
కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‌లో ఊహించని మలుపులు చోటుచేసుకున్నాయి. సుమిత్ర కనిపించకపోవడంతో దీప తీవ్ర కంగారు పడుతుంది. తన అబద్ధం బయటపడకుండా కాశీ, శ్రీధర్ కాళ్లు పట్టుకుంటాడు. జ్యోత్స్న పోలీసులను తీసుకొచ్చి సుమిత్ర ఆచూకీ కోసం గాలిస్తుంది. సుమిత్ర మాత్రం గుడికి వెళ్తుంది.
Key Points
సుమిత్ర కనిపించకపోవడంతో దీప తీవ్ర ఆందోళన చెందుతుంది.
కాశీ తన అబద్ధం బయటపడకుండా శ్రీధర్ కాళ్లు పట్టుకుంటాడు.
జ్యోత్స్న మమ్మీ ఆచూకీ కోసం పోలీసులను తీసుకొచ్చి గాలిస్తుంది.
సుమిత్ర గుడి వద్ద దశరథను చూస్తుంది, అక్కడ ఎపిసోడ్ ముగుస్తుంది.
పోలీసులతో వచ్చిన జ్యోత్స్న
కార్తీక దీపం 2 సీరియల్ టుడే అక్టోబర్ 28 ఎపిసోడ్ లో మమ్మీని తీసుకొస్తానని జ్యోత్స్న వెళ్తుంది. స్వప్నకు నిజం చెప్పొద్దని శ్రీధర్ కాళ్లు పట్టుకుంటాడు కాశీ. దశరథను గుడికి తీసుకెళ్తాడు కార్తీక్. సుమిత్ర కనిపించకపోవడంతో దీప కంగారు పడుతుంది. అదే సమయంలో పోలీసులను తీసుకొస్తుంది జ్యో.
కార్తీక దీపం 2 టుడే అక్టోబర్ 28 ఎపిసోడ్ లో గ్రానీ, మనకు లైఫ్ లో రెండే దారులుంటాయి. ఒకటి గెలవడం, మరొకటి ఓడిపోవడం. ఓడిపోవాలంటే నీలా చూస్తూ ఉంటే సరిపోతుందని జ్యోత్స్న అంటుంది. మరి నువ్వేం చేశావ్? ఆస్తి మీద కార్తీక్ మీద తప్ప నీకు ఎవరి మీద ప్రేమ లేదు. నువ్వు ఎప్పుడైతే ఫామ్ లోకి వచ్చావో అప్పుడే అటు ఇటు కాకుండా అయిపోయానని పారు అంటుంది. మమ్మీ ఎక్కడుందో బావకు తెలుసని నా డౌట్ అని జ్యో అంటుంది.
సుమిత్ర కనిపించకపోవడంతో దీప కంగారు
కార్తీక్, శివన్నారాయణ సైగ చేసుకోవడం పారు చూస్తుంది. అదే విషయాన్ని అడుగుతుంది. మరి సుమిత్ర వెళ్లిపోతుంటే కనిపించలేదు కానీ సైగ కనిపించిందా? అంటే సుమిత్ర కూడా కనిపించే ఉంటుంది. అయితే అబద్ధం చెప్పావా? అని శివన్నారాయణ గద్దించి అడుగుతాడు. మమ్మీని తీసుకొస్తానని జ్యోత్స్న బయటకు వెళ్తుంది.
జాబ్ లేకపోవడం భరించలేకపోయా. ఒకరేమో రెస్టారెంట్లో పని చేయమని, ఇంకొకరు బిజినెస్ చేయమని సలహాలిస్తున్నారు. అందుకే జాబ్ వచ్చిందని అబద్ధం చెప్పి బయటకు వెళ్లి ఏదో ఒకటి ట్రై చేద్దామనిపించిందని కాశీ అంటాడు. మోసం చేసేవాళ్లు, అబద్దం చెప్పేవాళ్లంటే స్వప్నకు పరమ చిరాకు. అందుకే స్వప్నకు నిజం చెప్పేస్తానని శ్రీధర్ అంటాడు. నిజం చెప్పకండని మామయ్య కాళ్లు పట్టుకుంటాడు కాశీ. అది స్వప్న చూస్తుంది.
కాశీ అబద్ధం: శ్రీధర్ కాళ్లు పట్టుకోవడం
ఎస్ఐ మీరు అరెస్ట్ చేయడానికి రెడీగా ఉండండి. నేను లోపలికి వెళ్లి మమ్మీని తీసుకొస్తానని జ్యోత్స్న వెళ్తుంది. మమ్మీ అని పిలుస్తూ వెతుకుతుంది. కానీ సుమిత్ర కనిపించదు. దీప మా మమ్మీ ఎక్కడ? ఎక్కడ దాచారు? అని జ్యో ప్రశ్నిస్తుంది. చెప్పు దీప, మా మమ్మీని ఏం చేశావని అడుగుతుంది. మరోవైపు సుమిత్ర కూడా గుడికి వెళ్తుంది. అక్కడ దశరథను చూస్తుంది. దీంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సుమిత్ర గుడికి చేరడంతో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ఉత్కంఠగా ముగుస్తుంది. దీప ఆందోళన, జ్యోత్స్న పట్టుదల, కాశీ అబద్ధాల మధ్య కథ తదుపరి ఎపిసోడ్‌పై ఆసక్తిని పెంచుతోంది. సుమిత్ర ఆచూకీ కోసం వేచి చూడాలి.


