
📌 Key Points
- విరాట్, క్రాంతి స్వీట్ తినిపించుకొని తమ బంధాన్ని బలపరుచుకున్నారు.
- అన్నదమ్ములు కలిసినందుకు శాలిని అసూయతో రగిలిపోయింది.
- రాజ్ ఇంటిని, అప్పులను చూసి శ్రుతి, కామాక్షి షాకయ్యారు.
- శ్యామల కుర్చీ విరిగిపడటం, దోమల బాధతో వెళ్ళిపోవాలని శ్రుతి అనడం.
నిన్ను కోరి సీరియల్ డిసెంబర్ 30 ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది. విరాట్, క్రాంతి తిరిగి కలిసినందుకు శాలిని అసూయతో మండిపడింది. రాజ్ ఆర్థిక పరిస్థితి, అతని ఇల్లు చూసి శ్రుతి షాక్ అవ్వడంతో పాటు అప్పుల వాళ్ళ బెదిరింపులు సీరియల్ కు ఊహించని మలుపును తెచ్చాయి.
విరాట్, క్రాంతిల ఆత్మీయ అనుబంధం, శాలిని ఆగ్రహం
నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 30 ఎపిసోడ్ లో క్రాంతికి విరాట్ స్వీట్ తినిపిస్తాడు. అన్నాదమ్ములు కలిసిపోవడంతో శాలినికి మండిపోతుంది. రాజ్ ఇల్లు చూసి శ్రుతి షాక్ అవుతుంది. అప్పుల వాళ్లు వచ్చి రాజ్ మీద పడతారు.
నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 30 ఎపిసోడ్ లో ముంబయి ప్రాజెక్ట్ ఓకే కావడంతో క్రాంతిని తెగ పొగిడేస్తాడు విరాట్. చంద్ర కంగ్రాట్స్ చెప్తే క్రాంతి పట్టించుకోడు. క్రాంతికి స్వీట్ తినిపిస్తాడు విరాట్. రఘురాం కూడా వచ్చి హ్యాపీగా ఫీల్ అవుతాడు. అమ్మానాన్నలకు స్వీట్ తినిపిస్తాడు క్రాంతి. విరాట్ కు కూడా ఇస్తాడు. అదంతా చూసి శాలినికి మండిపోతుంది. క్రాంతి మీటింగ్ కు ఆఫీస్ వెళ్లాలన్నావు కదా అని గుర్తు చేస్తుంది శాలిని.
రాజ్ ఇంట్లో అప్పులవారి గొడవ: శ్రుతికి షాక్
ఇల్లు లోపలి చూసి శ్రుతి, కామాక్షి, శ్యామల మరింత కంగారు పడతారు. టీవీ కూడా లేదా అనుకుంటారు. శ్యామల కూర్చోగానే కుర్చీ విరిగి కిందపడుతుంది. మన గది చూపిస్తానని శ్రుతిని లోపలికి తీసుకెళ్తాడు రాజ్. భోజనం చేయగానే వెళ్లిపోతానని శ్యామల అంటే, కామాక్షి రిక్వెస్ట్ చేస్తుంది.
శ్యామల, కామాక్షిల భోజన తంటాలు
ఈ దోమలు, వాసన పడట్లేదమ్మా వెళ్లిపోదామని శ్రుతి అంటుంది. మన ప్రేమ, ఆప్యాయత తెలిసేలా చేద్దామని తల్లితో రాజ్ అంటాడు. వాడు అప్పుల్లో లక్షాధికారే అని అప్పులోళ్లు వస్తారు. రెండు వేలు చేతిలో పెడుతుంది కామాక్షి, వాడు ఇవ్వాల్సింది రెండు లక్షలు అని అప్పులోళ్లు అంటారు. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
మొత్తంగా, ఈ ఎపిసోడ్ విరాట్-క్రాంతిల బంధం, శాలిని పన్నాగాలతో పాటు రాజ్, శ్రుతిల జీవితాల్లో కొత్త సమస్యలను చూపించింది. రాబోయే ఎపిసోడ్‌లలో ఈ పరిణామాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.


