|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సంపూర్ణేష్ వైలెంట్ అవతార్: ‘ది పారడైజ్’లో ఊహించని ‘బిర్యాని’ లుక్!

Published: 19-12-2025, 9:44 AM
సంపూర్ణేష్ వైలెంట్ అవతార్: ‘ది పారడైజ్’లో ఊహించని ‘బిర్యాని’ లుక్!
  • సంపూర్ణేష్ బాబు ‘ది పారడైజ్’లో ‘బిర్యాని’ అనే వైలెంట్ పాత్రలో కనిపించనున్నారు.
  • చేతిలో ఆయుధం, రక్తంతో కూడిన సంపూ లుక్ అభిమానులను షాక్‌కు గురిచేసింది.
  • నేచురల్ స్టార్ నాని, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు.
  • శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది పారడైజ్’ 2026 మార్చ్ 26న విడుదల కానుంది.

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబును ఇప్పటివరకు కామెడీ పాత్రల్లోనే చూశాం. కానీ ‘ది పారడైజ్’ మూవీలో ఆయన ‘బిర్యాని’ అనే వైలెంట్ పాత్రలో సరికొత్తగా కనిపించనున్నారు. తాజాగా విడుదలైన ఆయన ఫస్ట్ లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. నాని, మోహన్ బాబులతో కూడిన ఈ భారీ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

సంపూ వైలెంట్ అవతార్: ఊహించని బిర్యానీ లుక్

The Paradise: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు.. ఈ పేరు వింటే మనకు హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి కామెడీ చిత్రాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ, ఇక నుంచి సంపూర్ణేష్ బాబు అంటే మాత్రం పక్కా వైలెంట్ పత్రాలు గుర్తుకు రావడం ఖాయం. దానికి పర్ఫెక్ట్ ఎగ్జామ్పుల్ అంటే ది పారడైజ్(The Paradise) మూవీ నుంచి తాజాగా విడుదలైన సంపూర్ణేష్ బాబు లుక్ గా చెప్పుకోవచ్చు. నేచురల్ స్టార్ నాని హీరోగా ది పారడైజ్ అనే పాన్ ఇండియా సినిమా వస్తున్న విషయం తెలిసిందే. దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

Nidhi Agarwal: నిధి పాప అందాలకు నెటిజన్స్ ఫిదా.. ఫొటోలు

నాని, మోహన్ బాబుతో భారీ కాస్ట్

ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన నాని, మోహన్ బాబు లుక్స్ కి ఆడియన్స్ నుంచి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో కీలక పాత్రకు సంబందించిన పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. అదే సంపూర్ణేష్ బాబు లుక్. ఈ సినిమాలో సంపూర్ణేష్ బిర్యానీ అనే పాత్రలో కనిపిస్తాడు అంటూ ఆయన పోస్టర్ విడుదల చేశారు. చేతిలో ఇనుప అయిదం, మరో చేతిలో సిగరెట్, మొహానికి రక్తంతో చాలా వైలెట్ లుక్ లో కనిపిస్తున్నాడు సంపూ.

‘ది పారడైజ్’ మూవీ విశేషాలు

అసలు ఊహించని రేంజ్ లో ఈ లుక్ ఉండటంతో ఆడియన్స్ అవాక్కవుతున్నారు. ఖచ్చితంగా ఈ సినిమాలో ఆయన పాత్ర నెక్స్ట్ లెవల్లో ఉండబోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే, ఇంతకాలం కేవలం కామెడీ చిత్రాలకే పరిమితం అయినా సంపూ ఈ సినిమాతో తనలోని మరోకోణాన్ని ఆడియన్స్ కి పరిచేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 మార్చ్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘ది పారడైజ్’ సినిమాలో సంపూర్ణేష్ బాబు పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. కామెడీ నుంచి వైలెంట్ అవతార్‌లోకి మారిన ఆయన ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.