|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నిక: కూతురు నిహారిక సంచలన వ్యాఖ్యలు! అసలు ఆ కోరిక ఉందంటూ..?

Published: 20-03-2026, 6:05 AM
నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నిక: కూతురు నిహారిక సంచలన వ్యాఖ్యలు! అసలు ఆ కోరిక ఉందంటూ..?
  • నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి రావడం పట్ల నిహారిక సంతోషం వ్యక్తం చేశారు.
  • కళ్యాణ్ బాబాయ్‌కు నాన్న మొదటి నుంచి అండగా ఉండేవారని నిహారిక తెలిపారు.
  • నాన్నకు సోషల్ సర్వీస్ చేయడం అంటే చాలా ఇష్టమని నిహారిక పేర్కొన్నారు.
  • ఎమ్మెల్సీ అయిన తర్వాత నాన్నను మిస్ అవుతున్నామని నిహారిక అన్నారు.

నిహారిక కొణిదెల తన తండ్రి నాగబాబు ఎమ్మెల్సీ పదవి గురించి మాట్లాడారు. నాగబాబు జనసేన పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిహారిక తన తండ్రి పట్ల గర్వంగా ఫీలవుతున్నానని తెలిపారు.

నాగబాబు ఎమ్మెల్సీపై నిహారిక ఏమన్నారంటే?

Niharika konidela: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. మెగా వారసురాలిగా ఈమె అందరికీ ఎంతో సుపరిచితమే. ఇక నిహారిక ప్రస్తుతం నటిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిహారిక కెరియర్ మొదట్లో యాంకర్ గా పనిచేశారు అనంతరం హీరోయిన్గా పలు సినిమాలలో నటించారు. కానీ ఈమెకు హీరోయిన్ గా మంచి సక్సెస్ రాని నేపథ్యంలో నిర్మాతగా మారారు. పింక్ ఎలిఫెంట్ బ్యానర్ ప్రారంభించి పది సంవత్సరాలు అవుతుంది. ఈ బ్యానర్ పై ఇన్ని రోజులు వెబ్ సిరీస్ లను నిర్మించిన నిహారిక మొదటిసారి కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా ద్వారా నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న ఈమె త్వరలోనే రాకాసా(Raakaasaa) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా ఏప్రిల్ మూడవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక తన వ్యక్తిగత విషయాలు గురించి సినిమాల గురించి అలాగే తన ఫ్యామిలీ గురించి పలు విషయాలను తెలియచేశారు. నాగబాబు ఎమ్మెల్సీ (Nagababu MLC)కావడం గురించి నిహారికకు ప్రశ్నలు ఎదురయ్యాయి. నాగబాబు ప్రస్తుతం జనసేన పార్టీ(Janasena Party) ఎమ్మెల్సీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నాన్నగారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని విషయం తెలియగానే మీరు యాక్షన్ ఏంటీ అంటూ ప్రశ్న ఎదురయింది.

కళ్యాణ్ బాబాయ్‌కు నాన్న సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది

ఈ ప్రశ్నకు నిహారిక సమాధానం చెబుతూ..చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామని తెలిపారు. ఒక మనిషి సక్సెస్ కావాలి అంటే కుటుంబ మద్దతు కూడా ఎంతో అవసరం అలాగే కళ్యాణ్ బాబాయ్ కి నాన్న మొదటి నుంచి కూడా సపోర్ట్ చేస్తూ వస్తున్నారని తెలిపారు. నాన్న కళ్యాణ్ బాబాయ్ ని ఒక కొడుకులాగా చూసుకుంటారు. అలాంటిది నాన్నకు ఇక బాబాయ్ ఒక ఎమ్మెల్సీ పదవిని ఇవ్వడంతో మరింత బాధ్యతలు పెరిగాయని నిహారిక తెలిపారు. నాన్నకు సోషల్ సర్వీస్ చేయడం అంటే ముందు నుంచి కూడా పిచ్చ ఇష్టం,ఆ కోరిక ఉండేదని తెలిపారు .ఇక అలాంటి వ్యక్తి చేతికి ఎమ్మెల్సీ పదవి రావడం చాలా హ్యాపీగా అనిపించిందని తెలిపారు..

మా అల్లుడిని మిస్ అవుతున్నారు..

సోషల్ సర్వీస్‌పై నాగబాబు ఆసక్తి

ఇక నాన్న ఎమ్మెల్సీ అయిన తర్వాత చాలా మిస్ అవుతున్నామని కూడా తెలిపారు. ఎక్కువగా మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీస్ లోనే నాన్న ఉంటున్నారని, ఇప్పుడు అల్లుడు పుట్టడంతో అల్లుడిని నాన్న మిస్ అవ్వడం వల్ల కాస్త టైం దొరికితే వెంటనే ఇంటికి వచ్చి మా అల్లుడిని చూసుకొని తిరిగి వెళ్ళిపోతున్నారని నిహారిక తెలిపారు. ఇంట్లో ఎక్కువగా నాన్న టైం స్పెండ్ చేయడంలేదు అంటూ తన తండ్రి ఎమ్మెల్సీ పదవి గురించి నిహారిక చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక నాగబాబు కూడా ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా కొనసాగిన సంగతి తెలిసిందే. ఇక ఈయన ఎమ్మెల్సీ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు.

మొత్తానికి నాగబాబు ఎమ్మెల్సీ కావడం పట్ల నిహారిక సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా, ఆయన సేవ చేయాలనే తపన గురించి కూడా వివరించారు. ఆయనను మిస్ అవుతున్నట్లు తెలిపారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.