
నిన్ను కోరి సీరియల్ సెప్టెంబర్ 6వ తేదీ ఎపిసోడ్‌లో వినాయక చవితి పూజ, కుటుంబ సభ్యుల మధ్య జరిగిన సంఘటనలు, కామాక్షి తీసుకున్న ప్రతీకారం, రఘురాం కోలుకునే ప్రయత్నం వంటివి ప్రధాన ఆకర్షణలు.
Key Points
వినాయక చవితి పూజలో ఆసక్తికర సంఘటనలు
శ్యామలపై కామాక్షి ప్రతీకారం
చంద్రకళ, విరాట్ ప్రేమాయణం
వినాయక చవితి పూజ
నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో వినాయక పూజలో అందరూ ఏదో ఒక వస్తువు పెడతారు. శ్రుతి మాత్రం ఖాళీ పేపర్ పెడుతుంది. దాంతో అంతా నవ్వుతారు. రఘురాంకు రాసే ఆయిల్‌ను జగదీశ్వరి తెచ్చి పెట్టి భర్త ఆరోగ్యమే ముఖ్యం కదా అంటుంది. మీ కోరిక నెరవేరుతుందని, చంద్రకళ హస్తవాసి మంచిదని, దేవుడు కష్టాలు ఇస్తాడు. అవి తట్టుకున్నవారిని కరుణిస్తాడు అని అర్జున్ చెబుతాడు.
దాంతో జగదీశ్వరి సంతోషంగా ఫీల్ అవుతుంది. పంతులు పూజ చేస్తాడు. కోరికలు కోరుకోమంటాడు. ఎవరికి కావాల్సింది వారు కోరుకుంటారు. పంతులు వెళ్లిపోతాడు. బొట్టు తీసుకొచ్చి రఘురాంకు పెడుతుంది చంద్రకళ. కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటుంది. పిలవగానే వచ్చావ్. కొంచెంకూడా మొహమాటం లేదా అని అర్జున్‌ను శ్యామల అడుగుతుంది.
కొంచెం కాదు అస్సలు లేదు. అసలు చంద్రకళ నన్ను పిలవలేదు. నేనే అడిగి మరి వచ్చాను అని అర్జున్ అంటాడు. ఇంతకీ నీకు ఎవరైనా ఉన్నారా అని శ్యామల అడిగితే.. నలుగురు పెద్దవాళ్లు, ముగ్గురు మామలు, ఇద్దరు పిన్నిలు, నలుగురు అమ్మమ్మలు, ముగ్గురు తాతలు, 56 మంది అన్నయ్యలు, 27 మంది తమ్ముళ్లు అని చెబుతాడు అర్జున్. అంతమంది ఉంటే ఇల్లు అనరు ఆశ్రమం అంటారని శ్యామల అంటుంది.
కామాక్షి ప్రతీకారం
అవును, ఆశ్రమమే అని అర్జున్ అంటే.. హో అనాథవా అని కామాక్షి అంటుంది. అవును, నన్ను ఎవరు కన్నారో తెలియదు కానీ, నన్ను పెంచింది ఆ ఆశ్రమమే. అదే నా ప్రపంచం అని ఎమోషనల్‌గా చెబుతాడు అర్జున్. నువ్వెప్పుడు అనాథవి అనుకోకు. ఈ ఇల్లు కూడా నీ ఇల్లే అనుకో. నీ వాళ్లమే అనుకో అని జగదీశ్వరి చెబుతుంది. అనాథ అయినా చాలా గొప్పగా ఎదిగారు అని విరాట్ చెబుతాడు.
తర్వాత చంద్రకళ గురించి చాలా గొప్పగా చెబుతాడు అర్జున్. అంతా భోజనానికి కూర్చొంటారు. తర్వాత చంద్రకళ ఉపవాసం ఉన్నానంటుంది. విరాట్ అందరికి వడ్డిస్తానంటాడు. దాంతో చంద్రకళ, విరాట్ జంటను పొగుడుతాడు అర్జున్. దానికి చంద్రకళ, విరాట్ రొమాంటిక్‌గా చూసుకుంటారు. మమ్మల్ని ఇలా కూర్చోబెట్టి మీరిద్దరు లుక్స్‌తో రొమాన్స్ చేసుకుంటే ఎలా అని అర్జున్ అంటాడు.
దాంతో విరాట్ అందరికి వడ్డిస్తాడు. అంతా తింటుంటారు. శ్యామలకు గొంతులో ఏదో ఇరుక్కుంటుంది. మెడమీద కొడితే సరిపోతుందని అర్జున్ చెబుతాడు. దాంతో ఇదే మంచి టైమ్ అనుకున్న కామాక్షి శ్యామలను కొట్టి రివేంజ్ తీర్చుకుంటుంది. దాంతో శ్యామల బతికిపోతుంది. కొడితే కొట్టావ్ కానీ, ప్రాణాలు కాపాడావ్ అని శ్యామల అంటుంది.
రఘురాం కోలుకునే ప్రయత్నం
పులిహార తిన్నాను. చింతగింజ వెళ్లినట్లుంది. వంట చేయడం ఇదేనా. నీ వల్ల నా ప్రాణాలు పోయేవి అని చంద్రకళ ను తిడుతుంది శ్యామల. కానీ, అర్జున్ దాన్ని కవర్ చేస్తాడు. తర్వాత రఘురాం లేచి కూర్చుంటాడు. అది చూసిన చంద్రకళ ఇంట్లోవాళ్లను చెప్పడానికి వెళ్తుంది. ఇంతలో రఘురాంను శాలిని చూస్తుంది.
శాలినిని చూసిన రఘురాం నువ్వా.. నీ గురించి అందరికి చెబుతాను అని లేచి నడుస్తాడు. కానీ, కర్ర తీసుకుని మామ రఘురాం తలపై కొడుతుంది శాలిని. దాంతో రఘురాం కింద పడి చనిపోయినట్లు చూపించారు. కింద నుంచి పైకి జగదీశ్వరి వాళ్లు అంతా వస్తుంటారు. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ఈ ఎపిసోడ్‌లో చోటుచేసుకున్న సంఘటనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కామాక్షి ప్రతీకారం, రఘురాం ఆరోగ్యం, శాలిని చేసిన హింసాత్మక చర్యలు అన్నీ ఉత్కంఠను పెంచాయి.


