|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నిన్ను కోరి అక్టోబర్ 4 ఎపిసోడ్: ప్రమోద్‌ను కొట్టి శ్వేతను కాపాడిన విరాట్- చంద్రకళ తలకు గాయం- ఫిట్టింగ్ పెట్టిన లవర్

Published: 04-10-2025, 9:26 AM
నిన్ను కోరి అక్టోబర్ 4 ఎపిసోడ్: ప్రమోద్‌ను కొట్టి శ్వేతను కాపాడిన విరాట్- చంద్రకళ తలకు గాయం- ఫిట్టింగ్ పెట్టిన లవర్

నిన్ను కోరి సీరియల్ అక్టోబర్ 4 ఎపిసోడ్‌లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రమోద్ నుండి శ్వేతను కాపాడే ప్రయత్నంలో విరాట్ సాహసం చేశాడు. ఈ సంఘర్షణలో చంద్రకళకు గాయాలయ్యాయి. అసలేం జరిగిందో, పోలీసుల జోక్యం ఎలా సాగిందో తెలుసుకుందాం.

Key Points

1

ప్రమోద్ బారి నుండి శ్వేతను విరాట్ కాపాడాడు.

2

ప్రమోద్ విసిరిన వాజ్‌తో చంద్రకళ తలకు గాయమైంది.

4

శ్వేత ఫోటోలను డిలీట్ చేసి, చంద్రకళ ప్లాన్ బయటపెట్టింది.

ప్రమోద్‌కు విరాట్ ధీటుగా సమాధానం

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో విరాట్, చంద్ర, శ్వేత ఇంకా ఇంటికి రాకపోవడంపై శ్యామలతో శ్రుతి, కామాక్షి డిస్కషన్ పెడతారు. క్రాంతి కాల్ చేస్తే కలవదు. వాళ్లు గుడికే వెళ్లలేదు. గుడికి అని చెప్పి ఇంకా ఎక్కడికో వెళ్లారు. ఇదంతా చంద్రకళ ప్లాన్ అనిపిస్తుంది. వాళ్లను కలవొద్దు అన్నావుగా. కావాలనే శ్వేతను చంద్రకళ పిలిచి ఉంటుంది అని కామాక్షి అంటుంది.

మరోవైపు శ్వేతను ప్రమోద్ ఏం చేస్తున్నాడో అని విరాట్‌తో చెబుతూ భయపడుతుంది చంద్రకళ. మరోవైపు నువ్వు ఐదు లక్షలు ఇస్తానన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. నీకు డబ్బు దక్కదు, ఫొటోలు దక్కవు అని బ్యాగ్ తీసి చూస్తాడు ప్రమోద్. కానీ, అందులో డబ్బుకు బదులు బట్టలు ఉంటాయి. అది చూసి ప్రమోద్ షాక్ అవుతాడు. దాంతో శ్వేత గొంతు పట్టుకుంటాడు.

నీ హెయిర్ పిన్ ఇవ్వు అని చంద్రను విరాట్ అడుగుతాడు. మరోవైపు ల్యాప్‌టాప్‌లో ఫొటోలు వైరల్ చేయమంటావా అని శ్వేతను బెదిరిస్తాడు ప్రమోద్. నీకు ఎలాగైనా డబ్బు అరెంజ్ చేస్తాను అని శ్వేత అంటే.. కోటి రూపాయలు. నువ్వు చేసిన ఓవరాక్షన్‌కు కోటి రూపాయలు ఇవ్వాల్సిందే. లేకుంటే ఎంటర్ బటన్ నొక్కన్న అని ప్రమోద్ అంటాడు. ఇంతలో విరాట్ వచ్చి ప్రమోద్ తలపై కర్రతో కొడతాడు.

ప్రమోద్‌ను విరాట్ పిచ్చికొట్టుడు కొడతాడు. చంద్రకళ ల్యాప్‌టాప్ లాగేసుకుంటుంది. వాడికి బుద్ధి వచ్చేవరకు కొట్టు అని చంద్రకళ అంటుంది. ప్రమోద్‌ను నెట్టేస్తాడు. అక్కడున్న ఫ్లవర్ వాజ్‌ను విరాట్‌పైకి ప్రమోద్ విసురుతాడు. విరాట్ తప్పించుకుంటాడు. కానీ, అది చంద్రకళకు తగులుతుంది. దాంతో చంద్రకళ తలకు రక్తం కారుతుంది.

చంద్రకళకు గాయం, పోలీసుల ఎంట్రీ

అది చూసి ప్రమోద్‌ను మరింత ఎక్కువగా కొడతాడు. చంపేస్తాను అని మెడ పట్టుకుంటాడు విరాట్. ఇంతలో పోలీసులు వస్తారు. పోలీసులకు నేనే ఇన్ఫార్మ్ చేశాను. వీడికి ఏ శిక్ష పడుతుందో వేయించండి అని చంద్రకళ అంటుంది. మీ ముగ్గురిని అస్సలు వదిలిపెట్టను అని ప్రమోద్ అంటాడు. నువ్వు బయటకు వస్తేకదరా అని పోలీసులు ప్రమోద్ ను తీసుకెళ్తారు.

శ్వేతను విరాట్ కాపాడుతాడు. ల్యాప్‌టాప్‌లో శ్వేత ఫొటోలు డిలీట్ చేస్తుంది. తర్వాత విరాట్ వాళ్లు ఇంటికి వస్తారు. చంద్రకళకు తగిన దెబ్బ చూసి ఏమైందని అడుగుతారు. తర్వాత చెబుతామని, చంద్రకళకు ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు విరాట్. మీరు అసలు గుడికే వెళ్లారా అని శ్యామల అంటే.. లేదని శ్వేత చెబుతుంది. ఏం ప్లాన్ చేశావ్ చంద్ర అని శ్రుతి అంటే.. అవును చంద్రగారే ప్లాన్ చేశారు అని శ్వేత అంటుంది.

నా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్లాన్ చేసింది అని జరిగింది అంతా చెబుతుంది శ్వేత. బావ హెల్ప్ చేశాడు కాబట్టి శ్వేతను కాపాడగలం. బావ హీరోలా అందరిని కాపాడాడు అని చంద్రకళ చెబుతుంది. అందరు అలసిపోయారు. రెస్ట్ తీసుకోండి అని జగదీశ్వరి చెబుతుంది. దాంతో వెళ్లిపోతారు. తన ప్లాన్ మళ్లీ ఫెయిల్ అయిందని శాలిని ఫ్రస్టేట్ అవుతుంది.

కామాక్షి వచ్చి మాట్లాడితే బుర్ర ముందు వాడాలి అని తిడుతుంది శాలిని. ముందు నువ్వు క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలియకుండా చెబితే మేము ఎలా చేస్తాం. ఇక శ్వేతతో విడగొట్టాలన్న ప్లాన్ వర్కౌట్ అవ్వదు. వేరేది ఆలోచించు అని కామాక్షి అంటుంది. మరోవైపు ఒళ్లు నొప్పులతో విరాట్ బాధపడుతాడు. చంద్రకళ వస్తే సిగ్గుపడిపోతాడు విరాట్.

శ్వేతను కాపాడిన విరాట్ – చంద్ర ప్లాన్

నిన్ను ఒక పట్టు పట్టేస్తాను అని పెయిన్ రిలీఫ్ బామ్ రాస్తానంటుంది చంద్రకళ. విరాట్ వద్దన్న రాస్తుంది చంద్రకళ. అదంతా రొమాంటిక్‌గా ఉంటుంది. అప్పుడే వచ్చిన శ్వేత అదంతా చూస్తుంది. నాకు దెబ్బ తగలగానే వాన్ని రెచ్చిపోయి కొట్టావ్. నీ గర్ల్‌ఫ్రెండ్ ముందు బిల్డప్ ఇవ్వడానికేగా అని చంద్ర అంటే.. అలా అనకు కంపరంగా ఉందని విరాట్ అంటాడు.

శ్వేత ప్లేసులో నేనుంటే ఏం చేసేవాడివి అని చంద్రకళ అడిగితే.. మంచి ఏదో చెడు ఏదో తెలుసుకోలేనంత ఫూల్‌వి కాదు నువ్వు అని విరాట్ అంటాడు. ఇంప్రెస్ చేశావ్ బావ అని చంద్ర అంటుంది. ఇంతలో శ్వేతను చూసి లోపలికి రమ్మంటుంది చంద్రకళ. విరాట్, చంద్రను మెచ్చుకుని, మీ సమస్య త్వరగా తీరిపోవాలని కోరుకుంటున్నా అని శ్వేత అంటుంది.

చంద్ర ఆ బామ్‌కి బదులు వేడి నీళ్లతో కాపుడం పెట్టు త్వరగా తగ్గిపోతుందని ఫిటింగ్ పెట్టేసి వెళ్లిపోతుంది శ్వేత. కాపుడం అంటుందేంటీ. ఇదివరకు పెట్టిందా అని చంద్ర అడుగుతుంది. పోవే అని విరాట్ అనేసరికి సిగ్గుతో చంద్రకళ వెళ్లిపోతుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

మొత్తంగా, నిన్ను కోరి అక్టోబర్ 4 ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగింది. విరాట్ ధైర్యం, చంద్రకళ ప్లాన్, పోలీసుల ఎంట్రీతో కథ కొత్త మలుపు తిరిగింది. శ్వేత సమస్యకు తాత్కాలికంగా తెరపడిన ఈ ఎపిసోడ్ తదుపరి ఏం జరుగుతుందో అనే ఆసక్తిని పెంచింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.