
📌 Key Points
- నిఖిల్ నటించిన ‘స్వయంభు’ మూవీ విడుదల వాయిదా పడింది.
- ఫిబ్రవరి 13న విడుదల కావాల్సిందిగా ప్రకటించినప్పటికీ, షూటింగ్ పెండింగ్‌లో ఉండటంతో వాయిదా పడింది.
- ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు, ఇది ఒక పీరియాడికల్ మైథలాజికల్ చిత్రం.
- సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
నిఖిల్ సిద్దార్థ్ నటించిన ‘స్వయంభు’ మూవీ విడుదల వాయిదా పడింది. ఫిబ్రవరి 13న విడుదల కావాల్సిందిగా ప్రకటించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. దీనికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్వయంభు మూవీ విడుదల వాయిదాకు కారణం?
Swayambhu Movie : టాలీవుడ్ స్టార్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గతంలో కార్తికేయ 2 లో నటించారు.. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో నిఖిల్ పాన్ ఇండియా హీరో అయ్యాడు.. ఆ తర్వాత నిఖిల్ సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకుని స్వయంభూ సినిమాని ప్రకటించాడు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీ గత ఎడదే విడుదలవుతుందని అందరూ అనుకున్నారు. కానీ షూటింగ్ పెండింగ్ ఉండడంతో సినిమా రిలీజ్ వాయిదా పడింది. అయితే ఇప్పట్లో ఈ సినిమా లేదు అని అందరూ అనుకున్నారు..రెండు నెలల కిందట లాంచ్ చేసిన మేకింగ్ వీడియో సినిమా మీద అంచనాలను పెంచింది.. ఆ వీడియోలో విజువల్స్ జనాలను బాగా ఆకట్టుకున్నాయి. సినిమా ఫిబ్రవరి 13న రిలీజ్ కాబోతుందని ప్రకటించారు కూడా.. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో ఈ సినిమా రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు.. అందుకు కారణం కూడా లేకపోలేదు. నిఖిల్ స్వయంభు మళ్లీ వెనక్కి వెళ్ళడానికి కారణం ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం..
హీరో నిఖిల్ నటిస్తున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘స్వయంభు’ పై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తుండగా పూర్తి పిరియాడికల్ మైథలాజిక్ చిత్రంగా ఈ మూవీ రానుంది.. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. అందులో ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు జనాలను బాగా ఆకట్టుకోవడంతో సినిమా కోసం నిఖిల్ అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీ ఫిబ్రవరి 13న రిలీజ్ అవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఇప్పుడు షూటింగ్ పెండింగ్ ఉండటంతో ఈ డేట్ ను థియేటర్లలోకి రావడం కష్టమే అనిపిస్తుంది. కేవలం విడుదలకు 20 రోజులే ఉంది. అలాగే ఈ సినిమా ప్రమోషన్స్ కానీ ఎటువంటి అప్డేట్ కానీ రాకపోవడంతో మళ్లీ వాయిదా పడిందని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. మరి ఆ వార్తలపై చిత్ర యూనిట్స్ స్పందించి ఒక క్లారిటీ ఇస్తుందేమో చూడాలి..
సినిమాపై అంచనాలు, విడుదల తేదీ
నిఖిల్ కొత్త లుక్, హీరోయిన్లు
హీరో నిఖిల్ గతంలో యాక్షన్ అలాగే లవ్ ఎంటర్టైనర్ సినిమాల్లో నటించాడు.. కానీ ఇప్పటివరకు ఎన్నడూ కనిపించని విధంగా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. మూవీ పోస్టర్ చూస్తే యుద్ధంలో శత్రువులను ఓడించే వీరుడుగా కనిపిస్తున్నాడు. పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ కాబోతున్న ఈ మూవీ సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే మాత్రం నిఖిల్ హ్యాట్రిక్ కొట్టినట్లే.. మరి సినిమాల ఎలాంటి టాక్ ను అందుకుంటుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.. ఇక ఈ మూవీ తర్వాత మరో రెండు ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు తెలుస్తుంది.. త్వరలోనే వాటి గురించి ప్రకటించే అవకాశం కూడా ఉంది..
స్వయంభు సినిమా విడుదల వాయిదా పడటం నిఖిల్ అభిమానులకు కాస్త నిరాశ కలిగించే విషయమే. చిత్ర యూనిట్ త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తుందని ఆశిద్దాం.


