|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నిన్ను కోరి ఆగస్ట్ 14 ఎపిసోడ్: చంద్రకళకు కరెంట్ షాక్- అసూయతో రగిలిపోయిన విరాట్- శాలినికి కామాక్షి బ్లాక్ మెయిల్

Published: 13-08-2025, 11:20 PM
నిన్ను కోరి ఆగస్ట్ 14 ఎపిసోడ్: చంద్రకళకు కరెంట్ షాక్- అసూయతో రగిలిపోయిన విరాట్- శాలినికి కామాక్షి బ్లాక్ మెయిల్

నిన్ను కోరి సీరియల్ ఆగస్టు 14వ తేదీ ఎపిసోడ్‌లో అనేక ఉత్కంఠభరిత సంఘటనలు చోటుచేసుకుంటాయి. చంద్రకళకు కరెంట్ షాక్ తగలడం, విరాట్ యొక్క అసూయ, శాలినిపై కామాక్షి యొక్క బ్లాక్ మెయిల్ వంటివి ఈ ఎపిసోడ్‌లో ప్రధాన ఆకర్షణలు.

Key Points

1

చంద్రకళకు కరెంట్ షాక్ తగులుతుంది!

2

విరాట్ అసూయతో రగిలిపోతాడు.

4

శాలిని లక్ష రూపాయలు ఇవ్వడానికి నిరాకరిస్తుంది.

చంద్రకళకు షాక్!

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇక నుంచి మనం శాలిని మీద కాన్సంట్రేట్ చేయాలి. శాలీని సీక్రెట్ మన దగ్గర ఉంది కాబట్టి శాలిని నుంచి కావాల్సినంత డబ్బు లాగాలి. మనకు కూడా తెలియనివ్వలేదు అంటే కచ్చితంగా అడిగింది ఇస్తుంది. చంద్ర వెళ్లిపోయాక విరాట్‌ను నువ్ పెళ్లి చేసుకుని ఏలాలంటే శాలినిని కంట్రోల్‌లో పెట్టుకోవాలిగా అని కూతురికి తల్లి కామాక్షి చెబుతుంది.

మరోవైపు చంద్ర స్విచ్ వేయకుండానే ఐరన్ చేస్తుంది. విరాట్ వస్తే స్విచ్ వేయమంటుంది. విరాట్ స్విచ్ వేస్తాడు. చంద్రకళకు షాక్ కొట్టి గిలగిలకొట్టుకుంటుంది. దాంతో విరాట్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. చంద్రకళ షాక్ కొట్టడం ఆగిపోతుంది. ప్రాణాలతో బయటపడుతుంది. చంద్రకళ అరుపులు విన్న శ్యామల స్టోర్ రూమ్ వైపు వస్తుంది. చంద్రకళకు షాక్ కొట్టగానే విరాట్ భయపడిపోతాడు.

చంద్రకు జాగ్రత్తలు చెబుతాడు. దీంతో నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో తెలిసిందని చంద్రకళ అంటుంది. శ్యామల రావడం గమనించిన విరాట్ వెళ్లి సోఫా వెనుక దాక్కుంటాడు. శ్యామల వచ్చి ఏమైందని అడిగితే షాక్ కొట్టింది చెబుతుంది చంద్ర. కానీ, విరాట్‌ను చూసిన శ్యామల కోప్పడుతుంది. బయటకు వచ్చిన విరాట్ చంద్రకు షాక్ కొట్టిందని వచ్చాను. మళ్లీ నన్ను చూస్తే ఎక్కడ అపార్థం చేసుకుంటావో అని దాక్కున్నాను అని చెప్పేసి వెళ్లిపోతాడు.

మీ వల్లే బావ నాపై కేర్ చూపిస్తున్నారు. మీరు చేయించిన దాంపత్యం వ్రతం వల్లే అని శ్యామలతో అంటుంది చంద్రకళ. మరోవైపు శాలిని దగ్గరికి వెళ్లి లక్ష రూపాయలు అడుగుతారు తల్లీకూతురు. చెబితే చెప్పుకోండి. నేను ఒక్క రూపాయి ఇవ్వను అని శాలిని అంటుంది. విడాకుల గురించి చెబితే ఏం కాదేమో కానీ, దాని వెనుకున్న కారణం తెలిస్తే అని కామాక్షి అంటుంది.

విరాట్ యొక్క అసూయ

దాంతో భయపడిపోయిన శాలిని ఏంటీ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా అని అడుగుతుంది. మేమేందుకు బ్లాక్ మెయిల్ చేస్తాం. మనం ఫ్రెండ్స్ కదా. కానీ, మా బిజినెస్‌కు మీరు హెల్ప్ చేయు. లక్ష రూపాయలు నీకు పెద్ద మ్యాటర్ కాదుగా అని కామాక్షి అంటుంది. కోపంతో వెళ్లిపోండి అని శాలిని అంటుంది. దాంతో వెళ్లిన కామాక్షి, శ్రుతి కచ్చితంగా డబ్బులు ఇస్తుందనుకుంటారు.

మరుసటి రోజు ఉదయం చంద్ర కనిపించకపోవడంతో తానే కాఫీ పెట్టి సర్‌ప్రైజ్ చేస్తాననుకుంటాడు విరాట్. మరోవైపు రఘురాం దగ్గర భగవద్గీత శ్లోకాలు చదివి వాటికి అర్థాలు చెబుతుంది చంద్రకళ. అది విరాట్, జగదీశ్వరి ఇద్దరు వింటుంటారు. తర్వాత రఘురాం చేయికి చంద్రకళ ఆయిల్ రాస్తుంది. కిచెన్‌లో చంద్రకళ, హాల్లో విరాట్ ఒకరినొకరు రొమాంటిక్‌గా చూసుకుంటారు.

శ్యామల రావడంతో ఇద్దరు ఆగిపోతారు. ఇంతలో చంద్రకళకు అర్జున్ కాల్ చేస్తాడు. మీకోసం ఓ సర్‌ప్రైజ్, డోర్ బయట ఎదురుచూచ్తుంది అని అర్జున్ చెబితే చంద్రకళ వెళ్లి చూస్తుంది. చంద్రకళకు పూల మొక్క గిఫ్ట్‌గా పంపిస్తాడు అర్జున్. ఫోన్‌లో అర్జున్‌ను పొగుడుతుంది చంద్రకళ. అది చూసి అసూయతో రగిలిపోతాడు విరాట్. తర్వాత విరాట్‌ దగ్గరికి వచ్చి అర్జున్ గురించి గొప్పగా చెబుతుంది చంద్ర.

కామాక్షి యొక్క బ్లాక్ మెయిల్

పూలమొక్కను స్టోర్ రూమ్‌లో పెడతాను అని చంద్రకళ అంటే చాలు ఆపు అని కోపంగా అరుస్తాడు విరాట్. ఏంటీ బావ అలా కోపంగా అరిచావ్. పిన్ని గారు ఉన్నారన అని వెళ్లిపోతుంది చంద్రకళ. అదంతా శాలిని చూస్తుంది. మరోవైపు క్రాంతి డిజైన్స్ క్లైంట్స్‌కు నచ్చాయని, ముంబై నుంచి బిజినెస్ కోసం ఇంటికి వస్తున్నారని చెబుతుంది శాలిని. కంగ్రాట్స్ అని క్రాంతి అంటాడు.

ఇదంతా నీకోసమే క్రాంతి. నేను చేసినదాన్ని సరిదిద్దుకుంటాను. నా మీద కోపం పోయిందా అని శాలిని అంటుంది. నీ ఎఫర్ట్స్ చూస్తే సంతోషంగానే ఉంది. కానీ, ముక్కలైన మనసు అతుక్కోదు అని క్రాంతి అంటాడు.

మరోవైపు విరాట్‌తో తనను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయమని చంద్రకళ ప్లాన్ ఇస్తుంది. అది విన్న కామాక్షి శ్యామలకు చెబుతారు. దాంతో చంద్రకళ ప్లాన్‌ను ఫెయిల్ చేస్తుంది శ్యామల. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

ఈ ఎపిసోడ్‌లో చంద్రకళ, విరాట్, శాలిని మరియు కామాక్షి మధ్య సంఘర్షణలు మరింత తీవ్రత చెందుతాయి. శాలిని భవిష్యత్తు ఏమిటి? విరాట్ తన అసూయను ఎలా అధిగమిస్తాడు?

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.