
📌 Key Points
- చంద్రమోహన్ కి సినిమాలో అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్ మేకప్ మాన్ పీతాంబరం.
- బాలకృష్ణ కోసం చంద్రమోహన్ ని తప్పించిన ఎన్టీఆర్ నిర్ణయం.
- ఎంజీఆర్ సినిమాలో బ్రదర్ పాత్రలో చంద్రమోహన్ కి అవకాశం.
- ఎన్టీఆర్ తనకి అవకాశం ఇవ్వకపోయినా తనకు అవసరం లేదని తేల్చి చెప్పిన చంద్రమోహన్.
టాలీవుడ్ లో సంచలనం! నందమూరి బాలకృష్ణ గురించి సీనియర్ నటుడు చంద్రమోహన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఎన్టీఆర్ తనయుడి కోసం చంద్రమోహన్ కి ద్రోహం చేశారా? అసలు ఏం జరిగిందో తెలుసుకోండి.
ఎన్టీఆర్ నిర్ణయంపై చంద్రమోహన్ ఆగ్రహం
నందమూరి తారక రామారావుని అభిమానులు ఆరాధ్య దైవం లా భావిస్తారు. అయితే చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ ని విభేదించిన వాళ్ళు కూడా ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీఆర్ మధ్య అప్పట్లో విభేదాలు తలెత్తాయి. సీనియర్ నటుడు చంద్ర మోహన్ కి కూడా ఎన్టీఆర్ అంతే అంతగా పడదు. దానికి కారణం ఉంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
70వ దశకంలో చంద్రమోహన్ టాలీవుడ్ లో క్రేజీ హీరోల్లో ఒకరిగా ఎదిగారు. ఆ సమయంలో ఎన్టీఆర్ ఒక సినిమాలో నటించే అవకాశం చంద్ర మోహన్ కి దక్కింది. ఆ చిత్రానికి ఎన్టీఆర్ మేకప్ మ్యాన్ పీతాంబరం నిర్మాత. ఈ చిత్రంలో ఎన్టీఆర్, మురళీమోహన్, చంద్రమోహన్ ముగ్గురూ హీరోలు. అన్నదమ్ములుగా నటిస్తున్నారు. సినిమా టైటిల్ అన్నదమ్ముల అనుబంధం.
బాలకృష్ణ కోసం అవకాశం దూరం?
ఇక షూటింగ్ మొదలు పెట్టాలి అనుకుంటున్న తరుణంలో చంద్రమోహన్ కి ఊహించని షాక్ తగిలింది. చంద్రమోహన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉదయాన్నే రెడీ అయి షూటింగ్ కి వెళ్ళాను. అక్కడ ఒక వ్యక్తి ఆల్రెడీ నాలాగా కాస్ట్యూమ్స్ వేసుకుని రిహార్సల్స్ చేస్తున్నారు. నాకు ఏదో తేడాగా అనిపించింది.
నిర్మాత పీతాంబరం గారు లొకేషన్ లో కనిపించడం లేదు. కాసేపటి తర్వాత ఆయన వచ్చి సార్ పొరపాటు జరిగింది. దయచేసి ఇంటికి వెళ్ళండి. ఇక్కడ ఎలాంటి గొడవ వద్దు. నేను ఇంటికి వచ్చి మాట్లాడతా అని అన్నారు. వయసులో పెద్ద వ్యక్తి చెప్పారు కాబట్టి సైలెంట్ గా వచ్చేశాను. సాయంత్రం పీతాంబరం గారు వచ్చి సార్ ఇది ఎన్టీఆర్ గారు తీసుకున్న నిర్ణయం. ఆయన కొడుకు బాలకృష్ణని ఈ పాత్రకి తీసుకున్నారు. మేం ఎంత చెప్పినా వినలేదు. చంద్రమోహన్ గారికి తన తర్వాతి చిత్రంలో మంచి వేషం ఇస్తాను అని చెప్పమని చెప్పారు. వెంటనే నేను.. ఎన్టీఆర్ పేరే నాదగ్గర ఎత్తవద్దు. కొడుకు కోసం నాకు ఇంత ద్రోహం చేస్తారా ? ముందే చెబితే నాకు ఎలాంటి సమస్య లేదు.
చంద్రమోహన్ కెరీర్ టర్నింగ్ పాయింట్
నా లెవల్ ఏంటి ? ఇప్పుడు నేను టాలీవుడ్ లో ఎలాంటి పొజిషన్ లో ఉన్నానో తెలుసు కదా. అలాంటి నాకు సెట్స్ కి వచ్చే వరకు విషయం చెప్పరా అంటూ చంద్రమోహన్ దుమ్మెత్తి పోశారు. ఆ తర్వాత పీతాంబరం గారు న గురించి ఎంజీఆర్ కి చెప్పారు. ఎంజీఆర్ గారు వెంటనే ఆయన సినిమాలో నన్ను బ్రదర్ గా తీసుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ నాకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. నాకు కూడా అవసరం లేదు అని తేల్చి చెప్పేసినట్లు చంద్రమోహన్ తెలిపారు.
చంద్రమోహన్ చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై బాలకృష్ణ ఎలా స్పందిస్తారో చూడాలి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


