
నిన్ను కోరి సీరియల్ సెప్టెంబర్ 8వ తేదీ ఎపిసోడ్ లో రఘురాం ఆరోగ్యం క్షీణించడంతో, శాలిని తన కుట్రలను కొనసాగిస్తుంది. చంద్రకళ పై అపవాదు పడుతుంది. ఈ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
Key Points
రఘురాం నిజం చెప్పబోతున్నాడని చంద్రకళ నమ్ముతుంది.
శాలిని రఘురాన్ని చంపడానికి ప్రయత్నిస్తుంది.
శాలిని తన నేరాన్ని దాచడానికి ప్రయత్నాలు చేస్తుంది.
రఘురాం యొక్క నిజాయితీ ప్రకటన
నిన్ను కోరి సీరియల్ టుడే సెప్టెంబర్ 8వ తేదీ ఎపిసోడ్ లో రఘురాం దగ్గరకు వచ్చి పూజ బాగా జరిగిందని చంద్రకళ చెప్తుంది. అత్తయ్య సపోర్ట్ చేసి పూజలో కూర్చునేలా చేసింది. మీరు త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నార అని మెడిసిన్ తాగిపిస్తుంది చంద్ర. మీరు త్వరగా లేచి నా తప్పు లేదని చెప్తే చాలు అని చంద్ర వెళ్లిపోతుండగా.. రఘురాం చేయి ఎత్తి పిలుస్తాడు. అమ్మా అని అంటాడు. చంద్ర అందరినీ పిలిచేందుకు వెళ్తుంది.
అప్పుడే రఘురాం కాళ్లను కదిలించడం శాలిని చూస్తుంది. మెట్ల పై నుంచి చంద్రకళ పడిపోతుంటే విరాట్ పట్టుకుంటాడు. శాలినిని ఇక్కడికి ఎందుకు వచ్చావ్? నువ్వు చేసినవన్నీ నాకు తెలుసు. నువ్వు చేసిన దానికి చంద్రకళ కు శిక్షకు పడింది. అందుకే నీ గురించి అందరికీ చెప్పేస్తాను. చంద్ర తప్పు ఏం లేదని ఇప్పుడే చెప్పేస్తాను అని రఘురాం మంచంపై లేవడానికి ప్రయత్నిస్తాడు. మరోవైపు అందరికీ మామయ్య లేచి కూర్చున్నారని చంద్ర చెప్తుంది.
శాలిని యొక్క ప్రమాదకర ప్రయత్నం
మామయ్య నా గురించి చెప్పేస్తే క్రాంతి అసహ్యించుకుని ఇంట్లో నుంచి గెంటేస్తాడని శాలిని కంగారు పడుతుంది. లేచి నడుస్తున్న రఘురాం దగ్గరకు వచ్చి శాలిని క్షమించాలని కోరుతుంది. ఇటు చంద్ర చెప్పేది నమ్మకపోవడంతో రండి చూపిస్తానని తీసుకెళ్తుంది. అప్పుడే శాలిని ఓ రాడ్ తో రఘురాం తలపై బలంగా కొడుతుంది. దీంతో రఘురాం కిందపడిపోతాడు. శాలిని వెళ్లిపోతుంది.
రఘురాం తలలో నుంచి రక్తం వస్తుంది. పల్స్ ఉందని విరాట్ అంటాడు. చంద్రను తిడతారు శ్యామల, కామాక్షి. రఘురాం ను హాస్పిటల్ కు తీసుకెళ్తారు. ట్రీట్మెంట్ జరిగి మామయ్య కోలుకుంటే నా గురించి బయటపడుతుంది ఎలా? అనుకుంటుంది శాలిని. చంద్రకు ధైర్యం చెప్తాడు అర్జున్. బాడీ టెంపరేచర్, బీపీ డౌన్ అయ్యాయి. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాం. ఎంఆర్ఐ స్కాన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. మామయ్యను కోలుకోకుండా చేయమని డాక్టర్ ను కన్వీన్స్ చేయాలని శాలిని ట్రై చేస్తుంది.
చంద్రకళపై పడిన అపవాదు
కదలిక వస్తే పక్కనుండాల్సింది పోయి బయటకు వస్తావా? నిర్లక్ష్యంతో ప్రాణం మీదకు తీసుకొస్తావా? అని చంద్రపై శాలిని ఫైర్ అవుతుంది. మామయ్యను బెడ్ పై కూర్చొబెట్టి వచ్చా. కానీ ఆయన నడుస్తారని అనుకోలేదని చంద్ర అంటుంది. మధ్యలో అర్జున్ వస్తే నీకు సంబంధించిన విషయం కాదు మౌనంగానే ఉంటే మంచిందని శ్యామల అంటుంది. ఇందులో వదిన తప్పేం ఉందని క్రాంతి కూడా అంటాడు. కానీ శ్యామల, కామాక్షి, శ్రుతి చంద్రనే తిడతారు.
వదినదే తప్పంటున్నారు. నువ్వే కన్వీన్స్ చేయాలి. వదినకు సపోర్ట్ చేయాలని శాలినిని తీసుకెళ్తాడు క్రాంతి. ఆ ఆనందాన్ని పంచుకోవాలనుకుంది. ఎవరైనా అలాగే చేసేవాళ్లమని శాలిని అంటుంది. కానీ శ్యామల వినిపించుకోకుండా అరుస్తూనే ఉంటుంది. తను కావాలనే చేసిందో ఎవరికో తెలుసని శ్రుతి అంటుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుందని నువ్వే కిందపడేశావని కామాక్షి అనడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
శాలిని యొక్క కుట్రలు బయటపడతాయా? చంద్రకళ తన పేరు మీద పడిన నింద నుంచి ఎలా బయటపడుతుంది? రఘురాం ప్రాణాలకు ప్రమాదం ఎలా తప్పిస్తుంది? తదుపరి ఎపిసోడ్స్ లో మరిన్ని ఉత్కంఠభరిత సంఘటనలు.


