
📌 Key Points
- సౌమిత్ పోలాడి, శ్రేయాసి సేన్ జంటగా ‘నిలవే’ మూవీ విడుదల!
- వైవా హర్ష, సుప్రియ ఐసోలా కీలక పాత్రల్లో అద్భుత నటన
- అర్జున్-అదితి ప్రేమకథలో ఊహించని ట్విస్ట్: ప్రేక్షకులు షాక్!
- విజువల్స్, మ్యూజిక్ అదిరిపోయాయి! కానీ సాగదీతతో నిరాశపరిచింది.
సౌమిత్ పోలాడి, శ్రేయాసి సేన్ జంటగా నటించిన ‘నిలవే’ మూవీ ఫిబ్రవరి 13న విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం. ప్రేమకథలో ట్విస్ట్ లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం!
అర్జున్-అదితి లవ్ స్టోరీ!
Nilave Review : సౌమిత్ పోలాడి, శ్రేయాసి సేన్ జంటగా తెరకెక్కిన సినిమా ‘నిలవే’. POV ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం నిర్మాణంలో సౌమిత్ పోలాడి, సాయి కే వెన్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు ఫిబ్రవరి 13న రిలీజ్ అయింది. ఈ సినిమాకు ముందే స్పెషల్ ప్రీమియర్స్ వేశారు. వైవా హర్ష, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గొల్లపూడి, అనాల సుశ్మిత.. పలువురు కీలక పాత్రల్లో నటించారు.(Nilave Review)
అర్జున్ అనాథ. తనకంటూ ఎవరూ లేరు అని బాధపడుతూ ఉంటాడు. తనని గతంలో ఇష్టపడ్డ అమ్మాయి ఐరా(సుష్మిత అనాల) కూడా వేరేవాళ్లను పెళ్లి చేసుకోడానికి రెడీ అవ్వడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు. ఆ సమయంలోనే తన బాల్కనీకి ఎదురుగా ఉన్న అపార్టుమెంట్లో సింగర్ అదితి(శ్రేయసి సేన్)ని చూసి ఆగిపోతాడు. అదితి వెంటే తిరుగుతూ ఆమెకి దగ్గరవుతాడు. అదితి అర్జున్ కెరీర్ కి సపోర్ట్ చేస్తుంది. దీంతో అర్జున్ ఆమె ప్రేమలో పడిపోతాడు. కానీ అదితి తన గతాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఎప్పుడూ డల్ గా ఉంటుంది. అర్జున్ కి అదితి అనుకోకుండా దగ్గరవుతుంది. మరి అర్జున్ – అదితి ప్రేమించుకుంటారా? పెళ్లి చేసుకుంటారా? అసలు అదితి గతం ఏంటి.. ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఇది ఒక రెగ్యులర్ లవ్ స్టోరీ. ఒక అబ్బాయి అమ్మాయిని చూసి ప్రేమించడం, ఆ అమ్మాయికి ఏదో గతం ఉండటం, అది అర్ధం చేసుకొని హీరోగా హీరోయిన్ కి నచ్చినట్టే ఉండటం.. ఇలాంటివి చాలా సినిమాల్లోనే ఉన్నాయి. అక్కడివరకు ఇదొక బ్యూటిఫుల్ విజువల్స్ తో మ్యూజికల్ గా సాగదీసిన ప్రేమకథలా అనిపిస్తుంది. సినిమా అయిపోయిందేమో అనుకునేసరికి హీరోయిన్ ప్రగ్నెంట్ అని చెప్పి ఇంకో అరగంట సాగదీశారు. క్లైమాక్స్ లో ఓ ట్విస్ట్ ఉంటుంది. క్లైమాక్స్ లో మనకు చూపించిన ట్విస్ట్ హీరోయిన్ పాత్రకి తెలిసినా అలా ఎందుకు చేస్తుందో క్లారిటీ ఇవ్వలేదు. హీరోయిన్ క్యారెక్టర్ క్లారిటీగా రాసుకోలేదు. పాపం హీరో అని అనిపించడం ఖాయం.
కాకపోతే సినిమా అంతా విజువల్ గా పొయెటిక్ గా చూపిస్తూ ఆల్మోస్ట్ బిట్ సాంగ్స్, సాంగ్స్ అన్ని కలిపి 11 సాంగ్స్ తో, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఒక ఫీల్ గుడ్ సినిమాలా చెప్పాలనుకున్నరు. కానీ అక్కర్లేకపోయినా చాలా సీన్స్ సాగదీశారు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ప్రతి సీన్ చెప్పేయొచ్చు అయినా మన సహనాన్ని పరీక్షిస్తూ సాగదీశారు. లివ్ ఇన్ రిలేషన్ కాన్సెప్ట్ ని కొత్తగా చూపించారు. వైవా హర్ష, జీవన్ కుమార్ తో కామెడీ అక్కడక్కడా ట్రై చేసారు కానీ వర్కౌట్ అవ్వలేదు. ఇక హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ మళ్ళీ రొటీన్. చాలా సినిమాల్లో చూపించిందే.
ట్విస్ట్ లతో సాగిన ప్రేమకథ!
గతంలో యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ హవా నడిచిన సమయంలో మెలోడీక్ బ్యూటిఫుల్ విజువల్స్, లవ్ డైలాగ్స్ తో దాదాపుగంట నిడివి ఉన్న షార్ట్ ఫిలిమ్స్ వచ్చేవి. ఈ నిలవే కూడా అలాంటి షార్ట్ ఫిలిం ఫీలింగ్ ఇస్తుంది. కాకపోతే గంటలో చెప్పాల్సిన కథని రెండు గంటలు సాగదీశారు. మొత్తంగా హీరోయిన్ వెంట తిరుగుతూ హీరో ఆమెకు నచ్చినట్టు ఉండాలి అని సాగే ప్రేమకథ కానీ ప్రేమకథ కాదు. ఎవరూ లేని ఓ అబ్బాయి అందర్నీ వదులుకొని జీవితంపై క్లారిటీ లేని ఓ అమ్మాయి ఎలా కలిశారు, కలిసి లివ్ ఇన్ లో ఉండే కథ. ఓపిక ఉంటే ఈ లవ్ జానర్ సినిమా చూడొచ్చు.
ఇదొక మ్యూజికల్ లవ్ స్టోరీ అని ఓ ప్రెస్ మీట్, ఒకటి రెండు సోషల్ మీడియా పోస్టులు తప్ప అసలు ఈ సినిమా ప్రమోష చేయలేదు. అసలు ఈ సినిమా వస్తుందని కూడా జనాలకు తెలీదు. డైరెక్టర్ మౌత్ పబ్లిసిటీతో మా సినిమా హిట్ అవుతుంది అని ప్రెస్ మీట్ లో అన్నారు అసలు ఆ మౌత్ పబ్లిసిటీ ఉండాలన్న సినిమా ఉందని జనాలకు తెలియాలి కదా. కనీసం ఈ సినిమా సంబంధించిన పట్టుమని పది పోస్టర్స్ కూడా ఎక్కడా దొరకలేదంటే వీళ్ళు ఎంతలా ప్రమోట్ చేసారో అర్ధం చేసుకోవచ్చు. కనీసం వాళ్ళ నిర్మాణ సంస్థ సోషల్ మీడియా పేజీలలో కూడా ఈ సినిమా పోస్టర్స్ లేకపోవడం గమనార్హం. మంచి సినిమా తీశామని నమ్మకం ఉన్నా అది జనాల్లోకి వెళ్లేలా చేయాలి కూడా అప్పుడే సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కనీసం ఓపెనింగ్స్ అయినా వస్తాయి అనేది సినిమా తీసే కొత్తవాళ్లు తెలుసుకోవాలి.
సౌమిత్ రావు, అదితి ఇద్దరూ కొత్తవాళ్లు అయినా ఈ కథలో బాగా ఒదిగిపోయి నటించారు. నటన పరంగా ఇద్దరూ బెస్ట్ ఇచ్చారు. వైవా హర్ష, జీవన్ కుమార్ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేయాలి. అసలు సుప్రియ ఐసోలాని హర్షకు భార్య క్యారెక్టర్ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చిందో. వాళ్ళ పెయిర్ అసలు సెట్ అవ్వలేదు. ఢీ ఫేమ్, సీరియల్ యాక్టర్ అనాల సుస్మిత గెస్ట్ రోల్ లో మెరిపించింది. రూపేష్ మారాపు నెగిటివ్ షేడ్స్ లో బాగానే నటించాడు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
విజువల్స్ అదిరిపోయాయి అంతే!
ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ విజువల్స్, మ్యూజిక్ చాలా ప్లస్ అయ్యాయి. ఈ రెండే సినిమాని నిలబెట్టాయి. సినిమాటోగ్రఫీ విజువల్స్, ఆ ఫ్రేమ్స్ చాలా కళాత్మకంగా, కవితాత్మకంగా కనిపించి మెప్పిస్తాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. 11 సాంగ్స్ అన్ని మెప్పిస్తాయి. ఎడిటింగ్ పరంగా మాత్రం సినిమాలో ఓ 15 నుంచి 20 నిమిషాల వరకు ల్యాగ్ సీన్స్ కట్ చేయొచ్చు. రొటీన్ లవ్ స్టోరీనే పొయిటిక్ గా చెప్పాలనుకున్నాడు దర్శకుడు. సినిమాలో డైలాగ్స్ మాత్రం బాగున్నాయి. నిర్మాణ పరంగా కూడా తక్కువ బడ్జెట్ లోనే ఈ సినిమాకు మంచి అవుట్ పుట్ ఇచ్చారు.
మొత్తంగా ‘నిలవే’ సినిమా ఒక పొయిటిక్ మ్యూజికల్ ప్రేమకథ. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
నిలవే మూవీ ఒక కొత్తరకం ప్రేమకథ. విజువల్స్ పరంగా సినిమా చాలా బాగుంది. కానీ కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టు అనిపించాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


