|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హరి హర వీరమల్లు తర్వాత బిజీగా మారిన గ్లామర్ బ్యూటీ- ప్రభాస్‌తోపాటు మరో హారర్ థ్రిల్లర్- నిధి అగర్వాల్ బర్త్ డేకి పోస్టర్

Published: 18-08-2025, 2:23 AM
హరి హర వీరమల్లు తర్వాత బిజీగా మారిన గ్లామర్ బ్యూటీ- ప్రభాస్‌తోపాటు మరో హారర్ థ్రిల్లర్- నిధి అగర్వాల్ బర్త్ డేకి పోస్టర్

గ్లామర్ బ్యూటీ నిధి అగర్వాల్ ‘హరి హర వీరమల్లు’ సినిమా తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్‌తో కలిసి నటించిన ‘ది రాజా సాబ్’ తర్వాత, ఇప్పుడు మరో హారర్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నారు.

Key Points

1

నిధి అగర్వాల్ 'హరి హర వీరమల్లు' తర్వాత బిజీగా ఉన్నారు.

2

ప్రభాస్‌తో కలిసి 'ది రాజా సాబ్' సినిమాలో నటించారు.

4

పుట్టినరోజు సందర్భంగా సినిమా పోస్టర్ విడుదల.

‘హరి హర వీరమల్లు’ తర్వాత నిధి అగర్వాల్ కెరీర్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు సినిమాతో అట్రాక్ట్ చేసింది గ్లామర్ బ్యూటి నిధి అగర్వాల్. ఈ సినిమాలో పవన్ కల్యాణ్‌కు జోడీగా మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. అయితే, హరి హర వీరమల్లు సినిమా తర్వాత బిజీగా మారిపోయింది నిధి అగర్వాల్.

హరి హర వీరమల్లు సినిమా చేస్తున్న సమయంలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ తో ది రాజా సాబ్ సినిమాలో నటించింది నిధి అగర్వాల్. హారర్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ది రాజా సాబ్‌ మూవీలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నిధి అగర్వాల్ కనిపించింది. ఇప్పుడు మరో హారర్ థ్రిల్లర్ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రానుంది బ్యూటిఫుల్ నిధి అగర్వాల్.

వరుస ఎగ్జయిటింగ్ ప్రాజెక్టులతో తన అభిమానులను అలరుస్తన్న నిధి అగర్వాల్ ఇప్పుడు ఓ గ్రిప్పింగ్ హారర్ థ్రిల్లర్‌‌కి సైన్ చేసింది. నిధి అగర్వాల్ లీడ్ రోల్‌లో చేస్తున్న ఈ సినిమాని ఆమె పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ కింద శ్రీ పుప్పాల అప్పల రాజు (ఎ.ఆర్.) నిర్మిస్తున్నారు.

ప్రభాస్‌తో కలిసి హారర్ థ్రిల్లర్

ఇది వారి నెంబర్ వన్ ప్రొడక్షన్. ఈ ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా నిఖిల్ కార్తీక్ ఎన్ అరంగేట్రం చేస్తున్నారు. నిధి బర్త్ డేను స్పెషల్‌గా సెలబ్రేట్ చేస్తూ మేకర్స్ ఓ ఈ హారర్ థ్రిల్లర్ సినిమా స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ ద్వారా నిధికి శుభాకాంక్షలు చెప్తూ రాబోయే సినిమా హారర్ థ్రిల్‌ని ముందుగానే టోన్ సెట్ చేశారు.

ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కనుంది. టాప్ టెక్నికల్ స్టాండర్డ్స్, హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఆడియన్స్‌కి విజువల్లీ స్ట్రాంగ్, ఎమోషనల్‌గా ఇంటెన్స్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వనుందని తెలుస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత పుప్పాల అప్పల రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

నిధి అగర్వాల్ పుట్టినరోజుకు ప్రత్యేక పోస్టర్

ప్రొడ్యూసర్ పుప్పాల అప్పల రాజు మాట్లాడుతూ.. “నిధి అగర్వాల్ తన క్యారెక్టర్‌కి అద్భుతమైన ఛార్మ్ తీసుకొస్తున్నారు. ఈ సినిమా ఆమె కెరీర్‌లో ఓ మైలురాయి అవుతుంది. మా ప్రొడక్షన్ హౌస్‌లో ఆమె జాయిన్ అవ్వడం మాకు ఆనందం కలిగిస్తోంది. ఆమె బిగ్ స్క్రీన్‌పై చూపించబోయే మ్యాజిక్ కోసం మేమంతా ఎదురుచూస్తున్నాం” అని తెలిపారు.

కాగా, ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ త్వరలో రాబోతున్నాయని మేకర్స్ తెలిపారు. అలాగే, నిధి అగర్వాల్ న్యూ హారర్ థ్రిల్లర్ మూవీ టైటిల్‌ను దసరా సందర్భంగా రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు.

నిధి అగర్వాల్ కొత్త హారర్ థ్రిల్లర్ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా ఆమె కెరీర్ లో మరో మైలురాయిగా నిలుస్తుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. దసరా సందర్భంగా చిత్రం టైటిల్ వెల్లడించబడుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.