|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నిహారిక ‘రాకాస’ మూవీ కలెక్షన్ల సునామీ! ఫస్ట్ డే రికార్డు బ్రేకింగ్ వసూళ్లు?

Published: 04-04-2026, 5:35 AM
నిహారిక 'రాకాస' మూవీ కలెక్షన్ల సునామీ! ఫస్ట్ డే రికార్డు బ్రేకింగ్ వసూళ్లు?
  • తారాగణం, బడ్జెట్ తో సంబంధం లేకుండా కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించిన సినిమా.
  • మొదటి రోజు రాకాస మూవీ రూ. 2.60 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది.
  • ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.5.6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
  • పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మించబడింది.

నిహారిక నటించిన రాకాస మూవీ విడుదలై మంచి టాక్ తో దూసుకుపోతుంది. మొదటి రోజు కలెక్షన్ల పరంగా ఈ సినిమా సంచలనం సృష్టించింది. చిన్న సినిమాగా విడుదలై భారీ వసూళ్లు సాధించింది.

రాకాస మూవీ మొదటి రోజు కలెక్షన్ల వివరాలు

Raakasa Collections: తారాగణంతో పని లేకుండా.. బడ్జెట్ ను పట్టించుకోకుండా.. కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నారు అనడానికి ఇప్పుడు ఎన్నో సినిమాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలోనే చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి షో తోనే మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది నిహారిక (Niharika) రాకాస మూవీ. ఒకప్పుడు హీరోయిన్ గా తనను తాను తెరపై చూసుకోవాలని ఎంతో మురిసిపోయింది. అయితే ప్రేక్షకులు అలా ఆదరించకపోవడంతో మళ్లీ యూటర్న్ తీసుకొని క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో సరిపెట్టుకుంది. కానీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక హోదాను కల్పించుకోవాలని చూసిన మెగా డాటర్ నిహారిక “పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్” నిర్మించి ‘కమిటీ కుర్రోళ్ళు’ అనే సినిమా చేసి మొదటి సినిమాతోనే నిర్మాతగా మంచి సక్సెస్ ను సొంతం చేసుకుంది.

అదే జోష్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ. అదే రాకాస. లవ్, కామెడీ, అడ్వెంచర్, ఫాంటసీ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ మానస శర్మ దర్శకత్వం వహించారు. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా వచ్చిన ఈ చిత్రంలో తనికెళ్ల భరణి , వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, ఆశిష్ విద్యార్థి ,గెటప్ శ్రీను, వాసు ఇంటూరి, రోహిణి , రోహన్ రాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి అటు గురువారం తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో కూడా పెయిడ్ ప్రీమియర్ షోలు పడ్డాయి.

సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్

మరి ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్ తో పాటు మొదటి రోజు ఎంత కలెక్షన్స్ వసూలు చేసింది అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారీ ప్రమోషన్స్ తో అంతకుమించి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటిరోజు 2.60 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. 36% ఆక్యుపెన్సీ తో వచ్చిన ఈ సినిమాకి అటు ప్రీమియర్ల నుంచి కూడా మంచి స్పందన లభించింది. ప్రీమియర్స్ తో పాటు మొదటి రోజు కలెక్షన్స్ కలిపి ఈ సినిమా 5.6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. మొత్తానికైతే చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా మొదటి రోజే భారీ కలెక్షన్స్ వసూలు చేసిందని చెప్పవచ్చు.

నిర్మాణ సంస్థ ప్రకటన

ఏది ఏమైనా చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా అటు ప్రీమియర్స్ తో పాటు మొదటి రోజు కలెక్షన్స్ రూ.5.6 కోట్ల గ్రాస్ వసూలు చేయడంతో క్రిటిక్స్ నుంచి ఆడియన్స్ నుంచి అభినందనలు లభిస్తున్నాయి. ఇకపోతే ఇప్పుడు వీకెండ్స్ కావడంతో శనివారం, ఆదివారం ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు కూడా భావిస్తున్నాయి. ఇక ఈ చిత్రాన్ని పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జి స్టూడియోస్ సంస్థలపై నిహారిక కొణిదెల , ఉమేష్ కుమార్ భన్సాల్ నిర్మించారు . అనుదీప్ దేవ్ సంగీతం అందించారు.

చిన్న సినిమాగా వచ్చిన రాకాస మూవీ మొదటి రోజే భారీ కలెక్షన్లు రాబట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా రానున్న రోజుల్లో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.