|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కాదా? నిధి అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు.. షాక్‌లో ఫ్యాన్స్!

Published: 26-12-2025, 11:51 PM
ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కాదా? నిధి అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు.. షాక్‌లో ఫ్యాన్స్!
  • నటి నిధి అగర్వాల్ ప్రభాస్‌ను ‘పాన్ ఇండియా స్టార్’ కాదని వ్యాఖ్యానించింది.
  • ఆమె ప్రభాస్‌ను ‘ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్’ అని అభివర్ణించింది.
  • ‘ది రాజాసాబ్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ కామెంట్స్ చేసింది.
  • ప్రభాస్ అభిమానుల స్పందన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.

ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కాదని నటి నిధి అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘ది రాజాసాబ్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె మాట్లాడుతూ, ప్రభాస్‌ను ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని అభివర్ణించింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

ప్రభాస్‌పై నిధి సంచలన వ్యాఖ్యలు

Nidhi Agarwal: ప్రస్తుతం ఇండియా లెవల్లో ఒక రేంజ్ స్టార్డమ్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది ప్రభాస్ అనే చెప్పాలి. పాన్ ఇండియా అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జామ్పుల్ అంటే చాలా మంది ప్రభాస్ పేరే చెప్తారు. దానికి కారణం, ఆయన సినిమాలకు భాషతో సంబంధం లేదు. ఎక్కడ ఆడియన్స్ ఆయన్ని తమ సొంత హీరోలా ఫీలవుతారు. అందుకే, ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఇండియన్ సినీ రికార్డ్స్ అన్నీ బ్రేక్ అయిపోతూ ఉంటాయి. కొత్త రికార్డ్స్ క్రియేట్ అవుతాయి. అలాంటి ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ కాదు అంటుంది లేటెస్ట్ బ్యూటీ నిధి అగర్వాల్. దీంతో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Lokesh Kanagaraj: ప్లాప్ మూవీ ప్రభావం అలా ఉంటుంది.. ఎన్నో విమర్శలు అంటూ.. లోకేష్ ఎమోషనల్ కామెంట్స్

ది రాజాసాబ్ ప్రమోషన్స్‌లో వివాదం

నిధి అగర్వాల్ హీరోయిన్ గా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’. ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ సినిమాను కామెడీ చిత్రాల దర్శకుడు మారుతీ తెరకెక్కించాడు. హారర్ అండ్ కామెడీ జానర్ లో వస్తున్న ఈ సినిమా 2026 జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ది రాజాసాబ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు మూవీ టీం. తాజాగా హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhi Agarwal) కూడా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. అయితే, ఈ ఇంటర్వ్యూలో యాంకర్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అడిగాడు.

ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి?

దానికి సమాధానంగా నిధి మాట్లాడుతూ.. మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కాదు.. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటూ చెప్పుకొచ్చింది. దాంతో, నాలుక కరుచుకున్న యాంకర్ మళ్ళీ తన మాటలను సరరించుకున్నాడు. దీంతో నిధి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి నిధి చేసిన ఈ కామెంట్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి.

మొత్తం మీద, నిధి అగర్వాల్ వ్యాఖ్యలు ప్రభాస్ అభిమానులలో చర్చకు దారి తీశాయి. ఈ మాటలపై అభిమానులు, సినీ వర్గాల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.