|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మృణాళ్ పెళ్లిపై అల్లు అరవింద్ సంచలన కామెంట్స్! టాలీవుడ్ లో పెళ్లి చేసుకోకుంటే అంతేనా?

Published: 12-04-2026, 7:05 AM
మృణాళ్ పెళ్లిపై అల్లు అరవింద్ సంచలన కామెంట్స్! టాలీవుడ్ లో పెళ్లి చేసుకోకుంటే అంతేనా?
  • నిర్మాత అల్లు అరవింద్ మృణాళ్ ఠాకూర్‌ను తెలుగు వ్యక్తిని వివాహం చేసుకొని ఇక్కడే స్థిరపడమని కోరారు.
  • గతంలో లావణ్య త్రిపాఠి విషయంలో కూడా ఇలాగే చెప్పానని అల్లు అరవింద్ గుర్తు చేశారు.
  • మృణాళ్, ధనుష్ రిలేషన్ వార్తలపై అల్లు అరవింద్ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.
  • అల్లు అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మృణాళ్ ను తెలుగు హీరోను పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అవ్వమని ఆయన కోరారు. గతంలో లావణ్య విషయంలో కూడా ఇలాగే చెప్పానని ఆయన అన్నారు.

మృణాళ్ పై అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్

Allu Aravind Mrunal Thakur:  టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఒకరు. గీత ఆర్ట్స్ బ్యానర్ ద్వారా ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించి నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇకపోతే అల్లు అరవింద్ తాజాగా అడివి శేష్, మృణాళ్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన డెకాయిట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అల్లు అరవింద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన నటి మృణాళ్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మృణాళ్ ఠాకూర్ ఇప్పటివరకు తెలుగులో నటించిన సినిమాలన్నీ చూస్తే కనుక ఆమె అచ్చ తెలుగు అమ్మాయిలాగే ఉంటుంది. అందుకే మీరు కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను అంటూ అల్లు అరవింద్ మాట్లాడారు.

లావణ్య విషయంలో కూడా ఇదే జరిగిందన్న అల్లు అరవింద్

గతంలో తాను లావణ్య త్రిపాఠి విషయంలో కూడా ఇలాగే చెప్పాను అయితే ఆ అమ్మాయి మా వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకొని ఇక్కడే స్థిరపడిపోయింది అలాగే నువ్వు కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను అంటూ అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అల్లు అరవింద్ చేసిన ఈ కామెంట్స్ వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? మృణాళ్ ఠాకూర్ తెలుగు ఇండస్ట్రీకి చెందిన హీరోతో ఎవరితోనైనా రిలేషన్ లో ఉన్నారా? ఆ విషయం తెలిసే అల్లు అరవింద్ ఇలా మాట్లాడారా? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకున్న లావణ్య..

ధనుష్‌తో మృణాళ్ రిలేషన్ నిజమేనా?

గతంలో కూడా ఈయన వరుణ్ తేజ్ లావణ్య విషయం తెలిసినట్టే మాట్లాడారు ఈయన మాట్లాడిన విధంగానే లావణ్య పెళ్లి చేసుకుని తెలుగు సినిమా ఇండస్ట్రీకి కోడలుగా వచ్చారు. ఈ నేపథ్యంలోనే మృణాళ్ గురించి కూడా అదే విధంగా మాట్లాడటంతో మరోసారి మృణాళ్ లవ్ , రిలేషన్ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈమె కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో రిలేషన్ లో ఉన్నారు అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలను ఈమె ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు. ఈ విషయాన్ని పూర్తిగా అందరూ పక్కన పెట్టిన తరుణంలో అల్లు అరవింద్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చెందిన వారిని పెళ్లి చేసుకోమంటూ సలహా ఇవ్వడంతో మరోసారి ఈమె రిలేషన్ కి సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

మొత్తానికి అల్లు అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. మృణాళ్ విషయంలో ఆయన మాటలు ఎంతవరకు నిజమవుతాయో వేచి చూడాలి. ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.