|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: రష్మిక ఊర్లో విజయ్ దేవరకొండ సంచలన కామెంట్స్! కూర్గ్ అమ్మాయిల గురించి వైరల్ టాక్!

Published: 08-04-2026, 1:05 AM
షాకింగ్: రష్మిక ఊర్లో విజయ్ దేవరకొండ సంచలన కామెంట్స్! కూర్గ్ అమ్మాయిల గురించి వైరల్ టాక్!
  • విజయ్ దేవరకొండ, రష్మికల గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుక వైరల్!
  • కూర్గ్ అమ్మాయిల అందంపై విజయ్ కామెంట్స్: రష్మిక రియాక్షన్ అదుర్స్!
  • విజయ్ దేవరకొండ స్కూల్ డేస్ జ్ఞాపకాలు: కూర్గ్‌తో అనుబంధం!
  • విజయ్, రష్మికల జోడీకి ఫ్యాన్స్ ఫిదా.. వైరల్ అవుతున్న ఫోటోలు!

టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వేడుకలు ఒక రేంజ్‌లో జరుగుతున్నాయి. రీసెంట్‌గా రష్మిక స్వస్థలంలో జరిగిన రిసెప్షన్ టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం!

కూర్గ్‌లో గ్రాండ్ రిసెప్షన్

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న నెల రోజుల క్రితం ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తమ పెళ్లి వేడుకలను ఒక రెండు వారాల పాటు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. తాజాగా మంగళవారం నాడు రష్మిక సొంతూరు కూర్గ్ జిల్లాలోని విరాజ్ పేట్ లో రిసెప్షన్ నిర్వహించారు. కొడవ సాంప్రదాయంలో ఈ రిసెప్షన్ ని భారీగా నిర్వహించారు.

అమ్మాయిలపై విజయ్ కామెంట్స్

ఈ రిసెప్షన్ కి రష్మిక బంధువులు, స్నేహితులు, అక్కడి లోకల్ ప్రజలు హాజరయ్యారు. ఈ ఈవెంట్లో విజయ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

వైరల్ అవుతున్న ఫోటోలు

విజయ్ దేవరకొండ రష్మిక సొంతూళ్లో నిర్వహించిన రిసెప్షన్ లో మాట్లాడుతూ.. కూర్గ్ ఒక అందమైన ప్రదేశం. ఇక్కడ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు అని నేను రష్మికని కలిసే ముందే నమ్మాను. అలాంటి అందమైన అమ్మాయిల్లో నేను ఒకర్ని పెళ్లి చేసుకున్నాను. నేను మొదటిసారి కూర్గ్ కి స్కూల్ చదివే రోజుల్లోనే హాలిడే వెకేషన్ కి వచ్చాను. ఈ ప్లేస్ తో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ తర్వాత మరోసారి వచ్చినప్పుడు ఇక్కడ నాకున్న ఒక ఫ్రెండ్ వాళ్ళింట్లో ఉన్నాను. కానీ ఆ ఫ్రెండ్ ఇవాళ రిసెప్షన్ కి రాలేదు. ఇప్పుడు నేను మూడోసారి రావడం ఇది. ఇంకోసారి మళ్ళీ వచ్చి రష్మిక చిన్నప్పటి జ్ఞాపకాలను తిరిగి చూస్తాను ఇక్కడ అని అన్నారు.

విజయ్, రష్మికల ఈ వేడుక ఫ్యాన్స్‌కి పండగలా ఉంది. వారి కామెంట్స్, ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.