
📌 Key Points
- రామ్ చరణ్ తన కొత్త బాడీగార్డ్‌గా అంతర్జాతీయ MMA ఫైటర్ కెవిన్ కుంటను నియమించుకున్నారు.
- కెవిన్ కుంట గాంబియా దేశానికి చెందినవాడు, ‘పెద్ది’ ట్రైలర్ లాంచ్‌లో కనిపించాడు.
- ఇతని జీతం రోజుకు 2 లక్షల రూపాయలు అని నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.
- సల్మాన్ ఖాన్, యష్ బాడీగార్డ్ జీతాల కంటే చరణ్ బాడీగార్డ్ జీతం చాలా ఎక్కువ.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన వ్యక్తిగత భద్రత కోసం ఒక అంతర్జాతీయ MMA ఫైటర్‌ను నియమించుకున్నారు. కెవిన్ కుంట అనే ఈ బాడీగార్డ్ జీతం రోజుకు రెండు లక్షల రూపాయలు అని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో, నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
స్టార్ హీరోల బాడీగార్డ్స్ జీతాలు
Charan Bodyguard: హీరోలు కనిపిస్తే చాలు సెల్ఫీలని ,ఆటో గ్రాఫ్ లని చుట్టూ ముట్టడం కామన్ అయిపొయింది.అయితే వీటి మాటున ప్రాణాపాయం కూడా దాగుండే అవకాశాలు లేకపోలేదు.అందుకే ముందు జాగ్రత్తగా స్టార్ హీరోలు తమ పర్సనల్ సెక్యూరిటీ కోసం బాడీ గార్డ్స్ ని నియమించుకుంటారన్న సంగతి తెల్సిందే.
దాదాపు 15 లక్షల రూపాయల వరకు జీతం
ఇక ఈ క్రమంలోనే బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ తన పర్సనల్ బాడీగార్డ్ షేరాకు నెలకు దాదాపు 15 లక్షల రూపాయల వరకు జీతం ఇస్తున్నాడని బీ టౌన్ లో వినిపించే టాక్. అలాగే కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌కు వెళ్లిన కన్నడ రాకింగ్ స్టార్ యష్ కూడా తన బాడీ గార్డ్ కి నెలకు 10 లక్షల రూపాయల వరకు కేటాయిస్తున్నాడని సమాచారం. అయితే వీరంతా లోకల్‌గా ఉండే సెక్యూరిటీ ఏజెన్సీలను నమ్ముకుంటే, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాత్రం రూట్ మార్చి ఏకంగా ఒక అంతర్జాతీయ ఫైటర్‌ను రంగంలోకి దించడం ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాక నెట్టింట మంటలు పుట్టిస్తుంది.
ఆఫ్రికన్ బాడీగార్డ్ గురించిన ఆసక్తికర విషయాలు
ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న భారీ బడ్జెట్ అండ్ మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా ప్రమోషన్ల డోస్ పెంచిన మెగా హీరో.. రీసెంట్‌గా ముంబై వేదికగా మే నెలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ‘పెద్ది’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ వేడుక ముగిసినప్పటి నుంచి చరణ్ వెంటే నీడలా ఒక సాలిడ్ పర్సనాలిటీ ఎప్పుడూ కూడా తిరుగుతూ అందరిని ఆకర్షిస్తున్నాడు. చరణ్ పాల్గొనే ప్రతి ప్రెస్ మీట్‌లోనూ, పబ్లిక్ అప్పియరెన్స్‌లోనూ హైట్ అండ్ వెయిట్‌తో అందరినీ భయపెడుతున్న ఆ ఆఫ్రికన్ బాడీగార్డ్ గురించిన ఆసక్తికర విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
రామ్ చరణ్ బాడీగార్డ్‌కు రోజుకు రూ.2లక్షలు?
రామ్ చరణ్ ప్రత్యేక బాడీగార్డ్ ఎవరు?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నియమించుకున్న బాడీగార్డ్ గురించి SMలో తెగ చర్చ జరుగుతోంది. ‘పెద్ది’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నుంచి ప్రతీ కార్యక్రమంలో ఆయన వెంటే ఉంటూ భద్రత కల్పిస్తున్నారు అంతర్జాతీయ MMA ఫైటర్ కెవిన్ కుంటా. గాంబియా దేశానికి చెందిన… pic.twitter.com/YJt48j5bnC
— ChotaNews App (@ChotaNewsApp) May 25, 2026
వెయిట్ ఛాంపియన్‌షిప్‌లో ఎన్నో రికార్డులు
ఆఫ్రికాలోని గాంబియా దేశానికి చెందిన అతని పేరు కెవిన్ కుంట. ఇతను సాధారణ బాడీగార్డ్ కాదు, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన ప్రొఫెషనల్ ఎమ్ఎమ్ఏ (MMA – మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్) ఫైటర్. ఇటలీ మిడిల్ వెయిట్ ఛాంపియన్‌షిప్‌లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న కెవిన్, రింగ్ లోపల ఎంత పవర్‌ఫుల్లో రింగ్ బయట అంతర్జాతీయ విఐపిలు మరియు సెలబ్రిటీలకు వివిఐపి ప్రొటెక్షన్ అందించడంలో అంతే నిపుణుడు. గ్లోబల్ ప్రొఫైల్ ఉన్న బాడీగార్డ్స్ కోసం వెతుకుతున్న క్రమంలో చరణ్ టీమ్ ఈ ఇంటర్నేషనల్ ఫైటర్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది.
రోజుకు 2 లక్షల జీతం నిజమేనా?
వచ్చే జూన్ 4, 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ‘పెద్ది’ సినిమా ప్రమోషన్ల షెడ్యూల్ ముగిసే వరకు రామ్ చరణ్ ఈ ప్రత్యేక రక్షణను ఏర్పాటు చేసుకున్నారని సమాచారం. ఇక్కడే అసలు చర్చ మొదలైంది. ఈ ఇంటర్నేషనల్ బాడీగార్డ్‌కు చరణ్ ఎంత పారితోషికం ఇస్తున్నారనే లెక్కలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం, కెవిన్ కుంటకు రోజుకు ఏకంగా 2 లక్షల రూపాయల వరకు ఇస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ లెక్కన నెలకు చూసుకుంటే అది అక్షరాలా 60 లక్షల రూపాయల వరకు అవుతుంది.
భారతీయ సినిమా చరిత్రలోనే ఒక బాడీగార్డ్‌కు అత్యధిక పారితోషికం
బాలీవుడ్ టాప్ హీరోల పర్సనల్ సెక్యూరిటీ ఖర్చుల కంటే ఇది చాలా ఎక్కువ. ఒకవేళ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈన్యూస్ గనుక నిజమైతే మాత్రం, భారతీయ సినిమా చరిత్రలోనే ఒక బాడీగార్డ్‌కు అత్యధిక పారితోషికం ఇస్తున్న రికార్డు రామ్ చరణ్ పేరిట రీ రైట్ అవడం పక్కా.ఇక ‘పెద్ది’ చిత్రం నార్త్ ఇండియా మార్కెట్‌తో పాటు గ్లోబల్ వైడ్‌గా భారీ అంచనాలతో వస్తుండటంతో, ప్రమోషన్ల సమయంలో ఎక్కడా భద్రతా లోపాలు రాకూడదనే ఉద్దేశంతోనే మెగా హీరో ఇంత భారీ మొత్తాన్ని వెచ్చిస్తున్నట్లు ఫిలిం నగర్ టాక్ . మొత్తానికి పెద్ది సినిమాతో పాటు కొత్త బాడీగార్డ్ వ్యవహారం చరణ్ క్రేజ్ ని మరో లెవల్ లో పెట్టేస్తున్నాయన్న మాట !
రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట జీతంపై చర్చ కొనసాగుతోంది. ఈ భారీ జీతం స్టార్ హీరోల భద్రతకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలియజేస్తుంది. ఈ వార్త సినీ వర్గాల్లో ఆశ్చర్యం కలిగిస్తోంది.


