
📌 Key Points
- నిన్ను కోరి సీరియల్‌లో చంద్ర గర్భవతి అనే షాకింగ్ ట్విస్ట్!
- విరాట్ ల్యాండ్ డాక్యుమెంట్లను కొట్టేసిన శాలిని – కుట్రలు పన్నుతున్న వైనం.
- జల్ రాజ్ ట్రావెల్ బిజినెస్ స్టార్ట్ – పెట్టుబడి పెట్టిన వారు ఎవరనేది సస్పెన్స్.
- శాలిని పశ్చాత్తాపం నటిస్తోందని క్రాంతి అనుమానం – నిజమెంత?
నిన్ను కోరి సీరియల్‌లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్ర గర్భవతి అవ్వడం, శాలిని కుట్రలు, జల్ రాజ్ కొత్త బిజినెస్ ప్లాన్‌తో కథనం ఆసక్తికరంగా మారింది. అసలేం జరుగుతుందో చూద్దాం!
చంద్ర ప్రెగ్నెన్సీతో షాక్!
Ninnu Kori Serial March 7th Episode: నిన్ను కోరి సీరియల్ మార్చి 7 ఎపిసోడ్‌లో జల్ రాజ్ ట్రావెల్ బిజినెస్ పెడుతున్నట్లు, దానికి పంతులుతో ముహుర్తం పెడుతున్నట్లు తల్లికి, శ్రుతికి చెబుతాడు. మరోవైపు విరాట్ ల్యాండ్ ఇష్యూ గురించి లాయర్‌తో క్రాంతి మాట్లాడుతుంటే శాలిని వచ్చి హెల్ప్ చేస్తానంటుంది.
Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో జల్ రాజ్ లెక్కలు వేస్తుంటాడు. రేపు షాపింగ్‌కు తీసుకెళ్లాలని చెప్పానుగా మర్చిపోకని శ్రుతి అంటుంది. అప్పు తీరేలా లేదని పిచ్చోడివి అయిపోయావా అని తల్లి అంటుంది. కొద్దిసేపు అంతా సైలెంట్‌గా ఉండమని ఇంగ్లీష్‌లో అంటాడు రాజ్.
శ్రుతి, తల్లి ఇద్దరు షాక్ అవుతారు. మరి అంత డబ్బు ఎక్కడిది అని అడుగుతారు. నా మీద నమ్మకంతో పెట్టుబడి పెట్టేవాళ్లు ఉన్నారు. నా బిజినెస్‌ను నువ్వు ఆపలేవు శ్రుతి అని రాజ్ అంటాడు. వెంటనే వెళ్లి జల్ రాజ్ ట్రావెల్ బిజినెస్ పెడుతున్నాడని, ఈసారి అతని చాలా కాన్పిడెంట్‌గా ఉన్నాడు, ఎవరో పెట్టుబడి పెడుతున్నారని చెబుతుంది.
విరాట్ భూమికి ఎసరు పెట్టిన శాలిని!
ఎక్కడో సెట్ చేసి ఉంటాడు. అయినా పెట్టని, అక్కడ కూడా గళ్లపెట్టే నీదే కదా అని కామాక్షి అంటుంది. మరోవైపు ల్యాండ్ ఇష్యూ గురించి లాయర్‌తో క్రాంతి మాట్లాడుతాడు. ఏ డాక్యుమెంట్ కావాలన్న తీసుకొస్తానని క్రాంతి అంటాడు. లాయర్, కోర్టు చుట్టూ తిరిగితే చాలా టైమ్ పడుతుంది. రిజిస్టర్ ఆఫీస్‌లో నాకు తెలిసిన వాళ్లు ఉన్నారు. నువ్వు ఒకే అంటే నేను హెల్ప్ చేస్తానని శాలిని అంటుంది.
అప్పటి శాలిని కాదు, చూడు ఎలా ఏడుస్తుందో అని చంద్రకళ అంటుంది. అయ్యో వదినా తన నటన గురించి నీకు తెలియదా. ఈ గుంటనక్క సాధు జంతువుల మారిందంటే మీరంతా నమ్ముతారేమే నేను నమ్మను అని క్రాంతి అంటాడు. ఎందుకు అర్థం చేసుకోవట్లేదని ఏడుస్తుంది శాలిని. నువ్వు చేసిన పాపాలకు నిన్ను క్షమించడం జరగదని క్రాంతి అంటాడు.
నిజమే, కానీ ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాను. నీతో ప్రశాంతంగా బతకాలని ఆశపడుతున్నాను. నేను మారానని చెప్పడానికి ఏ చిన్న అవకాశం దొరికిన వాడుకోవాలని చూస్తున్నా. అది నీకు తప్పుగా కనిపిస్తే ఏం చేయను. ఇప్పుడున్న శాలిని చచ్చిన పాముతో సమానం. నీ మాటలతో ఇంకా చంపకు. దీనికన్న ఒక్కసారిగా ప్రాణం తీసేయ్ అని శాలిని డ్రామా చేస్తుంది.
జల్ రాజ్ కొత్త బిజినెస్ ప్లాన్!
వదినకు దిష్టి తీయమని క్రాంతి అంటాడు. స్వీట్స్ ఇవ్వమని రఘురాం అంటాడు. చంద్రకు జగదీశ్వరి దిష్టి తీస్తుంది. చంద్రకు విరాట్ స్వీట్ తినిపిస్తాడు. అందరికి శ్యామల స్వీట్స్ ఇస్తారు. స్ట్రెస్ లేకుండా ఉండండి, చేయాల్సిన పనులు చేసుకోండి. పరిగెత్తకండి, ఈ పౌడర్ ఒకటి పాలల్లో కలిపి ఇవ్వండని డాక్టర్ చెప్పి వెళ్లిపోతుంది.
చంద్రకు గాలి తగలాలి దూరంగా ఉండండని, నా భార్య ఈ ఇంటికి వారసుడుని ఇవ్వబోతుందని హడావిడి చేస్తాడు విరాట్. కొద్దిరోజులు అయితే ఇంట్లో ఉండనిచ్చేలా లేవుగా అని శ్యామల అంటుంది. జగదీశ్వరి కొడుకుకు సపోర్ట్ చేస్తుంది. వాళ్లను ఒంటరిగా వదిలేద్దామని రఘురాం అనడంతో అంతా వెళ్లిపోతారు. చంద్రకళ ను ఎత్తుకుని గదిలోకి తీసుకెళ్తాడు విరాట్.
ల్యాండ్ సమస్యలో ఒక లింక్‌డ్ డాక్యుమెంట్ ఉండాలట, అది మిస్ అయిందని క్రాంతి అంటాడు. ఆ మాటలు విన్న శాలిని ఆ లింక్‌డ్ డాక్యుమెంట్ నేనే కొట్టేశా అని మురిసిపోతుంది శాలిని. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
నిన్ను కోరి సీరియల్ కథనం మలుపులు తిరుగుతోంది. చంద్ర ప్రెగ్నెన్సీ, శాలిని కుట్రలు, జల్ రాజ్ బిజినెస్‌తో ఏం జరుగుతుందో వేచి చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


