|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాగార్జునతో అనిల్ రావిపూడి సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఫిక్స్! టాలీవుడ్లో సంచలనం!

Published: 17-01-2026, 4:15 AM
నాగార్జునతో అనిల్ రావిపూడి సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఫిక్స్! టాలీవుడ్లో సంచలనం!
  • అనిల్ రావిపూడి గతంలో సంక్రాంతికి వెంకటేష్, చిరంజీవితో బ్లాక్ బస్టర్ విజయాలు సాధించారు.
  • అనిల్ రావిపూడి, నాగార్జున కాంబినేషన్ మూవీ త్వరలో ప్రారంభం కానుంది.
  • ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
  • 2027 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.

ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తన నెక్స్ట్ మూవీని నాగార్జునతో ప్లాన్ చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ కలయిక టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది.

అనిల్ రావిపూడి సక్సెస్ జర్నీ

Tollywood: అనిల్ రావిపూడి (Anil Ravipudi).. ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఓటమెరుగని దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో సంక్రాంతిని టార్గెట్ గా చేసుకొని సినిమాలు విడుదల చేస్తూ.. సంక్రాంతి డైరెక్టర్గా కూడా పేరు దక్కించుకుంటున్నారు. అందులో భాగంగానే గత ఏడాది సంక్రాంతికి వెంకటేష్ (Venkatesh) తో కలిసి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు అనిల్ రావిపూడి. ఈ ఏడాది మళ్లీ అదే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అలా ఇప్పటివరకు 9 చిత్రాలు చేసిన ఈయన.. ఆ తొమ్మిది చిత్రాలతో మంచి విజయాలను దక్కించుకున్నారు.

ఇకపోతే నాగార్జున (Nagarjuna) తో నెక్స్ట్ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అనిల్ రావిపూడి. ఈ మేరకు త్వరలో అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే అనిల్ రావిపూడి ఎప్పటినుంచో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో సినిమాలు చేస్తూ ఆ నిర్మాణ సంస్థకు భారీ లాభాలను చేకూరుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరోసారి దిల్ రాజుతో సినిమా చేయడానికి సిద్ధం అయ్యారు. పైగా ఈ చిత్రాన్ని కూడా వచ్చే సంక్రాంతి అనగా 2027 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయబోతున్నారు. ఇక మొత్తంగా అందుతున్న సమాచారం ప్రకారం.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నాగార్జున హీరోగా దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

నాగార్జునతో అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ

ఇకపోతే అనిల్ రావిపూడి ఎప్పుడైతే చిరంజీవితో సినిమా ప్రకటించారో.. ఇక అప్పటినుంచి ఒక్క నాగార్జునతో సినిమా చేస్తే సీనియర్ స్టార్ హీరోలు అందరితో సినిమా చేసిన డైరెక్టర్ గా అనిల్ రావిపూడి రికార్డు సృష్టిస్తారని ఎప్పటినుంచో ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు నాగార్జునతో సినిమా చేసి ఆ రికార్డు సొంతం చేసుకుంటానని అనిల్ రావిపూడి కూడా ఇటీవల కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. మొత్తానికి ఇప్పుడు ఆ వార్త నిజం కాబోతోంది మొత్తానికి ఆ రికార్డు సృష్టించిన దర్శకుడిగా అనిల్ రావిపూడి నిలవనున్నారు.

దిల్ రాజు నిర్మాణంలో సినిమా

ఇకపోతే తాజాగా చిరంజీవితో మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా చేసిన అనిల్ రావిపూడి.. ఇందులో ఘరానా మొగుడు తరహాలో చిరంజీవిని వింటేజ్ లుక్ లో చూపించి ఆకట్టుకున్నారని దర్శకుడిపై ప్రశంసలు కురిపించారు మెగా అభిమానులు. ఇప్పుడు హలో బ్రదర్ తరహాలో సినిమా తీయాలని నాగార్జున అభిమానులు కోరుకుంటున్న విషయం తెలిసిందే. హలో బ్రదర్ వంటి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ ను అనిల్ రావిపూడి ప్లాన్ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. అంతేకాదు హలో బ్రదర్ సినిమాలోని ఒక పాటను రీమిక్స్ చేస్తారని సమాచారం. మరి వచ్చే సంక్రాంతి టార్గెట్ గా రాబోతున్న అనిల్ ఈ సినిమాతో ఇంకెలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.

అనిల్ రావిపూడి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇప్పుడు నాగార్జునతో కలిసి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.