
📌 Key Points
- లేడి డాక్టర్‌ను బెదిరించి నిజం చెప్పించారు విరాట్, చంద్రకళ.
- శాలిని ప్రెగ్నెన్సీ, అబార్షన్ అంతా అబద్ధం అని డాక్టర్ వెల్లడించింది.
- క్రాంతి ముందు నిజం చెప్పాలని డాక్టర్‌ను ఒప్పించారు విరాట్, చంద్రకళ.
- శాలిని మోసం బయటపడటంతో క్రాంతికి పెద్ద షాక్ తగలడం ఖాయం.
నిన్ను కోరి సీరియల్ లేటెస్ట్ ప్రోమో ఉత్కంఠగా మారింది. శాలిని ప్రెగ్నెన్సీ నాటకం గురించి క్రాంతికి నిజం చెప్పించేందుకు లేడి డాక్టర్‌ను ఒప్పించారు విరాట్, చంద్రకళ. శాలిని అసలు గర్భం దాల్చలేదని డాక్టర్ స్పష్టం చేసింది. ఈ నిజం బయటపడటంతో క్రాంతి ఏం చేస్తాడో చూడాలి.
విరాట్, చంద్రకళల ప్లాన్
నిన్ను కోరి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో డాక్టర్ కోట్ వేసుకున్న రఘురాం పేషంట్‌కు ట్రీట్‌మెంట్ చేస్తాడు. లేడి డాక్టర్‌ను బెదిరించి క్రాంతితో నిజం చెప్పించేందుకు ఒప్పిస్తారు చంద్రకళ, విరాట్. క్రాంతి వచ్చి శాలినికి ఏమైందని అడిగితే.. తను ప్రెగ్నెన్సీ, అబార్షన్ అంతా అబద్ధమని నిజం చెబుతుంది డాక్టర్.
నిన్ను కోరి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో రఘురాంను హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. అక్కడ సౌండ్‌తో డైవర్ట్ అయిన రఘురాం డాక్టర్ రూమ్‌లోకి వెళ్తాడు. కోట్ వేసుకుని డాక్టర్ చైర్‌లో కూర్చుంటాడు. ఇంతలో ఒక పేషంట్ కడుపు నొప్పి డాక్టర్ అంటూ వస్తాడు. అది విని నేను ఇక్కడ డాక్టర్‌నా. నాకు ఈ విషయం తెలియదే అనుకుంటాడు రఘురాం.
మీరే సమస్య, వల్లే పెద్ద సమస్య ఏర్పడింది, మీరే సరిచేయాలని చంద్రకళ అంటుంది. దాంతో డాక్టర్ కోప్పడుతుంది. ఏంటీ మీరు మాట్లాడేది. నేను సమస్య ఏంటీ. అసలు ఎవరు మీరు అని అరుస్తుంది డాక్టర్. అరవకండి డాక్టర్. అన్ని నిజాలు బయటపెడతాం అని చంద్రకళ అంటుంది.
లేడి డాక్టర్ నిజం బయటపెట్టడం
మీరు నా తోడి కోడలు కలిసి ప్రెగ్నెన్సీ, అబార్షన్ నాటకం ఆడారు కదా. శాలినికి అసలు ప్రెగ్నెన్సీనే కన్ఫర్మ్ కాలేదు. అలాంటి మీరు ప్రెగ్నెంట్ అయినట్లు, అబార్షన్ అయినట్లు నాటకం ఆడారు. అదంతా అబద్ధం అని మావాళ్లతో చెప్పాలి అని చంద్రకళ, విరాట్ అంటారు.
దాంతో భయపడిపోయిన లేడి డాక్టర్ నిజం ఒప్పుకుంటాను.. ఒప్పుకుంటాను అని చెబుతుంది. మీరు చెప్పేదే నిజం అని అంటుంది ఆ లేడి డాక్టర్. దాంతో ఆ విషయం మా ముందు కాదు క్రాంతి ముందు చెప్పాలి అని విరాట్ అంటాడు. దానికి సరే అని లేడి డాక్టర్ అంటుంది. ఇక క్రాంతిని తీసుకురావాలని విరాట్, చంద్రకళ అంటారు.
అతను ఇప్పుడు ఎలా వస్తాడని డాక్టర్ అంటే.. అది కూడా మీరే చేయాలి అని విరాట్ అంటాడు. అర్థం కాలేదని లేడి డాక్టర్ అంటే.. అది నేను చెబుతానుగా అని చంద్రకళ అంటుంది. క్రాంతికి కాల్ చేసి శాలినికి సమస్య ఉందని, మీరు త్వరగా రావాలని, మీతో మాట్లాడాలని చెప్పండి. దాంతో క్రాంతి కచ్చితంగా వస్తాడు అని చంద్రకళ అంటుంది.
క్రాంతికి షాక్
అప్పుడే లోపలకి, విరాట్ చంద్ర రావడంతో విసుక్కుంటాడు క్రాంతి. మిమ్మల్ని కాదురా విసుక్కోవడం, నిజం తెలిస్తే ఎవరిని ఏం అనాలో నీకే తెలుస్తుంది అని విరాట్ అంటాడు. నాకు నీతో వాదించే టైమ్ లేదు. డాక్టర్ మీరు చెప్పండి. ఎందుకు రమ్మన్నారు అని క్రాంతి అంటాడు.
చెప్పండి డాక్టర్. మా ముందు చెప్పిన నిజాన్ని క్రాంతికి కూడా చెప్పండి అని చంద్రకళ అంటుంది. ఏంటా నిజం డాక్టర్. ఏమైందో చెప్పండి అని క్రాంతి డాక్టర్‌ను నిలదీస్తాడు. శాలిని నెలతప్పడం, అబార్షన్ జరగడం అంతా అబద్ధం అని భయపడుతూ లేడి డాక్టర్ చెబుతుంది.
నిన్ను కోరి సీరియల్ లో శాలిని మోసం బయటపడటంతో కథ మరింత ఆసక్తికరంగా మారనుంది. క్రాంతికి నిజం తెలిసిన తర్వాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వేచి చూడాలి. రాబోయే ఎపిసోడ్‌లు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయం.


