|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నిన్ను కోరి ప్రోమో: చంద్రకళ జీవితంపై దెబ్బకొట్టిన శాలిని- పచ్చళ్ల బిజినెస్‌పై మచ్చ- అర్జున్ ఆఫీస్ ఎదుట ధర్నా

Published: 22-09-2025, 1:09 AM
నిన్ను కోరి ప్రోమో: చంద్రకళ జీవితంపై దెబ్బకొట్టిన శాలిని- పచ్చళ్ల బిజినెస్‌పై మచ్చ- అర్జున్ ఆఫీస్ ఎదుట ధర్నా

నిన్ను కోరి సీరియల్‌లో తాజా ప్రోమోలో చంద్రకళ జీవితంపై శాలిని యొక్క కుట్ర బయటపడుతుంది. పచ్చళ్ల బిజినెస్‌లో సంభవించిన నష్టం వల్ల అర్జున్ ఆఫీస్ ముందు ధర్నా జరుగుతుంది. చూడండి ఈ ఉత్కంఠభరితమైన ఎపిసోడ్‌ను!

Key Points

1

శాలిని చంద్రకళ పచ్చళ్ల బిజినెస్‌ను దెబ్బతీయడానికి ప్లాన్ చేస్తుంది.

2

అర్జున్‌కు చెందిన పచ్చళ్లు పాడైపోవడంతో రిటైలర్లు ఆఫీసు ముందు ధర్నా చేస్తున్నారు.

4

నిన్ను కోరి సీరియల్‌లో కథనం ఉత్కంఠభరితంగా సాగుతోంది.

శాలిని యొక్క కుట్ర

నిన్ను కోరి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో జగదీశ్వరి, చంద్రకళ వంటింట్లో ఉంటారు. అది చూసిన శాలిని డ్రామా స్టార్ట్ చేస్తుంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఇద్దరు పడిపోవాలి అని అనుకుంటుంది. ఇంతలో క్రాంతి వస్తే పిలిచి రొమాంటిక్‌గా బిహేవ్ చేస్తుంది శాలిని.

శాలిని రెడ్ రోజ్ తీస్తే ఇప్పుడు ప్రపోజ్ చేయాల ఏంటీ అని క్రాంతి అంటాడు. అబ్బా ఆశ.. లేదు నా తలలో పెట్టు అని శాలిని రొమాంటిక్ పదాలతో చాలా ప్రేమ ఉన్నట్లు డ్రామా చేస్తుంది. అదంతా చూసిన చంద్రకళ సంతోషంగా మురిసిపోతుంది. కానీ, జగదీశ్వరి మాత్రం చిరాకు పడుతుంది.

తర్వాత చంద్రకళకు అర్జున్ కాల్ చేస్తాడు. లాస్ట్ వీక్ పంపించిన పచ్చళ్లన్ని పాడైపోయాయి చంద్రగారు. స్టాక్ మొత్తం వెనక్కి వచ్చేసింది అని అర్జున్ అంటాడు. దాంతో చంద్రకళ ఉలిక్కిపడుతుంది. ఏం చేబుతున్నారు అర్జున్ గారు అని అడుగుతుంది చంద్రకళ. నేను చెప్పేది నిజమండి. పచ్చళ్లన్ని పాడైపోయాయి. అసలు ఎక్కడ సమస్య వచ్చిందో, ఏం తప్పు జరిగిందో తెలియట్లేదని అంటాడు అర్జున్.

పచ్చళ్ల బిజినెస్‌లో సంక్షోభం

ఇప్పుడు పరిస్థితి ఏంటండి అని చంద్రకళ అడుగుతుంది. రీటేయిలర్స్ అందరూ ప్రశ్నించడానికి ఆఫీస్‌కు వస్తున్నారు. మీరు వెంటనే రాగలరా. వారికి సమాధానం చెప్పడానికి ఉంటుంది అని అర్జున్ అడుగుతాడు. దానికి ఇప్పుడే బయలుదేరుతున్నాను అని కంగారుగా వెళ్తుంది చంద్రకళ. మరోవైపు శాలినికి అర్జున్ దగ్గర పనిచేసే వ్యక్తి కాల్ చేస్తాడు.

మీరు ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది అని అతను శాలినితో అంటాడు. అంటే, నా ప్లాన్ వర్కౌట్ అయిందా అని శాలిని అడుగుతుంది. పికిల్స్ అన్ని పాడైపోయాయి. స్టాక్ మొత్తం వెనక్కి వచ్చేసింది అని అతను చెబుతాడు. ఈ సమస్యను అంత సింపుల్‌గా వదిలేయకూడదు. కాస్తా సెన్సేషన్ అయ్యేలా చేయాలి అని మరో ప్లాన్ చెబుతుంది శాలిని.

చంద్ర నా జీవితాన్ని ఉద్ధరించాలని చూస్తున్నావుగా. నేను జీవితం మీదే దెబ్బ కొట్టబోతున్నాను అని శాలిని అనుకుంటుంది. చంద్రకళ పచ్చళ్ల బిజినెస్‌పై మచ్చ పడేలా చేసి చంద్రకళను దెబ్బ తీస్తుంది శాలిని. మరోవైపు అర్జున్ ఆఫీస్ ముందు రీటేయిలర్స్ అంతా వచ్చి ధర్నా చేస్తారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తారు.

అర్జున్ ఆఫీస్ ఎదుట ధర్నా

అర్జున్‌ను నానా మాటలు అంటారు. అది తయారు చేసిన చంద్రకళను అవమానిస్తారు. ఇలాంటి పచ్చళ్లు చేయడం కంటే సైలెంట్‌గా ఉండొచ్చుగా అని మాటలంటారు. చంద్రకళ, అర్జున్ ఎంత చెప్పిన వినరు. ధర్నా చేస్తున్న వాళ్లలో అర్జున్ దగ్గర పనిచేసే వ్యక్తి ఓ రౌడీని పెడతాడు. ఆ రౌడీకి అతను కనుసైగ చేస్తాడు.

దాంతో ఆ రౌడీ రాయి తీసుకుని చంద్రకళను కొడతాడు. కానీ, అర్జున్ అడ్డం వస్తాడు. దాంతో అర్జున్‌ తలకు రాయి తగిలి రక్తం కారిపోతుంది. అది చూసి చంద్రకళ షాక్ అవుతుంది. అలా శాలిని చెప్పిన ప్లాన్ ప్రకారం అర్జున్ దగ్గర పని చేసే వ్యక్తి చేస్తాడు. అక్కడితో నిన్ను కోరి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.

శాలిని యొక్క కుట్ర ఫలించిందా? చంద్రకళ తన బిజినెస్ నుంచి బయటపడగలరా? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం నిన్ను కోరి సీరియల్‌ను వీక్షించండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.