
📌 Key Points
- నిహారిక తన కొత్త ఫోటోలలో పసుపు రంగు దుస్తుల్లో మెస్మరైజ్ చేస్తోంది.
- ఆమె త్వరలో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నట్లు సూచనలు ఉన్నాయి.
- నిహారిక నిర్మించిన ‘కమిటీ కుర్రోలు’ సినిమాకు మంచి ఆదరణ లభించింది.
- వరుణ్ తేజ్ కొత్త సినిమాను నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు.
నిహారిక కొణిదెల తన లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. పసుపు రంగు డ్రెస్ లో ఆమె చాలా అందంగా కనిపిస్తున్నారు. అంతేకాకుండా, ఆమె త్వరలోనే ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.
నిహారిక కొత్త లుక్ వెనుక ఆంతర్యం
Niharika Konidela: నిహారిక కొణిదెల తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి స్పందన పొందుతోంది. ఈ ఫోటోలో నిహారిక పసుపు రంగు సంప్రదాయ డ్రస్‌లో చాలా ఆహ్లాదంగా కనిపించింది. సహజమైన నేపథ్యం, సాఫ్ట్ లైటింగ్ ఈ ఫోటోకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆమె లుక్ చాలా సింపుల్‌గా ఉండటంతో పాటు.. ఒక కొత్త ఆరంభాన్ని సూచించేలా.. ఏదో కొత్తగా అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.
ఈ ఫోటోతో షేర్ చేస్తూ.. నిహారిక “సన్ఫ్లవర్ లాగా ఫీల్ అవుతున్నాను.. కొత్తదనం వైపు అడుగులు వేస్తూ..” అని క్యాప్షన్ పెట్టింది. ఈ మాటలు ఆమె జీవితంలో లేదా కెరీర్‌లో కొత్త దశ మొదలవబోతుందనే భావనను కలిగిస్తున్నాయి. ఈ పోస్ట్‌కు తక్కువ సమయంలోనే వేల సంఖ్యలో లైకులు.. కామెంట్లు వచ్చాయి.
ఈ ఫోటోను ఫోటోస్ బై విష్ణు క్లిక్ చేశారు. స్టైలింగ్‌ను మనోగ్న గోల్లపూడి చేశారు. డ్రస్‌ను లేబుల్ షియన్ మరియు కార్మా ఇండియా అందించాయి. యాక్సెసరీస్ షోల్డ్ షెర్నీ నుంచి తీసుకోగా, హెయిర్‌ను రవి పసుపులేటి స్టైల్ చేశారు. మేకప్ బాధ్యత రామ్ చూసుకున్నారు. అందరి కృషి కలసి ఈ లుక్‌ను చాలా అందంగా తీర్చిదిద్దింది.
‘కమిటీ కుర్రోలు’తో నిర్మాతగా నిహారిక
ఇక కెరియర్ విషయానికి వస్తే..నిహారిక నటిగానే కాదు, నిర్మాతగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. గత సంవత్సరం ఆమె నిర్మించిన ‘కమిటీ కుర్రోలు’ సినిమా ప్రేక్షకుల ప్రశంసలు పొందింది.
ఇక ఆమె సోదరుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు ఈ సంవత్సరం చాలా కీలకం. అతను ప్రస్తుతం ‘కొరియన్ కనకరాజు’ సినిమా షూటింగ్‌లో ఉన్నాడు. ఈ సినిమా 2026 సమ్మర్‌లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. మెర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ను యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్నాయి.
ఇటీవల ‘కమిటీ కుర్రోలు’ దర్శకుడు వంశీ యేడు ఒక కథను వరుణ్ తేజ్‌కు వినిపించారు. ఆ కథ అతనికి బాగా నచ్చడంతో ఈ సినిమాను నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
వరుణ్ తేజ్ కొత్త సినిమా వివరాలు
ఇదే కాకుండా వరుణ్ తేజ్ మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అట్లీ దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన బాలాజీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. స్టోన్‌బెంచ్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
మొత్తానికి నిహారిక కొత్త సినిమా నిర్మాణంతో బిజీ కానున్నారు. ఆమె తన సోదరుడు వరుణ్ తేజ్‌తో కలిసి పనిచేయడం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.


