|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Nikhil Siddhartha : OG హిట్ అవుతుందని 2008 లోనే చెప్పిన నిఖిల్.. వీడియో వైరల్..

Published: 28-09-2025, 7:17 AM
Nikhil Siddhartha : OG హిట్ అవుతుందని 2008 లోనే చెప్పిన నిఖిల్.. వీడియో వైరల్..

పవన్ కళ్యాణ్ OG సినిమా భారీ విజయం సాధించిన వేళ, నిఖిల్ సిద్ధార్థ్ ఆసక్తికర వీడియో పంచుకున్నారు. 2008లో తాను నటించిన ‘యువత’ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ సీన్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు OG సినిమాతో పోలుస్తూ వైరల్ అవుతున్నాయి.

Key Points

1

పవన్ కళ్యాణ్ OG సినిమా 200 కోట్లకు పైగా గ్రాస్ సాధించి పెద్ద హిట్ అయింది.

2

OG హిట్ అవుతుందని తాను 2008లో 'యువత' సినిమాలో చెప్పినట్లు నిఖిల్ తెలిపాడు.

4

ఇప్పుడు OGలో అలాంటి సీనే రావడంతో నిఖిల్ పంచుకున్న పాత వీడియో వైరల్ గా మారింది.

OG హిట్ అంచనాపై నిఖిల్ వీడియో

Nikhil Siddhartha : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల OG సినిమాతో వచ్చి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పెద్ద హిట్ అయి దాదాపు 200 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. అయితే ఈ సినిమా హిట్ అవుతుందని నేను 2008 లోనే చెప్పానంటూ హీరో నిఖిల్ ఓ ఆసక్తికర వీడియో షేర్ చేసాడు.(Nikhil Siddhartha)

హీరో నిఖిల్ 2008 లో యువత అనే ఓ సినిమా చేసాడు. ఆ సినిమాలో నిఖిల్, అతని ఫ్రెండ్స్ సరదాగా కూర్చొని మందు తాగుతూ ఉండే సీన్ ఉంటుంది. ఆ సీన్ లో నిఖిల్ ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ ఓ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పి విలన్ తల నరికేస్తాడు. అంతే ఇంటర్వెల్ అని సరదాగా ఓ స్టోరీ చెప్తాడు. దానికి నిఖిల్.. ఈ సీన్ కనక పవన్ కళ్యాణ్ కి పడితే సంవత్సరం ఆడుద్ది సినిమా అంటాడు.

2008 ‘యువత’ సినిమాలో నిఖిల్ ప్రస్తావన

ఇప్పుడు OG సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ ఓ విలన్ తల నరికేయడంతో ఇంటర్వెల్ పడుతుంది. దీంతో ఈ వీడియోని నిఖిల్ షేర్ చేసి.. నేను ఎప్పుడో 2008 లోనే చెప్పాను. ఈ సీన్ పడితే సినిమా బ్లాక్ బస్టర్ అని. యువత సినిమాలోనే OG గురించి చెప్పాము అంటూ పోస్ట్ చేసాడు. ఈ వీడియో వైరల్ గా మారడంతో పవన్ ఫ్యాన్స్ నిజమే కదా పవన్ కళ్యాణ్ కి ఆ రేంజ్ పవర్ ఫుల్ సీన్ ఇదే మొదటిసారి పడటం అని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ OG సీన్‌తో పోలిక

మీరు కూడా ఆ వీడియో చూసేయండి..

నిఖిల్ సిద్ధార్థ్ పంచుకున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పవన్ కళ్యాణ్ అభిమానులు నిఖిల్ అంచనాను మెచ్చుకుంటూ, OG బ్లాక్ బస్టర్ కు ఆ సీన్ కారణమని అంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.