|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Nidhhi Agerwal: నిధి అగర్వాల్‌కు ప్రభాస్‌ సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా?

Published: 13-08-2025, 7:19 AM
Nidhhi Agerwal: నిధి అగర్వాల్‌కు ప్రభాస్‌ సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా?

టాలీవుడ్ స్టార్ ప్రభాస్ తన ఆతిథ్యంతో మరోసారి అందరినీ ఆకట్టుకున్నాడు. నిధి అగర్వాల్‌కు అతను పంపించిన సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఏంటో తెలుసుకుందాం.

Key Points

1

ప్రభాస్ నిధి అగర్వాల్‌కు భోజనం పంపించారు.

2

నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో కృతజ్ఞతలు తెలిపారు.

4

ది రాజాసాబ్ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది.

ప్రభాస్‌ సర్‌ప్రైజ్ గిఫ్ట్

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆహార ప్రియుడని మనకు తెలిసిందే . అంతేకాదు .. అతిథులకు మర్యాద చేయడంలో ఇంకా ముందుంటారు . అది సెట్ ‌ లో అయినా .. ఇంట్లో అయినా సరే కడుపునిండా భోజనం పెట్టే పంపిస్తాడు . అలా ఇప్పటికే షూటింగ్స్ ‌ తో పాటు పలువురు సెలబ్రిటీలకు సైతం భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు .

తాజాగా హరిహర వీరమల్లు హీరోయిన్ ‌ నిధి ‍అగర్వాల్‌కు భోజనం పంపించారు మన ప్రభాస్ . ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది . ఈ సందర్భంగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది . అలాగే ప్రభాస్ ‌ తో పాటు వంశీకి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసింది . ఆంధ్ర వంటకాలతో పాటు అద్భుతమైన మీల్స్ దొరికాయని సంతోషం వ్యక్తం చేసింది .

నిధి అగర్వాల్‌ రియాక్షన్

ప్రభాస్ హీరోగా వస్తోన్న రొమాంటిక్ హారర్ ఫిల్మ్ ది రాజాసాబ్‌లో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ పలుసార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. ది రాజాసాబ్‌ విడుదల తేదీని ఫిక్స్ చేశారు. ఈ  ఏడాది డిసెంబర్ 5 థియేటర్లలో సందడి చేయనుందని ప్రకటించారు.  ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌తో పాటు రిద్ధి కుమార్‌, మాళవిక మోహన్ కథానాయికలుగా నటిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రభుత్వ కారులో నిధి అగర్వాల్ ?

ది రాజాసాబ్ విడుదల తేదీ

ఇటీవలే ఏపీకి ప్రభుత్వ కారులో నిధి అగర్వాల్ ‌ ప్రయాణించారు . ఓ ప్రైవేట్ ఈవెంట్ ‌ కు వెళ్లిన నిధి అగర్వాల్ ‌ కు ఏకంగా ఆన్ గవర్నమెంట్ ‌ డ్యూటీ అని బోర్డ్ ఉన్న కారులో వెళ్లారు . ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వంపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి . ఆ తర్వాత ఆ కారు ఏర్పాటులో తన ప్రమేయం లేదంటూ క్లారిటీ ఇస్తూ లేఖను పోస్ట్ చేసింది . గతనెల రిలీజైన హరిహర వీరమల్లులో హీరోయిన్ ‌ గా నిధి అగర్వాల్ కనిపించింది .

నిధి అగర్వాల్‌కు ప్రభాస్ చేసిన సర్‌ప్రైజ్ గిఫ్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ది రాజాసాబ్ సినిమా విడుదలకు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.