|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నిన్ను కోరి అక్టోబర్ 28 ఎపిసోడ్: పూర్తిగా శాలిని మాయ‌లో క్రాంతి-చంద్ర‌కు షాక్‌-భార్య‌కు సారీ చెప్పిన విరాట్‌-మ‌ళ్లీ గొడవ

Published: 28-10-2025, 1:15 AM
నిన్ను కోరి అక్టోబర్ 28 ఎపిసోడ్: పూర్తిగా శాలిని మాయ‌లో క్రాంతి-చంద్ర‌కు షాక్‌-భార్య‌కు సారీ చెప్పిన విరాట్‌-మ‌ళ్లీ గొడవ

నిన్ను కోరి సీరియల్ అక్టోబర్ 28 ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది. శాలిని మాటలు నమ్మిన క్రాంతి, చంద్రకళను అనుమానించి విరాట్‌తో మరోసారి గొడవ పడ్డాడు. భార్యకు విరాట్ సారీ చెప్పినా గొడవలు సద్దుమణగలేదు. జగదీశ్వరి ఎమోషనల్ అవ్వడంతో ఎపిసోడ్ ముగిసింది.

Key Points

1

క్రాంతి శాలిని మాయలో పడి చంద్రకళను అనుమానిస్తాడు, ఆమె నిజం చెప్పినా నమ్మడు.

2

శాలిని తన కపట మాటలతో క్రాంతిని పూర్తిగా తనవైపు తిప్పుకుంటుంది.

4

పిల్లల తీరు చూసి జగదీశ్వరి ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంటుంది.

శాలిని మాయలో క్రాంతి

నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ 28 ఎపిసోడ్ లో చంద్రకళ తప్పు చేసిందని నమ్ముతాడు క్రాంతి. శాలిని మాయలో పూర్తిగా పడిపోయి చంద్ర, విరాట్ ను నానా మాటలంటాడు. మరోసారి క్రాంతి, విరాట్ కు గొడవ జరుగుతుంది. జగదీశ్వరి ఎమోషనల్ అవుతుంది.

నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ 28 ఎపిసోడ్ లో మామయ్యను కొట్టింది శాలినియే అని క్రాంతికి చెప్తుంది చంద్రకళ. నువ్వు అదే మాట అంటున్నావా వదినా? అని క్రాంతి అడుగుతాడు. నువ్వు విడాకులు ఇస్తానంటే ఓ ఛాన్స్ ఇవ్వమంది నేనే. ఇప్పుడు నేను చెప్పేది నమ్మవా? అని అడుగుతుంది చంద్ర. కానీ క్రాంతి మాత్రం భార్యకు సపోర్ట్ చేస్తాడు.

క్రాంతి-విరాట్ మళ్లీ గొడవ

నువ్వు నన్ను నమ్మావు. నువ్వు చంద్ర మాయలో ఉండి నన్ను అనుమానించి ఉంటే ఏమైపోయేదాన్నో. నువ్వు నమ్మితే చాలు అని శాలిని కపట మాటలు చెప్తుంది. ఫ్యూచర్ లో ఇద్దరం ముగ్గురం కాబోతున్నామనే ఫీలింగ్ ను ఎంజాయ్ చేద్దామని శాలిని అంటుంది. ఇద్దరు ఒకరికొకరు అన్నం తినిపించుకుంటారు.

మామయ్య ప్రాణం తీయాలని ఎలా అనుకుంటానని శాలిని కన్నీళ్లు పెట్టుకుంటుంది. మళ్లీ విరాట్, క్రాంతి గొడవ పడతారు. విరాట్ ను చంద్ర ఆపుతుంది. చంద్రను శ్యామల , కామాక్షి మాటలంటారు. మనసులో కుట్రలు పెట్టుకుని పూజలు చేస్తే ఏం లాభమని క్రాంతి అనగానే విరాట్ చేయి ఎత్తుతాడు. మేం ఇప్పుడే వెళ్లిపోతామని క్రాంతి అంటే జగదీశ్వరి సీరియస్ అవుతుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది.

జగదీశ్వరి ఆవేదన

వాళ్లు వాళ్ల భార్యల గురించే ఆలోచిస్తున్నారు. తల్లిదండ్రుల బాధ అర్థం కావడం లేదని జగదీశ్వరి ఎమోషనల్ అవుతుంది. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

నిన్ను కోరి నేటి ఎపిసోడ్ లో క్రాంతి, విరాట్‌ల మధ్య విభేదాలు, శాలిని కుట్రలు హైలైట్‌గా నిలిచాయి. తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకోలేని పిల్లల తీరుతో కథనం మరింత ఆసక్తిగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.