|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఈ తేదీల్లో పుట్టిన వారు ఎంత నిజాయితీవంతులు?

Published: 24-04-2025, 2:49 AM
ఈ తేదీల్లో పుట్టిన వారు ఎంత నిజాయితీవంతులు?

న్యూమరాలజీ ప్రకారం, జన్మ తేదీ వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతుంది. కొన్ని తేదీల్లో పుట్టిన వారు నిజాయితీకి ప్రతీకలుగా ఉంటారని చెబుతారు. ఈ కథనంలో ఆ తేదీలు, వాటి ప్రభావం గురించి తెలుసుకుందాం.

Key Points

1

2, 11, 20, 29 తేదీల్లో పుట్టిన వారికి చంద్రుడు పాలక గ్రహం.

2

7, 16, 25 తేదీల్లో పుట్టిన వారికి కేతువు పాలక గ్రహం.

4

ఈ సమాచారం సూచనార్థమే; నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

న్యూమరాలజీ ప్రకారం జన్మ తేదీల ప్రాముఖ్యత

న్యూమరాలజీ ఆధారంగా మనం చాలా విషయాలని చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా భవిష్యత్తుతో పాటుగా ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటాయనేది కూడా చెప్పవచ్చు. ప్రతి వ్యక్తి జన్మ సంఖ్య నిర్దిష్ట గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. దాని ద్వారా ఆ వ్యక్తి గురించి మనం తెలుసుకోవచ్చు.

ఈ తేదీల్లో పుట్టిన వారికి నిజాయితీ ఎక్కువ. పైగా ఎటువంటి కల్మషం ఉండదు. మోసం అంటే ఏంటో కూడా ఈ తేదీల్లో పుట్టిన వారికి తెలియదు. ఎల్లప్పుడూ నిజాయితీతో ఉంటారు. మరి ఇందులో మీరు కూడా ఉన్నారేమో చెక్ చేసుకోండి.

ఈ తేదీల్లో పుట్టిన వారు నిజాయితీతో ఉంటారు

2, 11, 20, 29 తేదీల ప్రత్యేకత

ఒక్కో మనిషి వ్యక్తిత్వం , తీరు ఒక్కోలా ఉంటుంది, కొంతమంది తక్కువ మాట్లాడితే కొంతమంది ఎక్కువగా మాట్లాడుతుంటారు. కొంతమంది ఓర్పుతో ఉంటే కొంత మందికి అసలు ఓర్పే ఉండదు. అలాగే కొంతమంది నిజాయితీగా వ్యవహరిస్తూ ఉంటారు.

ఈ తేదీల్లో పుట్టిన వారు నిజాయితీకి నిదర్శనం అని చెప్పవచ్చు. పైగా వీరి మనసులో కల్మషం ఉండదు. ఎప్పుడు నీతి, నిజాయితీ అంటారు. తప్పు చేయడం కూడా వీళ్లకు ఇష్టం ఉండదు. ఏ పని చేసినా కూడా మోసం చేయకుండా నిజాయితీతో ఉంటారు.

ఏదైనా నెలలో రెండు 2,11,20,29 తేదీల్లో పుట్టిన వారు మూల సంఖ్య రెండు అవుతుంది. చంద్రుడు వీరిని పరిపాలిస్తాడు. అందుకని ఈ తేదీల వారు పవిత్రంగా గొప్ప హృదయాన్ని కలిగి ఉంటారు. ఎవరినీ మోసం చేయరు. ఎప్పుడు నిజాయితీతో ఉంటారు. వీళ్ళు చేసే పనుల్లో ఏ మాత్రం మోసం ఉండదు. ఎల్లప్పుడు మంచి మార్గంలో నడుస్తారు. ఇతరులకు సహాయం చేస్తారు. నిజాయితీతో ఉంటారు.

7, 16, 25 తేదీల ప్రభావం

ఏదైనా నెలలో 7,16,25 తేదీల్లో పుట్టిన వారి రాడిక్స్ నెంబర్ 7 అవుతుంది. వీరి పాలక గ్రహం కేతువు. దీంతో వీర స్వభావం చాలా బాగుంటుంది. ఇతరులకి సహాయం చేయడానికి కూడా ఇష్టపడతారు. నిజాయితీగా వ్యవహరిస్తారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

ఈ సమాచారం కేవలం సూచనార్థం. నిజాయితీ అనేది వ్యక్తిగత లక్షణం. జ్యోతిష్యం సూచనలను పరిగణనలోకి తీసుకుని, మీ స్వంత నిర్ణయాలు తీసుకోండి.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.