
నిహారిక కొణిదెల, విశ్వక్ సేన్‌ల అరుదైన రొమాంటిక్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వీరిద్దరి కెమిస్ట్రీ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇది పాత షార్ట్ ఫిల్మ్ కావచ్చని కొందరు అభిప్రాయపడుతుండగా, ఈ వీడియో ఎప్పటిదో తెలుసుకోవాలని చాలామంది ఆసక్తిగా ఉన్నారు.
Key Points
నిహారిక కొణిదెల, విశ్వక్ సేన్ ల రొమాంటిక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో నిహారిక గిలిగింతలు పెడుతుంటే విశ్వక్ సిగ్గుపడినట్లు ఉంది.
ఇది ఒక పాత షార్ట్ ఫిల్మ్ కావచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుందని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.
వైరల్ అవుతున్న నిహారిక, విశ్వక్ సేన్ వీడియో
నిహారిక కొణిదెల మెగా డాటర్‌గా సినిమాల్లోకి ఎంటర్ అయింది. కానీ నటిగా ప్రూవ్ చేసుకునే లోపే.. పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత విడాకులతో కెరీర్ రీస్టార్ట్ చేసినా.. నిర్మాతగానే సెటిల్ అయిపోయింది. అయితే హీరోయిన్‌గా చేసిన రెండు మూడు సినిమాల్లో యావరేజ్ అనిపించుకున్న నిహారిక.. నిర్మాతగా మాత్రం వావ్ అనిపిస్తుంది. ఇక ఇదంతా పక్కన పెడితే.. విశ్వక్ సేన్‌తో సినిమా చేయని నిహారికకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇందులో ఓ గోడ పక్కన నిల్చున్న ఇద్దరు సిగ్గుపడుతున్నారు. నిహారిక గిలిగింతలు పెడుతుంటే.. విశ్వక్ సిగ్గుపడుతూ మెలికలు తిరిగిపోయాడు. అయితే ఇలాంటి వీడియో బయటకు రావడంతో.. ఈ సినిమా ఎక్కడిది? ఇదంతా ఎప్పుడు జరిగింది? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే మరికొందరు వీరిద్దరు ఒకే కాలేజీలో చదువుకుని ఉంటారని.. ఆ టైంలో తీసిన షార్ట్ ఫిల్మ్ అయ్యుండొచ్చని చెప్తున్నారు. మొత్తానికి ఇద్దరి కెమిస్ట్రీ బాగానే కుదిరిందని అభిప్రాయపడుతున్నారు.
కెమిస్ట్రీపై నెటిజన్ల చర్చ
పాత షార్ట్ ఫిల్మ్ అయ్యుండొచ్చా?
మొత్తంగా, నిహారిక, విశ్వక్ సేన్ ల ఈ రొమాంటిక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరి కెమిస్ట్రీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ వీడియో ఎక్కడిది, ఎప్పుడు తీసింది అనే వివరాలు త్వరలో బయటపడతాయేమో చూడాలి.


