|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నిన్ను కోరి అక్టోబర్ 3 ఎపిసోడ్: భార్య‌తో క‌లిసి ఎక్స్ ల‌వ‌ర్‌కు విరాట్ హెల్ప్‌.. రూమ్‌లో లాక్ చేసిన ప్ర‌మోద్‌.. ట్విస్ట్

Published: 03-10-2025, 12:00 AM
నిన్ను కోరి అక్టోబర్ 3 ఎపిసోడ్: భార్య‌తో క‌లిసి ఎక్స్ ల‌వ‌ర్‌కు విరాట్ హెల్ప్‌.. రూమ్‌లో లాక్ చేసిన ప్ర‌మోద్‌.. ట్విస్ట్

నిన్ను కోరి అక్టోబర్ 3వ తేదీ ఎపిసోడ్‌లో ఊహించని మలుపులు చోటు చేసుకున్నాయి. భార్య చంద్రకళతో కలిసి తన మాజీ ప్రియురాలు శ్వేతకు విరాట్ సహాయం చేయడానికి ప్రయత్నించాడు. అయితే, డబ్బు కోసం శ్వేతను బ్లాక్‌మెయిల్ చేస్తున్న ప్రమోద్, వారిని గెస్ట్ హౌస్‌లో బంధించి షాక్ ఇచ్చాడు. తదుపరి ఏం జరిగిందో తెలుసుకోండి.

Key Points

1

శ్వేతను బ్లాక్‌మెయిల్ చేస్తున్న ప్రమోద్ నుండి కాపాడాలని విరాట్, చంద్రకళ నిర్ణయం.

2

రూ.5 లక్షలు ఇవ్వకపోతే ఫోటోలు లీక్ చేస్తానని శ్వేతను బెదిరించిన ప్రమోద్.

4

బంధించిన విరాట్, చంద్రకళను చంపి శ్వేతపై నింద వేయాలని ప్రమోద్ ప్లాన్.

విరాట్, చంద్రకళల సాహసం

నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ 3వ తేదీ ఎపిసోడ్ లో చేపలు పులుసు టేస్ట్ గురించి కార్లో వెళ్తూ శ్రుతి, కామాక్షికి చెప్తాడు జల రాజ్. శ్రుతిని ఫ్లర్ట్ చేస్తూనే ఉంటాడు రాజ్. అప్పుడే బిచ్చగాడు వస్తే బిల్డప్ కోసం రాజ్ తన పర్సులోనుంచి రూ.500 తీసి వేస్తాడు. శ్రుతి వెళ్లిపోగానే రూ.500 మళ్లీ తీసేసుకుంటాడు రాజ్.

ప్రమోద్ తో ఫోన్లో మాట్లాడుతూ ఏడుస్తుంది శ్వేత. అడిగినంత డబ్బులు ఇవ్వలేనని, టార్చర్ చేస్తే చనిపోతానని అంటుంది. అది చూసిన చంద్రకళ అసలు మీ సమస్య ఏంటీ అని అడుగుతుంది. చంద్రను పట్టుకొని ఏడ్చేసిన శ్వేత .. ప్రమోద్ తో లవ్ గురించి చెప్తుంది. విరాట్ కు బ్రేకప్ చెప్పి, ప్రమోద్ తో లివిన్ రిలేషన్ షిప్ స్టార్ట్ చేశా. వాడు సీక్రెట్ గా ఫొటోలు, వీడియోలు తీసి డబ్బు కోసం బెదిరించడమే వాడి పని. నెట్ లో పెడతానని చెప్పి డబ్బులు అడుగుతూనే ఉన్నాడని శ్వేత చెప్తుంది.

రాత్రి లోపు రూ.5 లక్షలు ఇవ్వకపోతే ఫొటోలు లీక్ చేస్తానని అంటున్నాడని శ్వేత ఏడుస్తుంది. వాడికి బుద్ధి చెప్పి తీరాలి. మా ఆయనకు చెప్పి వాడి ఆట కట్టిస్తానని విరాట్ కు జరిగింది చెప్తుంది చంద్ర. కానీ విరాట్ మాత్రం హెల్ప్ చేయనని అంటాడు. చంద్ర రిక్వెస్ట్ చేస్తుంది. తన ప్రాబ్లెం సాల్వ్ చేస్తే మూడు రోజుల్లో వెళ్లిపోతుంది లేదంటే 30 రోజులు ఉంటుందని చంద్ర అంటుంది. తను ఇక్కడి నుంచి వెళ్లిపోవడం కోసం ప్రాబ్లెం సాల్వ్ చేస్తానని విరాట్ ఒప్పుకుంటాడు.

శ్వేతను బ్లాక్‌మెయిల్ చేస్తున్న ప్రమోద్

చంద్రకళ, విరాట్, శ్వేత బయటకు వెళ్లేందుకు కిందకు వస్తారు. హాల్లో ఉన్న శ్యామల ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతుంది. గుడికి వెళ్తున్నామని చంద్ర చెప్తుంది. వాళ్లను వెళ్లనివ్వండి ఇంట్లో పనులు నేను చేస్తానని శాలిని అంటుంది. శ్యామల ఓకే అనడంతో ముగ్గురు కలిసి గెస్ట్ హౌస్ కు వెళ్తారు. బ్యాగ్ తీసుకుని ముందు శ్వేత వెళ్తుంది.

శ్వేత లోపలికి వెళ్లగానే ప్రమోద్ డోర్ వేస్తాడు. అప్పుడు విరాట్, చంద్ర వెనకాల డోర్ నుంచి లోపలికి వెళ్తారు. ఈ రోజు ఏకంగా రూ.5 లక్షలు ఎలా ఇస్తున్నావని అడిగిన ప్రమోద్.. చంద్ర, విరాట్ ను చూస్తాడు. శ్వేతను లోపలికి తీసుకెళ్తాడు. విరాట్, చంద్రను ఒక రూమ్ లో వేసి లాక్ వేస్తాడు.

గదిలో బంధించిన ప్రమోద్: తదుపరి ఏం జరుగుతుంది?

నన్ను ట్రాప్ చేయాలని చూస్తారా? నేనేంటో చూపిస్తానని ప్రమోద్ వార్నింగ్ ఇస్తాడు. మనకు ఇప్పుడు ఎవరు హెల్ప్ చేస్తారని చంద్రతో విరాట్ అంటాడు. నేనిప్పుడు వాళ్లిద్దరినీ చంపేసి డబ్బు కోసం నువ్వే చేశావని నీ మీద వేస్తానని ప్రమోద్ అంటాడు. క్రాంతికి ఫోన్ చేసేందుకు విరాట్ ట్రై చేస్తాడు. కానీ సిగ్నల్ లేకుండా చేస్తాడు ప్రమోద్.

పతి, పత్నీ ఔర్ ఓ లడ్కీ ఇంకా ఇంటికి రాలేదని శ్యామలతో కామాక్షి చెప్పడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

ప్రమోద్ ట్రాప్‌లో చిక్కుకున్న విరాట్, చంద్రకళ, శ్వేత తదుపరి ఏం చేస్తారు? ప్రమోద్ వారిని ఏం చేయాలని ప్లాన్ చేస్తున్నాడు? ఈ ఉత్కంఠ భరిత సన్నివేశాలు సీరియల్‌కు మరింత ఆసక్తిని పెంచాయి. వచ్చే ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.