|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Nidhi Agarwal: ప్రభాస్ ఎలాంటి వ్యక్తో త్వరలోనే మీకు తెలుస్తోంది.. అసలు నిజాలు బయటపెట్టిన నిధి అగర్వాల్

Published: 15-06-2025, 10:51 AM
Nidhi Agarwal: ప్రభాస్ ఎలాంటి వ్యక్తో త్వరలోనే మీకు తెలుస్తోంది.. అసలు నిజాలు బయటపెట్టిన నిధి అగర్వాల్

టాలీవుడ్ నటి నిధి అగర్వాల్, ప్రభాస్‌తో కలిసి నటిస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమా గురించి మాట్లాడుతూ, ప్రభాస్ గుణగణాలను ప్రశంసించింది. ఆయన నిజ స్వభావం త్వరలోనే అందరికీ తెలుస్తుందని ఆమె తెలిపింది.

Key Points

1

నిధి అగర్వాల్ ప్రభాస్ గురించి ప్రశంసలు కురిపించింది.

2

ప్రభాస్ ఎంతో మంచి మనిషి అని నిధి అభిప్రాయం.

4

ప్రభాస్ నిజ స్వరూపం త్వరలోనే బయటపడుతుందని నిధి చెప్పుకొచ్చింది.

నిధి అగర్వాల్ ప్రభాస్‌పై ప్రశంసలు

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhi Agarwal) వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) సరసన ‘ది రాజా సాబ్’(The Raja Saab) మూవీలో నటిస్తోంది. మారుతి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే ఇందులో రిద్ధి కుమార్, మాళవిక మోహనన్(Malavika Mohanan), యోగిబాబు, సంజయ్ దత్(Sanjay Dutt) కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక మూవీ మేకర్స్ వరుస అప్డేట్ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తున్నారు.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి అగర్వాల్ ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించింది. ‘‘ప్రభాస్ సార్ చాలా గొప్ప నటుడు. ఆయన చాలా మంది ప్రజలకు సినీ ప్రముఖులకు ఎంతో సాయం చేస్తారు. అయితే ఆయన ఎంత గొప్పవాడో ప్రజలకు తెలియాలని ఇవన్నీ చేయడం లేదు. ఆయన ఎలాంటి వారో ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు. ఆయన తన వైబ్‌తో నిలబడగలడు. ప్రభాస్ చాలామంచి వారు. ఆయన ఎలాంటి మానవుడో మీ కూడా త్వరలోనే తెలుస్తోంది’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘ది రాజా సాబ్’ సినిమా విడుదల తేదీ

ప్రభాస్ నిజ స్వభావం

నిధి అగర్వాల్ వ్యాఖ్యలతో ప్రభాస్ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ప్రభాస్ నిజ స్వరూపం తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ‘ది రాజా సాబ్’ సినిమా విజయవంతం కావాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.