|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్ ‘కల్కి’ సీక్వెల్‌లో సాయి పల్లవి? ఊహించని ట్విస్ట్! దీపిక స్థానంలో ఆమె ఫిక్స్?

Published: 28-01-2026, 3:05 AM
ప్రభాస్ 'కల్కి' సీక్వెల్‌లో సాయి పల్లవి? ఊహించని ట్విస్ట్! దీపిక స్థానంలో ఆమె ఫిక్స్?
  • సాయి పల్లవి బాలీవుడ్ రామాయణంలో సీతగా, ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో నటిస్తున్నారు.
  • ప్రభాస్ కల్కి సీక్వెల్‌లో సాయి పల్లవి నటించే అవకాశం ఉందని సమాచారం.
  • దీపికా పదుకొణె తప్పుకోవడంతో ఆ పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదించారట.
  • నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ వేసవి నుంచి కల్కి సీక్వెల్ షూటింగ్ ప్రారంభం కానుంది.

టాలీవుడ్ నటి సాయి పల్లవికి ఒక భారీ అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభాస్ నటించిన కల్కి సినిమా సీక్వెల్‌లో హీరోయిన్‌గా నటించే అవకాశం ఆమెకు వచ్చిందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది.

సాయి పల్లవికి బాలీవుడ్ ఆఫర్లు

Sai Pallavi : టాలీవుడ్ న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. గ్లామర్ పాత్రలకు కాకుండా, ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ సినీ ఇండస్ట్రీలో తనకంటూ మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. సినిమాల విషయంలో ఎప్పుడూ ఆచితూచి వ్యవహరిస్తూ వస్తుంది. తను అనుకున్న దారిలోనే వెళ్తూ, నచ్చి మూవీస్ చేస్తూ అద్భుతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లో రామాయణ్ చిత్రంలో సీత పాత్రలో నటిస్తుంది.. ఆ మూవీ రిలీజ్‌కి రెడీగా ఉంది. మరోవైపు దిగ్గజ గాయని ఎమ్మెస్ సుబ్బలక్ష‍్మి బయోపిక్‌లోనూ నటిస్తుంది. వీటితో పాటుగా ఫ్యాన్ ఇండియా స్టార్ హీరో సినిమాలో వినిపిస్తుంది. ఆ హీరో ఎవరు? ఏ సినిమానో కాస్త వివరాల్లోకి వెళితే..

హీరోయిన్ సాయి పల్లవికి గోల్డెన్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. టాలీవుడ్ స్టార్ హీరో, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్లాక్ బాస్టర్ మూవీ కల్కి సీక్వెల్ లో నటించే అవకాశం వరించినట్లు తెలుస్తుంది. గతంలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.. ఈ మూవీ కి సీక్వెల్ గా మరో సినిమా ఉండబోతుందని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు.. అయితే ఈ చిత్రాన్ని త్వరలోనే సెట్స్ మీదకు తీసుకొని వెళ్లనున్నారని సమాచారం.. దీపిక పదుకొణె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొంది. గతేడాది ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. దీపిక పదుకొనే వద్దనుకొని వదిలేసిన ఆ క్యారక్టర్ ను ఎవరు చేస్తారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ పాత్రలో నటించేందుకు డైరెక్టర్ సాయి పల్లవిని సంప్రదించినట్లు తెలుస్తుంది. దానికి సాయి పల్లవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. త్వరలోనే ప్రకటన రావొచ్చని అంటున్నారు. ఒకవేళ ఈ రూమర్స్ నిజమైతే గనుక ప్రభాస్‌, సాయిపల్లవి జోడీ సెట్ అవుతుంది..

ప్రభాస్ కల్కి సీక్వెల్‌లో సాయి పల్లవి?

దీపికా స్థానంలో సాయి పల్లవి ఎంపిక?

కల్కి మూవీకి సీక్వెల్ గా రాబోతున్న చిత్రంపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి.. గతంలో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన మూవీ కావడంతో.. ప్రభాస్ అభిమానులు ఈ సినిమా మరోసారి బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. నాగ్ అశ్విన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడని.. ఈ వేసవి నుంచి షూటింగ్ మొదలవుతుందని అనుకుంటున్నారు. మరి హీరోయిన్ విషయంలో ఏమైనా మార్పులు వస్తాయేమో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాలి. ప్రస్తుతం అయితే ఈ యూనిట్ కి సాయి పల్లవి బెస్ట్ ఆప్షన్ గా నిలిచింది. ఇప్పటికే సోషల్ మీడియాలో సాయి పల్లవిని తీసుకున్నట్లు ఓ వార్త ట్రెండ్ అవుతుంది.. ఇకపోతే ప్రభాస్ సినిమాలు విషయానికి వస్తే.. రీసెంట్ గా రాజా సాబ్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం స్పిరిట్, ఫౌజీ సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.. ఈ సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

సాయి పల్లవి కల్కి సీక్వెల్‌లో నటిస్తే ప్రభాస్, సాయి పల్లవి జోడి చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.