
నిన్ను కోరి సీరియల్ సెప్టెంబర్ 18వ తేదీ ఎపిసోడ్ చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. చంద్ర యొక్క పుట్టినరోజు వేడుకలు, విరాట్ యొక్క బాధ, మరియు శాలిని యొక్క కుట్రలు ఈ ఎపిసోడ్‌ను ఆసక్తికరంగా మారుస్తాయి.
Key Points
చంద్రకు అర్జున్ సర్‌ప్రైజ్ బర్త్‌డే పార్టీ!
విరాట్ చంద్ర బర్త్‌డేను విస్మరించడంతో బాధపడుతున్నాడు.
శాలిని చంద్రకళను ఇరికించేందుకు కుట్ర పన్నుతుంది.
శ్యామల చివరకు చంద్ర బర్త్‌డే వేడుకలకు ఒప్పుకుంటుంది.
అర్జున్ యొక్క సర్‌ప్రైజ్
నిన్ను కోరి సీరియల్ టుడే సెప్టెంబర్ 18వ తేదీ ఎపిసోడ్ లో నీ ఆలోచన ఏదైనా సరే చంద్రకు పుట్టిన రోజు వేడుకలు ఈ ఇంట్లో జరగడం లేదని శ్యామల అంటుంది. గిఫ్ట్ ఇవ్వడం కాదు, అసలు విషెస్ చెప్పినా నేను చచ్చినంత ఓట్టే అని శ్యామల అనడంతో బాధ పడుతూ విరాట్ వెళ్లిపోతాడు. మరోవైపు బావ విష్ చేయకుండా డిసప్పాయింట్ చేశాడని బాధ పడుతూ చంద్ర ఆఫీస్ లోపలికి వెళ్తుంది.
ఆఫీస్ మొత్తం డెకరేట్ చేసి ఉంటుంది. హ్యాపీ బర్త్ డే అంటూ అర్జున్ , స్టాఫ్ అందరూ సర్ ప్రైజ్ చేస్తారు. అగ్రిమెంట్ అప్పుడు ఆధార్ కార్డు, పాన్ కార్డు షేర్ చేశారు కదా అందులో బర్త్ డే డేట్ చూశానని అర్జున్ అంటాడు. చంద్రకళ కేక్ కట్ చేస్తుంది. ఈ ఫొటోలు శాలిని మనిషి తీసి శాలినికి పంపించాలని అనుకుంటాడు. సంతోషంలోనైనా, బాధలోనైనా తోడుగా ఉండేది కుటుంబం మాత్రమే అని చంద్ర చెప్తుంది.
విరాట్ యొక్క బాధ
ఆ ఫొటోలు శాలిని కి పంపిస్తాడు. ఈ ఫొటోలు వన్ అవర్ లో సోషల్ మీడియాలో వైరల్ కావాలని శాలిని చెప్తుంది. వైరల్ గా మారిన నీ బర్త్ డే వేడుకలను వైరస్ గా మార్చి ఫ్యామిలీ మెంబర్స్ కు ఎక్కిస్తానని శాలిని అనుకుంటుంది. ఫోన్ లో చంద్ర ఫొటో చూస్తూ పొద్దున్నే విష్ చేయాల్సిందని విరాట్ బాధపడతాడు. అత్త మాట కాదని ఫోన్ చేయలేకపోతున్నా ఐయామ్ సారీ చంద్ర, తప్పు చేశాను చంద్ర అని విరాట్ అనుకుంటాడు.
చంద్ర, అర్జున్ ఫొటోలు, వీడియోలను కామాక్షి, శ్రుతికి చూపిస్తుంది శాలిని. ఈ వీడియోస్, ఫొటోస్ మనకు ఎంత యూజ్ అవుతాయో తెలుసా? శ్యామల పిన్నిని చంద్ర బర్త్ డే చేసేందుకు ఒప్పించాలి. అప్పుడు విరాట్ బావ హ్యాపీగా ఫీల్ అవుతాడు. సర్ ప్రైజ్ చేసేందుకు ప్లాన్ చేస్తాడు. అప్పుడు ఈ వీడియో చూపిస్తే భర్తతో కాకుండా వేరే వ్యక్తితో సెలబ్రేట్ చేసుకుందని శ్యామల ఫైర్ అవుతుంది. విరాట్ కూడా ఫీల్ అవుతాడని శాలిని చెప్తుంది.
శాలిని యొక్క కుట్ర
చంద్రకళ బర్త్ డే సెలబ్రేట్ చేసేలా మాటలతో మాయ చేస్తుంది శాలిని. చివరకు శ్యామల ఒప్పుకొంటుంది. చంద్రను ఇంటికి పంపించాలని అర్జున్ అనుకుంటాడు. మీ ఆయన రాత్రి విష్ చేసి ఉంటారు కదా అని అర్జున్ అడిగితే, అవును అని అబద్దం చెప్తుంది చంద్ర. చంద్రను ఇంటికి పంపిస్తాడు అర్జున్. నువ్వు బాధగా ఉంటే చూడలేను. ఎలా సెలబ్రేట్ చేయాలనుకున్నావో అలాగే చేసుకో అని విరాట్ కు శ్యామల చెప్పడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
చివరికి, శ్యామల చంద్ర బర్త్‌డే వేడుకలకు ఒప్పుకోవడంతో ఎపిసోడ్ ముగుస్తుంది. విరాట్ మరియు చంద్ర మధ్య ఉన్న గొడవ తగ్గుతుందా? రానున్న ఎపిసోడ్స్ లో తెలుస్తుంది.


