|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్ చరణ్‌తో నిహారిక సంచలన చిత్రం! గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపు!!

Published: 22-03-2026, 5:05 AM
రామ్ చరణ్‌తో నిహారిక సంచలన చిత్రం! గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపు!!
  • నిహారిక కొణిదెల నిర్మాతగా రాణిస్తున్నారు, త్వరలో ‘రాకాసా’ సినిమా విడుదల కానుంది.
  • రామ్ చరణ్‌తో రంగస్థలం, ధృవ తరహా సినిమా చేయాలని నిహారిక ఆసక్తిగా ఉన్నారు.
  • నిర్మాతగా నిహారిక ఇదివరకే పలు వెబ్ సిరీస్‌లను నిర్మించి విజయం సాధించారు.
  • సంగీత్ శోభన్, నయన్ సారిక హీరో హీరోయిన్లుగా ‘రాకాసా’ చిత్రం హర్రర్ ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోంది.

నిహారిక కొణిదెల రామ్ చరణ్‌తో సినిమా తీయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమె ఇప్పటికే ఒక కథను సిద్ధం చేశారని, రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారని సమాచారం. త్వరలో ఆమె నిర్మించిన ‘రాకాసా’ విడుదల కానుంది.

నిర్మాతగా నిహారిక సక్సెస్

Niharika Konidela: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. మెగా డాటర్ గా అందరికీ ఎంతో సుపరిచితమైన ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్నారు. కెరీర్ మొదట్లో యాంకర్ గా కొనసాగిన ఈమె అనంతరం నటిగా ఇండస్ట్రీలో స్థిరపడ్డారు  ఇక హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ అందుకొని నేపథ్యంలో నిహారిక నిర్మాతగా మారి ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ నిర్మాతగా సక్సెస్ అందుకున్నారు. ఇక త్వరలోనే నిహారిక నిర్మాణంలో రాకాసా(Raakaasaa) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ మూడో తేదీ విడుదల కాబోతోంది.

ఈ నేపథ్యంలోనే నిహారిక వరస ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారికకు తన ఇంట్లో హీరోల సినిమాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. మీకు కనుక మీ నిర్మాణంలో మెగా హీరోలతో సినిమా చేసే ఛాన్స్ వస్తే మీరు చిరంజీవి, పవన్ కళ్యాణ్ లేదా రామ్ చరణ్ ఈ ముగ్గురిలో ఎవరితో సినిమా చేస్తారు అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు నిహారిక సమాధానం చెబుతూ తాను చరణ్(Charan) అన్నతోనే సినిమా చేస్తానని సమాధానం ఇచ్చారు.

రామ్ చరణ్‌తో సినిమాపై నిహారిక ఆసక్తి

ఇక చరణ్ గారితో సినిమా చేసే అవకాశం వస్తే ఎలాంటి సినిమా చేస్తారనే ప్రశ్న ఎదురవగా తాను ఒక రంగస్థలం, ధృవ లాంటి కాప్ పాత్రలతో ఉండే సినిమా చేస్తాను అంటూ నిహారిక ఈ సందర్భంగా రామ్ చరణ్ తో ఏ జానర్ లో సినిమా చేయాలనుకుంటున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా బయటపెట్టారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారడంతో నిహారిక చరణ్ తో ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్నారనే విషయంపై ఫుల్ క్లారిటీతో ఉన్నారని ఇక చరణ్ నుంచి నిహారికతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ రావడమే ఆలస్యం అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

మొదటి సినిమాతోనే నిర్మాతగా సక్సెస్…

‘రాకాసా’ సినిమాతో నిహారిక

ఇక నిహారిక ఇదివరకు ఎన్నో వెబ్ సిరీస్ లను నిర్మించి మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఈమె సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న నిహారిక ఇప్పుడు రాకాసా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సంగీత్ శోభన్, నయన్ సారిక ఈ సినిమాలో హీరో హీరో హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. ఈ సినిమా హర్రర్ ఫాంటసీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. మరి ఏప్రిల్ మూడో తేదీ రాబోతున్న ఈ సినిమా నిహారికకు ఎలాంటి సక్సెస్ ఇస్తుంది అనేది తెలియాల్సి ఉంది.

నిహారిక రామ్ చరణ్‌తో సినిమా చేయడానికి ఎదురుచూస్తున్నారు. ‘రాకాసా’ విడుదల తరువాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందో లేదో చూడాలి. దీనిపై మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.