా మీ ఉచిత లావాదేవీ పరిమితిలో భాగంగానే పరిగణిస్తారు. మీరు పరిమితిని మించి లావాదేవీలు జరిపితే.. మీకు అదనపు ఛార్జీలు విధిస్తారు.
యూపీఐ ద్వారా నగదు ఉపసంహరణ
యూపీఐ ద్వారా ఏటీఎం నుండి నగదు ఉపసంహరణను ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం, మీ ఉచిత నెలవారీ పరిమితికి కలుపుతారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) వంటి బ్యాంకులు ఈ కొత్త నిబంధనలను ప్రకటించాయి.
అటువంటి పరిస్థితిలో మీరు బ్యాంకు ఉచిత లావాదేవీ పరిమితి కంటే ఎక్కువగా ఏటీఎం నుండి నగదు విత్‌డ్రా చేస్తే, ప్రతి అదనపు లావాదేవీకి బ్యాంకు మీ నుండి రూ.23 వరకు రుసుము వసూలు చేస్తుంది. ప్రస్తుతం బ్యాంకు తన ఏటీఎంల నుండి నెలకు ఐదుసార్లు ఉచితంగా నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని అందిస్తోంది. ఇతర బ్యాంకుల ఏటీఎంల విషయానికొస్తే, మెట్రో నగరాల్లో ఉచిత నగదు విత్‌డ్రా పరిమితి మూడుసార్లు, మెట్రోయేతర నగరాల్లో ఐదుసార్లుగా ఉంది.
వివిధ బ్యాంకుల ఛార్జీలు
యూపీఐని ఉపయోగించి ఏటీఎం నుండి డబ్బు విత్‌డ్రా చేసుకునే ప్రక్రియ కూడా చాలా సులభం. డెబిట్ కార్డ్ లేకుండా నగదు విత్‌డ్రా చేసుకోవడానికి, కస్టమర్లు ఏటీఎం స్క్రీన్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి.. తమ యూపీఐ యాప్‌లో లావాదేవీని ఆమోదిస్తే సరిపోతుంది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి అనేక బ్యాంకులు ఈ ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా తన కొన్ని డెబిట్ కార్డులపై రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితిని తగ్గించాలని నిర్ణయించింది. బ్యాంక్ ఇంకా పూర్తి వివరాలను అందించలేదు. అయితే రోజువారీ ఉపసంహరణ పరిమితిని 50 శాతం వరకు తగ్గించవచ్చని సమాచారం. వినియోగదారులు తమ కార్డు నిబంధనలను సరిచూసుకోవాలని, పెద్ద లావాదేవీల కోసం యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ మార్గాలను ఉపయోగించాలని బ్యాంక్ సూచిస్తోంది.
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ కొత్త రూల్స్‌తో యూపీఐ ద్వారా ఏటీఎం నగదు ఉపసంహరణలపై ఛార్జీల ప్రభావం ఉంటుంది. కాబట్టి వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి.

