|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నిధి అగర్వాల్ సంచలన ఆరోపణలు: నా కెరీర్ ను నాశనం చేయడానికి కుట్ర జరుగుతోంది!

Published: 23-01-2026, 6:35 AM
నిధి అగర్వాల్ సంచలన ఆరోపణలు: నా కెరీర్ ను నాశనం చేయడానికి కుట్ర జరుగుతోంది!
  • కొంతమంది తనను తొక్కేయాలని చూస్తున్నారని నిధి ఆరోపించారు.
  • తనపై నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారని ఆమె అన్నారు.
  • కాశీకి వెళ్లిన తర్వాత తనలో మార్పు వచ్చిందని నిధి తెలిపారు.
  • ఎన్ని కుట్రలు జరిగినా ధైర్యంగా నిలబడతానని ఆమె స్పష్టం చేశారు.

ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ తనపై కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. తనను తొక్కేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని, నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె పలు విషయాలు వెల్లడించారు.

నిధి అగర్వాల్ ఆవేదన

Nidhhi agerwal:ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ (Niddhi Agerwal) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మరింత పాపులారిటీ అందుకుంది ఈ సినిమాలో నటించిన మరో హీరోయిన్ నభా నటేష్ కి కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. ఇకపోతే నిధి అగర్వాల్ తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మరొకవైపు పలువురు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.

అందులో భాగంగానే గత ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా, జ్యోతి కృష్ణ (Jyothi Krishna) దర్శకత్వంలో వచ్చిన ‘హరిహర వీరమల్లు’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇందులో పంచమి క్యారెక్టర్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. చాలా రోజుల తర్వాత తన ఖాతాలో ఒక మంచి విజయాన్ని వేసుకుంది నిధి అగర్వాల్. ఈ ఏడాది మారుతీ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ది రాజాసాబ్’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల హారర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్న నిధి అగర్వాల్.. తనను కొంతమంది తొక్కేయాలని చూస్తున్నారని.. ముఖ్యంగా తనను వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారని, తనపై భారీ కుట్ర జరుగుతోంది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది నిధి అగర్వాల్.

నెగిటివ్ ప్రచారం వెనుక కుట్ర?

ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఈ స్థాయికి నేను చేరుకోవడం వెనుక ఎన్నో చేదు అనుభవాలు ఉన్నాయి. నాపై ఇండస్ట్రీలో కొందరు పని గట్టుకొని మరీ నెగిటివ్ క్యాంపెయిన్ చేశారు. నన్ను తొక్కేయడానికి భారీగా డబ్బులు ఖర్చు చేసి మరీ కుట్రలు చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది నిధి అగర్వాల్. అలాగే ఆమె మాట్లాడుతూ.. “నటీనటులు చాలా సెన్సిటివ్, ఎమోషనల్, చిన్నపిల్లల మనస్తత్వంతో ఉంటారు. ఇలాంటివి జరిగితే వారి కుటుంబాలు కూడా తట్టుకోలేవు. మేము సమాధానం చెప్పాల్సింది మా తల్లిదండ్రులకు మాత్రమే. అయితే ఇలాంటి నెగటివ్ క్యాంపెయిన్లు మంచివి కాదు. కాశీకి వెళ్లి వచ్చిన తర్వాత ఆధ్యాత్మికంగా నాలో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఎలాంటి ప్రశ్నలు అయినా సరే ధైర్యంగా సమాధానం చెప్పగలుగుతున్నాను. ముఖ్యంగా ఎన్ని తప్పుడు ప్రచారాలు ఎదురైనా ధైర్యంగా నిలబడతాను” అంటూ చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్.

ధైర్యంగా నిలబడతానన్న నిధి

ఇక ఇదే ఇంటర్వ్యూలో తనకు పెళ్లికాక ముందే నలుగురు పిల్లలు కావాలి అని చెప్పిన ఈమె.. వయసులో తనకంటే ఏడు సంవత్సరాలు చిన్నదైన చెల్లెలు ఉంది అని, ఆమె వల్లే తనకు పిల్లలపై ఆసక్తి , ఇష్టం రెండూ కలిగాయి అంటూ తెలిపింది. ఏది ఏమైనా తాజా ఇంటర్వ్యూలలో ఎన్నో విషయాలను చెప్పుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది నిధి అగర్వాల్.

నిధి అగర్వాల్ చేసిన ఆరోపణలు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి. ఆమె తన కెరీర్ ను కాపాడుకోవడానికి ధైర్యంగా నిలబడతానని చెప్పడం గమనార్హం. ఆమె భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.