
📌 Key Points
- కొత్త సినిమాల కంటే రీ-రిలీజ్ సినిమాలపైనే ప్రేక్షకుల ఆసక్తి పెరుగుతోంది.
- 2026 జనవరి 1న మురారి, నువ్వు నాకు నచ్చావ్ రీ-రిలీజ్ కానున్నాయి.
- నువ్వు నాకు నచ్చావ్ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.
- మహేష్ బాబు కెరీర్‌లో మురారి ఒక బ్లాక్‌బస్టర్, ఎమోషన్స్, మ్యూజిక్ హైలైట్.
కొత్త సంవత్సరం 2026 జనవరి 1న రెండు బ్లాక్‌బస్టర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు రీ-రిలీజ్ కాబోతున్నాయి. మహేష్ బాబు నటించిన మురారి, త్రివిక్రమ్ రచించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాలు మళ్లీ థియేటర్లలో సందడి చేయనున్నాయి. ప్రేక్షకుల నుంచి ఈ సినిమాలకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.
రీ-రిలీజ్ సినిమాలపై పెరుగుతున్న ఆసక్తి
New year Special re-releases : ఒకప్పుడు థియేటర్ కు వచ్చే ప్రేక్షకులు కంటే కూడా ఇప్పుడు థియేటర్ కి వచ్చే ప్రేక్షకులు సంఖ్య కంప్లీట్ గా తగ్గిపోయింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు ఒక సినిమాకి విపరీతమైన పాజిటివ్ టాక్ వస్తే కానీ చాలామంది థియేటర్ కి రాని పరిస్థితి ఏర్పడింది. అయితే చాలామంది కొత్త సినిమాలు అన్నీ కూడా ఓటీటీ లో చూస్తున్నారు పాత సినిమాల కోసం థియేటర్ కి వెళ్తున్నారు అని అంటూ ఉంటారు. అనడం మాత్రమే కాకుండా అదే జరుగుతుంది చాలామంది రీ రిలీజ్ సినిమాలకు వెళ్లి వైబ్ అవుతుంటారు.
ఇకపోతే 2026 జనవరి 1వ తారీఖున మొత్తం రెండు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలో ప్రేక్షకులు ముందుకు రానున్నాయి. కృష్ణవంశీ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన మురారి సినిమాతో పాటు, త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా పనిచేసిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా కూడా అదే రోజున విడుదల కానుంది. ముఖ్యంగా నువ్వు నాకు నచ్చావ్ సినిమా కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
కొన్ని సినిమాలు అలా కుదురుతూ ఉంటాయి. అలానే త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా విజయభాస్కర్ దర్శకత్వం వహించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా కుదిరింది. ఆ సినిమా ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టదు. ఇప్పటికీ కూడా టీవీల్లో ఆ సినిమా వస్తే చాలామంది అతుక్కుపోతారు.
నువ్వు నాకు నచ్చావ్: ఎప్పటికీ ఆదరణే!
అయితే అటువంటి సినిమా మళ్లీ థియేటర్లో విడుదలవుతుంది అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే ఆ సినిమాకి కోటి అందించిన మ్యూజిక్ కూడా మంచి ప్లస్ పాయింట్ అయింది. ఇప్పటికీ కూడా ఆ పాటలు విపరీతంగా వినిపిస్తూ ఉంటాయి.
ఇకపోతే మహేష్ బాబు కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలలో మురారి ఒకటి ఇప్పటికీ కూడా చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ ఆ సినిమా వచ్చినా కూడా టీవీలకు అతుక్కుని కూర్చుంటారు. కృష్ణవంశీ మహేష్ కోసం డిజైన్ చేసిన ఈ కథ చాలా అద్భుతంగా అప్పుడు వర్కౌట్ అయింది.
మురారి: మహేష్ కెరీర్‌లో ఒక మైలురాయి
ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా ఆ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఆ సినిమాలో ఎమోషన్స్ ఇప్పటికి కూడా కళ్ళల్లో నీళ్లు తెప్పించేలా ఉంటాయి. ముఖ్యంగా మణిశర్మ అందించిన మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అయితే ఈ రెండు పాత సినిమాలు కి కొత్త సంవత్సరంలో ఎంతటి సక్సెస్ వస్తుందో చూడాలి.
పాత సినిమాలపై ప్రేక్షకుల ఆసక్తి పెరుగుతున్న ఈ తరుణంలో, మురారి, నువ్వు నాకు నచ్చావ్ వంటి క్లాసిక్‌లు మళ్లీ థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఈ రీ-రిలీజ్‌లు ఎంతటి విజయాన్ని సాధిస్తాయో వేచి చూడాలి.

