
📌 Key Points
- విరాట్, చంద్రకళలు క్రాంతిని మార్చడానికి నకిలీ గొడవ డ్రామా మొదలుపెట్టారు.
- తనపై నింద పడేలా శాలినీ ప్లాన్ చేసిందని చంద్రకళ విరాట్‌కు చెబుతుంది.
- క్రాంతిని నమ్మించడానికి తమ మధ్య గొడవలు జరిగినట్లు నటించాలని విరాట్ వ్యూహం.
- ఇంటి తాళాలు అమ్మకు ఇవ్వనని చంద్రకళ తేల్చి చెప్పగా, విరాట్ నటన కొనసాగించాడు.
నిన్ను కోరి సీరియల్‌లో ఉత్కంఠ భరితమైన మలుపు చోటుచేసుకుంది. డిసెంబర్ 19 ఎపిసోడ్‌లో విరాట్, చంద్రకళలు క్రాంతిని తమవైపు తిప్పుకోవడానికి పెద్ద ప్లాన్ వేస్తారు. వారి నకిలీ గొడవ, శాలిని అనుమానాలు ప్రేక్షకులను ఉత్సాహపరుస్తున్నాయి. ఇంటి తాళాల డ్రామాతో కథ రసవత్తరంగా మారింది.
విరాట్, చంద్రకళల డ్రామా: అసలు ప్లాన్ ఇదే!
నిన్ను కోరి సీరియల్ డిసెంబర్ 19 ఎపిసోడ్‌లో తనపై నింద పడేలా శాలినీనే ప్లాన్ చేసిందని విరాట్‌తో చెబుతుంది చంద్రకళ. దాంతో ఇద్దరు గొడవ పడినట్లు అందరి ముందు నటిద్దామని, దాంతో క్రాంతికి దగ్గర కావచ్చని విరాట్ మైండ్ గేమ్ చెబుతాడు. అనుకున్నట్లుగానే ఇద్దరు గొడవ పడతారు. శాలిని తప్పా అంతా నమ్ముతారు.
నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఏదో శ్రుతికి తాళి కట్టారు కదా అని ఏమనట్లేదు. తల్లివి అయిండి కొడుకుని సరిదిద్దగా సపోర్ట్ చేస్తావా. శ్రుతికి అన్యాయం చేయాలని చూస్తే నాలో తేడాను చూస్తారు అని చంద్రకళ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. తర్వాత చంద్రకళ ను విరాట్ తిడతాడు. నాకు ముందే చెప్పి ఉండొచ్చుగా అంటాడు. ఇదంతా ప్లాన్ ప్రకారమే చేశారు. అదంతా శాలిని చేసిందని చంద్రకళ అంటుంది.
క్రాంతిని లొంగదీసేందుకు మైండ్ గేమ్
క్రాంతిని మార్చడం అసాధ్యం అని మాట్లాడుకుంటారు. నువ్వు నన్ను అపార్థం చేసుకోవాలనే ఈ ప్లాన్ చేసిందని చంద్రకళ చెబుతుంది. అయితే ఇప్పుడు చేసుకుంటాను. శాలిని అనుకున్నట్లుగానే నేను నిన్ను ద్వేషిస్తాను. క్రాంతిని నమ్మించాలి అంటే మనమధ్య గొడవలు జరగాలి. జరిగినట్లు మనం నటించాలి. అలా చేసి మీ వదిన తప్పు చేసిందని క్రాంతికి చెబితే వాడు నన్ను నమ్ముతాడని విరాట్ అంటాడు.
జాలి రాజు, తల్లి కలిసి కామాక్షి తలుపు కొట్టి లేపుతారు. అవతలికి పోండి అని తిడతారు కామాక్షి, శ్రుతి. ఇదే కరెక్ట్ టైమ్ అని విరాట్ డ్రామా స్టార్ట్ చేస్తాడు. రాజ్‌పై ఫైర్ అవుతాడు. శ్రుతి ఘోరంగా మోసపోయిందని విరాట్ అంటే.. అది నీ భార్య వల్లేగా అని శ్యామల అంటుంది. దాంతో తన పేరు ఎత్తకండి అని చంద్రపై కోప్పడినట్లు నటిస్తాడు విరాట్.
శాలిని అనుమానం, ఇంటి తాళాల గొడవ
ఇంతలో చంద్ర వచ్చి రాజ్‌కు టవల్ ఇస్తుంది. చంద్ర అడ్వైజ్ ఇవ్వడం తప్పు కాదు. పెళ్లి జరుగుతుందని తెలిసిన మనకు చెప్పకపోవడం తప్పు అని కోప్పడతాడు. ఇంతలా కోప్పడుతున్నారు. ఇది నిజమా అబద్ధమా అని శాలిని డౌట్ పడుతుంది. ఒకరు మోసపోతే తప్పా ఎవరేంటో తెలిసి రాలేదని క్రాంతి అంటాడు.
దాంతో అంతా షాక్ అవుతారు. నా భర్త కూడా నాపై ద్వేషంతోనే తాళి కట్టాడని చంద్రకళ అంటుంది. విరాట్ కూడా ఎమోషనల్‌గా మాట్లాడుతాడు. ఇంటి తాళాలు వెంటనే అమ్మకు ఇచ్చేయ్ అని విరాట్ అంటాడు. నేను ఇవ్వను అని చంద్రకళ వెళ్లిపోతుంది. నా చంద్ర నాతో అలా అంటూ ఎమోషనల్ అయినట్లు నటిస్తాడు విరాట్.
నిన్ను కోరి సీరియల్ డిసెంబర్ 19 ఎపిసోడ్ విరాట్, చంద్రకళల తెలివైన ఎత్తుగడలు, శాలిని అనుమానాలతో నిండిపోయింది. క్రాంతిని మార్చాలనే వారి ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ప్రేక్షకులు ఆసక్తిగా తదుపరి ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు.


